ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఓవైపు నిధుల కొరత తీవ్రంగా కనిపిస్తోంది. ఆదాయం అమాంతంగా పడిపోతోంది. అదే సమయంలో సంక్షేమం పొంగిపొర్లుతోంది. కొత్త పథకాలతో , వివిధ తరగతులకు నేరుగా ప్రయోజనం కల్పించే ప్రయత్నం జోరుగా సాగుతోంది. ఓవైపు ఆర్థిక కష్టాలు ఉన్నా సంక్షేమ కార్యక్రమాలు ఆగకపోవడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. విపక్షాలకు అంతుబట్టని విషయంగా మారింది. ఇటీవల ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా ఎవరికి ఎన్ని పరిమితులు ఉన్నప్పటికీ ప్రతీ సమీక్షుడు ఓ విషయంలో […]