iDreamPost

నిన్న 50 మంది ప్రాణాలు కాపాడిన బాలుడు ఇతనే! పోలీసులే సెల్యూట్ చేశారు!

  • Published Apr 27, 2024 | 11:16 AMUpdated Apr 27, 2024 | 11:22 AM

Shad Nagar Fie Accident: షాద్‌ నగర్‌ ఫార్మా కంపెనీలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం నుంచి సుమారు 50 మంది ప్రాణాలు కాపాడి హీరోగా నిలిచాడు ఓ కుర్రాడు. అతడి వివరాల కోసం నెటిజనులు ఆసక్తిగా వెతుకుతున్నారు. ఆ బాలుడి వివరాలు మీకోసం

Shad Nagar Fie Accident: షాద్‌ నగర్‌ ఫార్మా కంపెనీలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం నుంచి సుమారు 50 మంది ప్రాణాలు కాపాడి హీరోగా నిలిచాడు ఓ కుర్రాడు. అతడి వివరాల కోసం నెటిజనులు ఆసక్తిగా వెతుకుతున్నారు. ఆ బాలుడి వివరాలు మీకోసం

  • Published Apr 27, 2024 | 11:16 AMUpdated Apr 27, 2024 | 11:22 AM
నిన్న 50 మంది ప్రాణాలు కాపాడిన బాలుడు ఇతనే! పోలీసులే సెల్యూట్ చేశారు!

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్‌లోని ఓ ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే అందరూ భయపడితే ఒక్క కుర్రాడు మాత్రం ఎంతో ధైర్యంగా, సమయస్ఫూర్తితో వ్యవహరించి సుమారు 50 మంది ప్రాణాలు కాపాడాడు. ఫార్మా కంపెనీలో చెలరేగిన మంటలను గమనించిన బాలుడు.. వెంటనే భవనంపైకి ఎక్కి తాడు కట్టి కిందికి వదిలాడు. ఆ తాడు సాయంతో మంటల్లో చిక్కుకున్న 50 మంది కిందికి దిగి ప్రాణాలు కాపాడుకున్నారు. ఆ సమయంలో బాలుడు చూపిన సమయస్ఫూర్తి.. ఎన్నో జీవితాలను గట్టెక్కెంచింది. ఆపద సమయంలో ఆ బాలుడు చూపిన ధైర్యసాహసాలు ప్రతి ఒక్కరు ప్రశంసిస్తున్నారు. బాలుడి సమయస్ఫూర్తి చూసి పోలీసులే ఆశ్చర్యపోయారు. అతడి ధైర్యానికి సెల్యూట్‌ చేశారు. హీరో ఆఫ్‌ ది డే అంటూ ప్రశంసించారు.

ఈ క్రమంలో ప్రస్తుతం నెట్టింట ఎక్కడ చూసిన బాలుడి గురించే చర్చ జరుగుతోంది. అతడి వివరాలు తెలుసుకునేందుకు నెటిజనులు ఆసక్తి చూపుతున్నారు. ఇక 50 మంది కాపాడి హీరోగా నిలిచిన బాలుడి పేరు సాయి చరణ్‌. అతడి స్వస్థలం షాద్‌నగర్‌, నందిగామ. పదో తరగతి పూర్తి చేశాడు. ఇంటర్‌లో చేరనున్నాడు. అతడిది సామాన్య కుటుంబం. ఎంతో ధైర్యం చేసి.. 50 మంది ప్రాణాలు కాపాడిన బాలుడి వివరాలను ఢిల్లీకి పంపిస్తామని పోలీసు అధికారులు అన్నట్లుగా తెలుస్తోంది.

షాద్‌నగర్‌లోని నందిగామ వద్ద ఉన్న అలెన్ హోమియో అండ్ హెర్బల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో శుక్రవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కంపెనీలో వెల్డింగ్ పనులు జరుగుతూ ఉండగా.. నిప్పురవ్వలు ఎగిసిపడి ఫైబర్ షీట్లపై పడ్డాయి. దాంతో మంటలు అంటుకున్నాయి. కన్ను మూసి తెరిచేలోపల ఆ మంటలు రేకుల షెడ్ మొత్తానికి వ్యాపించాయి. దానికి ఆనుకుని ఉన్న భవనంలో సుమారు 300 మంది కార్మికులు పని చేస్తూ ఉన్నారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 4 ఫైరింజన్లతో ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపుచేసే పనిలో పడ్డారు. అలాగే భవనంలో చిక్కుకున్నవారిని నిచ్చెన సహాయంతో కిందికి దించే ప్రయత్నాలు చేశారు. ఇదే సమయంలో స్థానిక బాలుడు సాయిచరణ్ సమయస్ఫూర్తితో వ్యవహరించి ఎంతో సాహసం చేశాడు. పెద్ద తాడు తీసుకుని భవనం ఒకవైపుకు వెళ్లి.. బిల్డింగ్‌ మీదకు ఎక్కి కిటికీకి దాన్ని కట్టాడు. ఆ సమయంలో అక్కడ ఉన్న 50 మంది కార్మికులు తాడు సాయంతో కిందికి దిగారు. ఒకవేళ సాయిచరణ్ ఆ తాడు కట్టి ఉండకపోతే భారీగా ప్రాణ నష్టం జరిగి ఉండేది అంటున్నారు అధికారులు. చిన్న వాడైనా ఎంతో ధైర్యంగా వ్యవహరించిన సాయి చరణ్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి