ఇటలీలో కరోనా వైరస్ దెబ్బకు అందరూ వణికిపోతున్నారు. వైరస్ దెబ్బకు ఇప్పటికి దాదాపు 85 వేలమంది బాధితులైపోయారు. వీళ్ళు కాకుండా మరో 12500 మంది మరణించారు. బాధితుల సంఖ్య, మరణాల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. ఒక విధంగా వైరస్ ను నియంత్రించటంలో ఇటలీ ప్రభుత్వం చేతులెత్తేసినట్లే అనుకోవాలి. సరే ఈ విషయాలను పక్కన పెట్టేస్తే మరణిస్తున్న వారి సంఖ్య ప్రతిరోజు పెరిగిపోతుండటంతో వాటిని ఖననం చేయటం తలకు మించిన భారమైపోతోందట. రోజుకు కొన్ని వందల మంది […]