iDreamPost

Aquaman 2 OTT: అఫీషియల్ : OTT లోకి అక్వామెన్ 2.. ఎక్కడ చూడాలంటే !

  • Published Apr 27, 2024 | 3:55 PMUpdated Apr 27, 2024 | 3:55 PM

ఓటీటీ లో అనేక సినిమాలు వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలో అందరూ మెచ్చే ఓ హాలీవుడ్ సినిమా త్వరలో ఓటీటీ లోకి రానుంది. మరి ఆ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది అనే విషయాలనే చూసేద్దాం.

ఓటీటీ లో అనేక సినిమాలు వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలో అందరూ మెచ్చే ఓ హాలీవుడ్ సినిమా త్వరలో ఓటీటీ లోకి రానుంది. మరి ఆ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది అనే విషయాలనే చూసేద్దాం.

  • Published Apr 27, 2024 | 3:55 PMUpdated Apr 27, 2024 | 3:55 PM
Aquaman 2 OTT: అఫీషియల్ : OTT లోకి అక్వామెన్ 2.. ఎక్కడ చూడాలంటే !

సినిమా అంటే కథ మాత్రమే ముఖ్యం అనుకుని.. అది ఏ భాషలో వచ్చినా కానీ.. ఆయా సినిమాలను చూస్తూ ఉంటున్నారు ప్రేక్షకులు. దీనితో కేవలం టాలీవుడ్ సినిమాలకే కాకుండా అటు హాలీవుడ్ సినిమాలకు కూడా బాగానే క్రేజ్ పెరుగుతూ వస్తుంది. ఈ క్రమంలోనే హాలీవుడ్ సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ కూడా తెలుసుకుంటూ ఉంటున్నారు ప్రేక్షకులు. ఇక ఇప్పుడు త్వరలో అందరు మెచ్చే ఓ హాలీవుడ్ బ్లాక్ బస్టర్ ఎంటర్టైనర్ “అక్వామెన్ అండ్ ది లాస్ట్ కింగ్‌డ‌మ్” మూవీ ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. మరి ఈ సినిమా ఏ ప్లాట్ ఫార్మ్ లో రిలీజ్ అవుతోంది. ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే వివరాల గురించి తెలుసుకుందాం.

గత ఏడాది ఇండియాలో అక్వామెన్ సీక్వెల్‌తో పాటు, డంకీ, స‌లార్ సినిమాలు ఒకేసారి రిలీజ్ అయ్యాయి. దీనితో ఈ సినిమా కాస్త వెనుకబడింది. ఆ కారణం చేత ఈ సినిమా గురించి అంతగా బజ్ వినిపించలేదు. కానీ ఈ సినిమా నిర్మాతలకు మాత్రం భారీ లాభాలనే తెచ్చిపెట్టింది. 2018 లో రిలీజ్ అయినా అక్వామెన్‌కు సీక్వెల్‌గా వచ్చిన సినిమానే.. “అక్వామెన్ అండ్ ది లాస్ట్ కింగ్‌డ‌మ్”. సుమారు 215 మిలియన్ల బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమా దాదాపు 435 మిలియన్లకు పైగా వసూళ్లను సంపాదించింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ లోకి రానుంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్.. అమెజాన్ ప్రైమ్ లో ఆల్రెడీ స్ట్రీమింగ్ అవుతుండగా.. ఇప్పుడు మరొక ఓటీటీ జియో సినిమా ప్లాట్ ఫార్మ్ లోకి కూడా మే 21 నుంచి అంబాటులోకి రావడం విశేషం. . జియో ప్రీమియ‌ర్ స‌బ్‌స్కైబ‌ర్లు ఎలాంటి యాడ్స్ లేకుండా సినిమాను చూసేయొచ్చు.

ఇక అక్వామెన్ 2 క‌థ విషయానికొస్తే.. మొదటి భాగంలో అక్వామెన్ క్యారెక్ట‌ర్ చేసిన జోస‌న్ మోమోవాపై తెరకెక్కించిన సన్నివేశాలకు.. మంచి గుర్తింపు లభించింది. అయితే, ఒక యుద్ధంలో తన సోదరుడు ఓర‌మ్‌ను ఓడించిన అక్వామెన్ .. రాజు అవుతాడు. ఆ తర్వాత మోరను పెళ్లి చేసుకుని హ్యాపిగా జీవిస్తూ ఉంటాడు. మరో వైపు అక్వామెన్‌ పై పగతో రగిలిపోయిన.. డేవిడ్ కెన్.. కొన్ని కొత్త శక్తులు కూడకట్టుకుని.. అక్వామెన్‌ పై మళ్ళీ యుద్దానికి వస్తాడు. ఈ క్రమంలో అక్వామెన్‌ ఆ యుద్దాన్ని ఎలా ఎదుర్కున్నాడు ! అతను కొత్త శక్తుల ముందు ఇతని బలం సరిపోయిందా ! ఈ పోరాటంలో ఎవరు గెలిచారు ! ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. మరి ఈ సినిమా ఓటీటీ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి