కరోనా వైరస్ ప్రభావంతో అష్టదిగ్భందనంలో చిక్కుకున్న ఆర్థిక వ్యవస్థకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఉపసమన చర్యలు చేపట్టింది. లాక్ డౌన్ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ కుంటుపడకుండా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆర్బీఐ గవర్న్‌ర్ శక్తికాంత్ దాస్ పలు నిర్ణయాలను కొద్దిసేపటి క్రితం వెల్లడించారు. రెపో రేట్‌ను 5.5 శాతం నుంచి 4.4 శాతానికి తగ్గించారు. ఈ నిర్ణయం బ్యాంకులు ఆర్బీఐ నుంచి రుణాలు తీసుకునేందుకు దోహదం చేస్తుంది. తక్కువ వడ్డీ రేటుతో బ్యాంకులు […]