iDreamPost

భారత్​తో టీ20 సిరీస్ మధ్యలోనే స్వదేశానికి ఆసీస్ క్రికెటర్లు.. మాక్స్​వెల్ సహా..!

  • Author singhj Published - 04:22 PM, Tue - 28 November 23

టీమిండియాతో టీ20 సిరీస్ మధ్యలోనే కొందరు ఆసీస్ క్రికెటర్లు తమ స్వదేశానికి వెళ్లిపోనున్నారు. వెళ్లిపోయే వారిలో గ్లెన్ మాక్స్​వెల్ సహా పలువురు స్టార్లు ఉన్నారు.

టీమిండియాతో టీ20 సిరీస్ మధ్యలోనే కొందరు ఆసీస్ క్రికెటర్లు తమ స్వదేశానికి వెళ్లిపోనున్నారు. వెళ్లిపోయే వారిలో గ్లెన్ మాక్స్​వెల్ సహా పలువురు స్టార్లు ఉన్నారు.

  • Author singhj Published - 04:22 PM, Tue - 28 November 23
భారత్​తో టీ20 సిరీస్ మధ్యలోనే స్వదేశానికి ఆసీస్ క్రికెటర్లు.. మాక్స్​వెల్ సహా..!

టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న 5 టీ20ల సిరీస్ అభిమానుల్ని బాగా ఆకట్టుకుంటోంది. ఈ సిరీస్​లో భాగంగా ఇప్పటిదాకా జరిగిన రెండు మ్యాచుల్లోనూ భారత్​దే పెత్తనం నడిచింది. విశాఖపట్నంలో జరిగిన ఫస్ట్ టీ20 ఆఖరి వరకు ఉత్కంఠగా సాగింది. రెండు టీమ్స్ చివరి దాకా పోరాడినప్పటికీ అందులో భారత్​దే పైచేయి అయింది. తిరువనంతపురం వేదికగా జరిగిన రెండో మ్యాచ్​లో మాత్రం మన టీమ్ దాదాపుగా వన్​సైడ్​గా నెగ్గింది. ఈ మ్యాచ్​లో అటు బ్యాటింగ్​తో పాటు ఇటు బౌలింగ్, ఫీల్డింగ్​లోనూ టీమిండియా అదరగొట్టింది. కంగారూ టీమ్​కు ఎక్కడా ఛాన్స్ ఇవ్వకుండా అదిరిపోయే పెర్ఫార్మెన్స్​తో సిరీస్​లో 2-0 లీడ్ సాధించింది. ఈ సిరీస్​లో మూడో మ్యాచ్​ ఇవాళ (నవంబర్ 28వ తేదీ) జరగనుంది. ఒడిశాలోని గువాహటి ఈ మ్యాచ్​కు ఆతిథ్యం ఇస్తోంది. ఈ మ్యాచ్​లో ఎలాగైనా గెలవాలని పర్యాటక జట్టు పట్టుదలతో ఉంది.

మూడో మ్యాచ్​లోనూ నెగ్గి సిరీస్​ను 3-0తో కైవసం చేసుకోవాలని యంగ్ ఇండియా కోరుకుంటోంది. ఇరు టీమ్స్​కు గెలుపు కంప్సలరీ కాబట్టి ఈ మ్యాచ్​ ఆఖరి వరకు ఉత్కంఠగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలి రెండు టీ20ల్లో భారత జట్టు బ్యాటింగ్​లో చాలా స్ట్రాంగ్​గా పెర్ఫార్మ్ చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ నుంచి ఫినిషర్ రింకూ సింగ్ వరకు అందరూ తమకు ఇచ్చిన బాధ్యతలను చక్కగా నిర్వర్తించారు. తమ రోల్​కు తగ్గట్లు ఆడుతూ జట్టుకు భారీ స్కోరును అందించారు. కొత్త కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా బ్యాటింగ్​లో దుమ్మురేపుతున్నాడు. బ్యాటింగ్​లోనే గాక కరెక్ట్ టైమ్​లో ఫీల్డింగ్, బౌలింగ్ ఛేంజెస్ చేస్తూ విజయాల్లో కీలక పాత్రో పోషిస్తున్నాడు. తనకు అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకుంటూ ఆసీస్​పై ఒత్తిడి పెంచుతున్నాడు. ఇది వర్కౌట్ కావడంతో రెండు మ్యాచుల్లోనూ విక్టరీ కొట్టాం. ఈ సిరీస్ మొత్తం అతడు దీన్ని కంటిన్యూ చేయాల్సి ఉంటుంది.

ఇక, భారత్​తో మిగతా సిరీస్ కోసం ఆస్ట్రేలియా తమ టీమ్​లో భారీ మార్పులు చేసింది. జట్టులోని 6 మంది కీలక ప్లేయర్లకు రెస్ట్ ఇచ్చింది. వరల్డ్ కప్​లో ఆడిన ఆరుగురు ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చిన క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ).. వారి స్థానాల్లో కొత్తవారికి ఛాన్స్ ఇచ్చింది. కంగారూ స్పిన్నర్ ఆడమ్ జంపాతో పాటు సీనియర్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ ఇప్పటికే స్వదేశానికి వెళ్లిపోయారు. గువాహటి వేదికగా జరిగే మూడో టీ20 తర్వాత గ్లెన్ మాక్స్​వెల్​తో పాటు మార్కస్ స్టొయినిస్, జోష్ ఇంగ్లిస్, సీన్ అబాట్ ఆసీస్​కు పయనం కానున్నారు. వరల్డ్ కప్ టీమ్​లో ఆడిన ట్రావిస్ హెడ్ మాత్రమే భారత్​తో టీ20 సిరీస్​లో కంటిన్యూ అవ్వనున్నాడు. ఆసీస్​ను వెళ్లిపోనున్న ప్లేయర్ల ప్లేస్​లో బెన్ డార్వ్​షుయిస్, క్రిస్ గ్రీన్, ఆరోన్ హార్డీ, బెన్ మెక్​డొర్మేట్, కేన్ రిచర్డ్​సన్, జోష్ ఫిలిప్ జాయిన్ కానున్నారు. మరి.. కంగారూ టీమ్ సిరీస్ మధ్యలో ఇలా భారీ మార్పులు చేయడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: RCBలో కోహ్లీ కంటే ఎక్కువ డిమాండ్‌ ఈ యంగ్‌ క్రికెటర్‌కే!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి