iDreamPost

DC vs MI: జేక్ ఫ్రేజర్ ఫాస్టెస్ట్ ఫిఫ్టీ.. బుమ్రాను కూడా వదలకుండా పిచ్చకొట్టుడు కొట్టాడు!

  • Published Apr 27, 2024 | 4:00 PMUpdated Apr 27, 2024 | 4:12 PM

ఢిల్లీ క్యాపిటల్స్ చిచ్చరపిడుగు జేక్ ఫ్రేజర్ తుఫాన్ ఇన్నింగ్స్​తో మెరిశాడు. ముంబై ఇండియన్స్​ బౌలింగ్ యూనిట్​తో ఓ రేంజ్​లో ఆటాడుకున్నాడు.

ఢిల్లీ క్యాపిటల్స్ చిచ్చరపిడుగు జేక్ ఫ్రేజర్ తుఫాన్ ఇన్నింగ్స్​తో మెరిశాడు. ముంబై ఇండియన్స్​ బౌలింగ్ యూనిట్​తో ఓ రేంజ్​లో ఆటాడుకున్నాడు. 15 బంతుల్లోనే 52 పరుగులు చేశాడు. ఫస్ట్ బాల్ నుంచే హిట్టింగ్ స్టార్ట్ చేసిన ఈ యంగ్ బ్యాటర్.. వచ్చిన బాల్​ను వచ్చినట్లు బౌండరీకి తరలించాడు. ఇప్పటివరకు 21 బంతులు ఎదుర్కొన్న ఫ్రేజర్ 10 ఫోర్లు, 4 సిక్సుల సాయంతో 68 పరుగులతో నాటౌట్​గా ఉన్నాడు. ముంబై ఏస్ బౌలర్ జస్​ప్రీత్ బుమ్రాను కూడా అతడు వదల్లేదు.

బుమ్రా బౌలింగ్​లో తొలి బంతినే సిక్స్​గా మలిచాడు ఫ్రేజర్. ల్యూక్ వుడ్, నువాన్ తుషార లాంటి ఇతర బౌలర్లకు కూడా చుక్కలు చూపించాడు. ఎలా వేసినా బంతుల్ని ఫ్రేజర్​ బౌండరీలకే పంపిస్తుండటంతో ముంబై బౌలర్లు గుడ్లు తేలేశారు. ఈ హాఫ్ సెంచరీతో అతడు రికార్డు సృష్టించాడు. ఈ సీజన్​లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీస్ బాదిన వారిలో అతడు టాప్​లో ఉన్నాడు. అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున అత్యంత వేగంగా అర్ధ శతకాన్ని నమోదు చేసిన ప్లేయర్​గానూ నిలిచాడు. మరి.. ఫ్రేజర్ ఇన్నింగ్స్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి