నటనతో పాటు బాడీ లాంగ్వేజ్ లోనూ వైవిధ్యాన్ని చూపించే బాలీవుడ్ యాక్టర్ ఇర్ఫాన్ ఖాన్ ఈ రోజు కన్ను మూశారు. గత కొన్నేళ్ళుగా క్యాన్సర్ రూపంలో తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న ఇర్ఫాన్ ఖాన్ తిరిగి కోలుకుని సినిమాల్లో నటిస్తున్నారని సంతోషించేలోపే ఈ దుర్వార్త వినడం అభిమానులను కృంగదీస్తోంది. 1988లో సలాం బోంబేతో కెరీర్ మొదలుపెట్టిన ఇర్ఫాన్ ఖాన్ తన 32 ఏళ్ళ కెరీర్ లో భారీ సంఖ్యలో చిత్రాలు చేయకపోయినా ఎవరూ టచ్ చేయని సబ్జెక్ట్స్ […]
2017లో ఇర్ఫాన్ ఖాన్ ప్రధాన పాత్రలో వచ్చిన ‘హిందీ మీడియం’ ఎంత సంచలన విజయం సాధించిందో చూశాం. చైనాలో అనువదించి విడుదల చేస్తే అక్కడా వందల కోట్లు వసూలు చేసి ఔరా అనిపించింది. సాకేత్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాలో డీల్ చేసిన కాన్సెప్ట్ ప్రేక్షకులకు బ్రహ్మాండంగా కనెక్ట్ అయ్యింది. ఇప్పుడు మూడేళ్ళ తర్వాత అదే తరహాలో మరో సినిమాతో వచ్చాడు ఇర్ఫాన్ ఖాన్. అదే అంగ్రేజీ మీడియం. చెప్పుకోదగ్గ అంచనాలతోనే నిన్న రిలీజయింది. ఆమధ్య […]