iDreamPost

రోహిత్ నామ స్మరణతో ఊగిపోతున్న ఉప్పల్ స్టేడియం! హార్దిక్ కి మళ్ళీ చుక్కలే!

Rohit Fans- Hardik Pandya: ఉప్పల్ స్టేడియం వేదికగా హైదరాబాద్- ముంబయి జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో కూడ హార్దిక్ పాండ్యాకి రోహిత్ ఫ్యాన్స్ నుంచి ముప్పు తప్పడం లేదు.

Rohit Fans- Hardik Pandya: ఉప్పల్ స్టేడియం వేదికగా హైదరాబాద్- ముంబయి జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో కూడ హార్దిక్ పాండ్యాకి రోహిత్ ఫ్యాన్స్ నుంచి ముప్పు తప్పడం లేదు.

రోహిత్ నామ స్మరణతో ఊగిపోతున్న ఉప్పల్ స్టేడియం! హార్దిక్ కి మళ్ళీ చుక్కలే!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 ఉత్కంఠగా సాగుతోంది. ఇప్పటివరకు జరిగిన మ్యాచుల్లో హోమ్ టీమ్స్ విజయం సాధిస్తూ వచ్చాయి. మొన్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తృటిలో విజయాన్ని కోల్పోయింది. ఇవాళ హోమ్ గ్రౌండ్ లో జరిగే మ్యాచ్ లో ముంబయిపై విజయం సాధించాలి అని కసితో ఉంది. అలాగే ముంబయి జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా తొలి మ్యాచ్ పరాభవాన్ని మరిపించే స్థాయిలో ఇప్పుడు విజయం సాధించాలి అని ఫిక్స్ అయినట్లు ఉన్నాడు. కానీ, ఇప్పుడు కూడా హార్దిక్ కి అది సాధ్యం అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. పేరుకు హైదరాబాద్ టీమ్ అయినా కూడా హార్దిక్ ని చూస్తే మాత్రం అందరూ రోహిత్ నామస్మరణ చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో హార్దిక్ కి విజయం కష్టం అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్ నుంచి కెప్టెన్ గా ముంబయి ఇండియన్స్ కి వచ్చాడు. అతను అలా రావడం వల్ల రోహిత్ శర్మ కెప్టెన్సీ పోయింది. ఈ నేపథ్యంలో రోహిత్ కోసం ముంబయిని అభిమానించే ఫ్యాన్స్ అంతా అడ్డం తిరిగారు. ముంబయి ఫ్రాంచైజీకి మాత్రమే కాకుండా హార్దిక్ పాండ్యాకి చుక్కలు చూపించడం స్టార్ట్ చేశారు. పైగా మొదటి మ్యాచ్ లో రోహిత్ విషయంలో హార్దిక్ పాండ్యా కాస్త ఓవరాక్షన్ చేశాడు అంటూ కన్నెర్రజేశారు. మైదానంలోకి ఒక కుక్క వస్తే.. దానిని హార్దిక్ పాండ్యాతో పోలుస్తూ నానా రచ్చ చేశారు. అలాగే ఎయిర్ పోర్టులో పాండ్యా కనిపిస్తే ముంబయికా షేర్ రోహిత్ అంటూ స్లోగన్స్ ఇచ్చారు.

ఇప్పుడు హైదరాబాద్ లో మ్యాచ్ జరుగుతున్నా కూడా హార్దిక్ పాండ్యాకు రోహిత్ ఫ్యాన్స్ నుంచి తిప్పలు తప్పడం లేదు. మ్యాచ్ కోసం ప్లేయర్స్ ఉప్పల్ గ్రౌండ్ లో వార్మప్ చేస్తూ ఉన్నారు. స్టేడియంలో ఉన్న ఆడియిన్స్ అంతా ఒక్కసారిగా రోహిత్ శర్మ జపం చేయడం ప్రారంభించారు. రోహిత్ రోహిత్ అంటూ కేకలు వేశారు. స్టేడియం మొత్తం రోహిత్ పేరుతో మారుమోగిపోయింది. హైదరాబాద్ ముంబయి హోమ్ గ్రౌండ్ అయిపోయిందేమో అనేలా ఉంది ఆ రచ్చ. ఇలాంటి తరుణంలో హార్దిక్ పాండ్యాకి ఇది మరో పీడకల అవుతుందేమో అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ఉప్పల్ స్టేడియంలో కూడా హార్దిక్ పాండ్యాని రోహిత్ ఫ్యాన్స్ ర్యాగింగ్ చేయడం ఆపడం లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంక మ్యాచ్ విషయానికి వస్తే.. ఇప్పటివరకు అన్ని మ్యాచుల్లో హోమ్ టీమ్స్ విజయం సాధించాయి. ఆ లాజిక్ తో హైదరాబాద్ జట్టు ఇవాళ విజయం సాధిస్తుందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబయి జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. మరి.. ఉప్పల్ స్టేడియంలో కూడా హార్దిక్ ని ర్యాగింగ్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి