iDreamPost
android-app
ios-app

కత్తి విన్యాసంతో అదరకొట్టి నెటిజనుల ప్రశంసలు అందుకుంటున్న జడేజా

  • Published Apr 13, 2020 | 11:15 AM Updated Updated Apr 13, 2020 | 11:15 AM
  • Published Apr 13, 2020 | 11:15 AMUpdated Apr 13, 2020 | 11:15 AM
కత్తి విన్యాసంతో అదరకొట్టి నెటిజనుల ప్రశంసలు అందుకుంటున్న జడేజా

భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా బ్యాటింగ్‌లో అర్థ సెంచరీ లేదా సెంచరీ సాధించిన తర్వాత మైదానంలో బ్యాట్‌ని కత్తిలా తిప్పుతూ సంబరాలలో మునిగి తేలుతాడు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు నాయకత్వం వహిస్తున్న డేవిడ్ వార్నర్ గత ఏడాది ఒక యాడ్ కోసం జడేజా లాగా బ్యాట్‌ని కత్తిలా తిప్పాడు.అయితే ఈ వీడియోను నాలుగు రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు.

అంతే కాక ఆసీస్ ఓపెనర్ వార్నర్ “నేను కూడా జడ్డూలాగే బ్యాట్‌ తిప్పానా?” అని నెటిజెన్ల అభిప్రాయం కోరాడు. దీంతో నకిలీ,వర్జినల్ అంటూ జడేజా పాత వీడియోలను సోషల్ మీడియా‌లో భారత అభిమానులు షేర్ చేస్తూ వార్నర్‌ను టోల్ చేశారు. ఈ నేపథ్యంలో జడేజా జామ్‌నగర్‌లోని తన ఇంట్లో ఆదివారం కత్తితో విన్యాసాలు చేసిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు.

మైదానంలో చురుకుగా కదులుతూ క్లిష్టతరమైన క్యాచ్‌లను ఒడిసి పట్టుకొనే రాజ్‌పుత్ కుటుంబానికి చెందిన జడేజా‌కి గుర్రపు స్వారి,కత్తిసాములలో మంచి ప్రావీణ్యం ఉంది. దీంతో కత్తిని లాఘవంగా తిప్పుతున్న వీడియోను తన అభిమానులతో పంచుకున్న జడేజా ‘‘కత్తిలో పదును తగ్గొచ్చు కానీ, గురువు మాటను కాదనదు ’’ అనే కామెంట్‌ను కూడా జత చేశాడు.

జడ్డూ వీడియోని చూసిన ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ మైఖేల్‌ వాన్‌ “ఇప్పుడు నీ లాన్‌లో గడ్డిని కత్తిరించడానికి యంత్రం కావాలి” అని సరదాగా వ్యాఖ్యానించాడు. ఈ కత్తి విన్యాస వీడియోను తిలకించిన నెటిజనులు మాత్రం శభాష్ జడ్డూ భాయ్ అంటున్నారు.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetstarzbetstarzbetStarzbetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş