iDreamPost

వన్డే కప్ పోయినా టీ20 వరల్డ్ కప్ మనదే అంటున్న భారత మాజీ కోచ్!

  • Author singhj Published - 06:02 PM, Tue - 28 November 23

వన్డే వరల్డ్ కప్ పోయినా టీ20 కప్పు మాత్రమే మనదేనని భారత మాజీ కోచ్ అంటున్నాడు. ఈసారి అస్సలు మిస్సవ్వదని చెబుతున్నాడు.

వన్డే వరల్డ్ కప్ పోయినా టీ20 కప్పు మాత్రమే మనదేనని భారత మాజీ కోచ్ అంటున్నాడు. ఈసారి అస్సలు మిస్సవ్వదని చెబుతున్నాడు.

  • Author singhj Published - 06:02 PM, Tue - 28 November 23
వన్డే కప్ పోయినా టీ20 వరల్డ్ కప్ మనదే అంటున్న భారత మాజీ కోచ్!

వన్డే ప్రపంచ కప్-2023 హడావుడి ముగియడంతో ఇప్పుడు అందరూ ఇతర టోర్నమెంట్​ల మీద ఫోకస్ చేస్తున్నారు. ప్రతి టీమ్ ఏదో ఒక సిరీస్ ఆడుతూ బిజీ అయిపోయింది. వరల్డ్ కప్​లో తమ ఫెయిల్యూర్​కు కారణాలు ఏంటో వెతకడంపై మరికొన్ని టీమ్స్ తలమునకలై ఉన్నాయి. కొన్ని దేశాలు తమ జట్లను ప్రక్షాళన కూడా చేస్తున్నాయి. మెగా టోర్నీ సెమీస్​కు వెళ్లడంలో ఫెయిలవ్వడంతో పాక్ క్రికెట్​ను పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నారు. చీఫ్ సెలక్టర్ నుంచి టీమ్ డైరెక్టర్ వరకు.. కెప్టెన్ నుంచి కోచింగ్ స్టాఫ్ వరకు అందరూ కొత్తవారినే నియమించారు. శ్రీలంకలో అయితే ఆ దేశ క్రికెట్ బోర్డును ఏకంగా రద్దు చేశారు. ఈ దేశాల పరిస్థితి ఇలా ఉంటే.. అటు ఫైనల్ మ్యాచ్ ఆడిన ఇండియా, ఆస్ట్రేలియాలు మరో సిరీస్​ ఆడుతూ ఆడియెన్స్​ను ఎంటర్​టైన్ చేస్తున్నాయి. ఈ రెండు టీమ్స్ మధ్య 5 టీ20ల సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే.

కంగారూలతో టీ20 సిరీస్​లో ఇప్పటికే రెండు మ్యాచులు అయిపోయాయి. ఇవాళ ఒడిశాలోని గువాహటి వేదికగా మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ సిరీస్​లో 2-0 ఆధిక్యంతో ఉన్న టీమిండియా.. ఆ లీడ్​ను 3-0గా చేసి సిరీస్​ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. మరోవైపు ఆసీస్ మాత్రం సిరీస్​లో నిలవాలంటే ఈ మ్యాచ్​లో గెలుపు తప్పనిసరి కాబట్టి ఎలాగైనా నెగ్గాలని చూస్తోంది. ఈ సిరీస్​లో గెలుపోటములను పక్కనబెడితే.. యంగ్​స్టర్స్​ను ప్రయోగించడం ద్వారా టీ20 వరల్డ్ కప్​ స్క్వాడ్​ను రెడీ చేసుకుంటోంది భారత్. సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్​తో పాటు గాయపడిన హార్దిక్ పాండ్యా కూడా టీమ్​లోకి వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి యువ ఆటగాళ్లను ఇప్పటి నుంచి పరీక్షిస్తూ వరల్డ్ కప్​కు ముందే ఫైనల్ ఎలెవన్​పై ఓ అంచనాకు రావాలని అనుకుంటోంది. వన్డే ప్రపంచ కప్ మిస్సయినందున టీ20 కప్పునైనా చేతబట్టాలని చూస్తోంది.

పొట్టి ఫార్మాట్​లో భారత్ వరల్డ్ కప్ ఆశలపై మాజీ చీఫ్ కోచ్ రవిశాస్త్రి రియాక్ట్ అయ్యాడు. మన టీమ్ తప్పకుండా టీ20 వరల్డ్ కప్ కొడుతుందన్నాడు. ‘వరల్డ్ కప్ ఓటమి హృదయాలను ముక్కలు చేసింది. కప్ నెగ్గలేదనే బాధ ఇంకా వెంటాడుతోంది. అయితే మెగా టోర్నమెంట్​లో మనదే అత్యంత బలమైన జట్టని చెప్పాలి. సచిన్ టెండూల్కర్ లాంటి లెజెండరీ క్రికెటర్ కూడా వరల్డ్ కప్ కోసం ఆరో టోర్నీ దాకా ఎదురు చూశాడు. కప్పు గెలవడం అంత ఈజీ కాదు. ఆ రోజు గొప్పగా ఆడాలి. అయితే టీమ్​లోని యంగ్​స్టర్స్ నేర్చుకుంటారు. గేమ్ అనేది కొనసాగుతూనే ఉంటుంది. అతి త్వరలోనే టీమిండియా ప్రపంచ కప్ నెగ్గడం చూస్తాం. మన దేశంలో ఎంతో మంది టాలెంటెడ్ యంగ్​ క్రికెటర్స్ ఉన్నారు’ అని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు. మరి.. భారత్ కప్పు గెలుస్తుందంటూ రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యల మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: భారత్​తో టీ20 సిరీస్ మధ్యలోనే స్వదేశానికి ఆసీస్ క్రికెటర్లు.. మాక్స్​వెల్ సహా..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి