iDreamPost

అలాంటి రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం శుభవార్త.. ఇకపై అది కూడా..

Antyodaya Anna Yojana Cardholders: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనలో తనదైన దూకుడు పెంచింది. ఈ క్రమంలోనే అంత్యోదయ అన్న యోజన (ఎఎవై) కార్డుదారులకు ఉగాది సందర్భంగా తీపి కబురు అందించింది.

Antyodaya Anna Yojana Cardholders: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనలో తనదైన దూకుడు పెంచింది. ఈ క్రమంలోనే అంత్యోదయ అన్న యోజన (ఎఎవై) కార్డుదారులకు ఉగాది సందర్భంగా తీపి కబురు అందించింది.

అలాంటి రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం శుభవార్త.. ఇకపై అది కూడా..

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నాయి.  తాజాగా అంత్యోదయ అన్నయోజన రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాష్ట్రంలో నిరుపేదల సంక్షేమం కోసం వివిధ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం రేషన్ కార్డుదారుల ప్రయోజనం కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది.  దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న కుటుంబాల కోసం అంత్యోదయ అన్న యోజన (ఎఎవై) పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా రేషన్ డీలర్లకు పౌరసరఫరాల శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. అవి ఏంటో తెలుసుకుందాం..

కేంద్ర ప్రభుత్వం అంత్యోదయ అన్న యోజన (ఎఎవై) పథకం కింద అర్హులైన నిరుపేద కుటుంబ సభ్యులకు నెల నెల ఒక్కో కుటుంబానికి సబ్సిడీ పై 35 కిలోల బియ్యం లేదా గోదుమలు పంపిణీ చేస్తుంది. వీటితో పాటు చక్కెర కూడా పంపిణీ చేస్తారు. కానీ తెలంగాణ మాత్రం రేషర్ డీలర్లు అంత్యోదయ అన్న యోజన రేషన్ కార్డు ఉన్న వారికి బియ్యం, గోదుమలు మాత్రమే పంపిణీ చేస్తున్నారు. చక్కర మాత్రం ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో అంత్యోదయ కార్డుదారులకు చక్కెర పంపిణీ చేయాలని పౌరసరఫరాల శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. అంత్యోదయ అన్న యోజన (ఎఎవై) కార్డుదారులకు ఉగాది సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది.

తెలంగాణ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో అంత్యోదయ అన్న యోజన (ఎఎవై) 5.99 లక్షల రేషన్ కార్డుదారులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ పథకం కింద ప్రతి నెల 599 మెట్రిక్ టన్నుల చక్కరను ప్రభుత్వం రేషన్ డీలర్ల ద్వారా పంపిణీ చేయనుంది. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎఎవై కార్డుదారులకు చక్కెర పంపిణీ చేసేందుకు పలువురు డీలర్లు ఆసక్తి చూపించలేదు. కొంతమంది డీలర్లు అసలు డీడీలే కట్టలేదు. కట్టిన వారిలో కొంతమందికి చక్కెర రాలేదని సాకులు చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే పౌరసరఫరాల శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. జిల్లాల వారీగా అవసరమైనంత చక్కెర తీసుకొని ఎఎవై కార్డుదారులకు పంపిణీ చేయాలని ఉత్వర్వులు జారీ చేసింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి