iDreamPost

విద్యార్థులకు అలర్ట్‌.. 2025 నుంచి 2 సార్లు బోర్డు పరీక్షలు

  • Published Apr 27, 2024 | 8:57 AMUpdated Apr 27, 2024 | 8:57 AM

CBSE: వచ్చే ఏడాది అనగా 2025 విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు ఏడాదికి రెండు సార్లు పరీక్షలు నిర్వహించే దిశగా కేంద​ ప్రభుత్వం కార్యచరణ ప్రారంభించింది. ఆ వివరాలు..

CBSE: వచ్చే ఏడాది అనగా 2025 విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు ఏడాదికి రెండు సార్లు పరీక్షలు నిర్వహించే దిశగా కేంద​ ప్రభుత్వం కార్యచరణ ప్రారంభించింది. ఆ వివరాలు..

  • Published Apr 27, 2024 | 8:57 AMUpdated Apr 27, 2024 | 8:57 AM
విద్యార్థులకు అలర్ట్‌.. 2025 నుంచి 2 సార్లు బోర్డు పరీక్షలు

ప్రస్తుతం దేశవ్యాప్తంగా పరీక్ష ఫలితాలు వెలువడుతున్నాయి. ఓ వైపు టాపర్లు, కష్టాలను దాటుకుని.. మంచి మార్కుల సాధించిన విద్యార్థుల గురించి బోలేడు వార్తలు వస్తుంటే.. మరో వైపు ఎగ్జామ్స్‌లో ఫెయిల్‌ అయ్యి.. అవమాన భారం, తల్లిదండ్రులు, బంధువులు ఏమంటారనే భయంతో.. ప్రాణాలు తీసుకుంటున్న విద్యార్థుల వార్తలు చదువుతున్నాం. ఇక పిల్లలపై ఈ ఒత్తిడి తగ్గించాలని ఎప్పటి నుంచో డిమాండ్‌ వినిపిస్తుంది. కానీ ఇప్పటి వరకు ఆ దిశగా అడుగులు మాత్రం పడటం లేదు. ఈ క్రమంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి అగనా 2025 సంవత్సరం నుంచి విద్యార్థులకు రెండు సార్లు బోర్డు ఎగ్జామ్స్‌ నిర్వహించాలని నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. ఆ వివరాలు..

వచ్చే విద్యా సంవత్సరం నుంచి అంటే 2025-26 విద్యాసంవత్సరం నుంచి సంవత్సరానికి రెండుసార్లు బోర్డు పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన విధివిధానాలను రూపొందించాలని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ.. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ)ను కోరింది. విద్యార్థులపై ఎగ్జామ్స్‌ ఒత్తిడి లేకుండా చేసి వారికి మరిన్ని అవకాశాలు, ప్రయోజనాలను అందించడమే లక్ష్యంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Alert for students 2 times board exams from 2025

అయితే రెండు సార్లు పరీక్షలు అంటే.. ముందుగా సెమిస్టర్‌ విధానం గుర్తుకు వస్తుంది. కానీ కేంద్రం ఈ ప్రతిపాదనను తోసిపుచ్చినట్లు నివేదిక తెలిపింది. సంవత్సరానికి రెండుసార్లు బోర్డు పరీక్షలను నిర్వహించడానికి విద్యాశాఖ, సీబీఎస్ఈ వచ్చే నెల అనగా మేలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో చర్చలు జరపనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

రానున్న విద్యా సంవత్సరం నుంచి అనగా 2025 నుంచి విద్యార్థులకు ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు నిర్వహించాలని.. ఇందుకు సంబంధించిన  విధివిధానాలపై కసరత్తు చేయాలని సీబీఎస్ఈని కేంద్ర మంత్రిత్వ శాఖ కోరింది. దాంతో, బోర్డు సంబంధిత విధివిధానాలను రూపొందించే పనిలో పడింది. ఇక గత ఏడాది ఆగస్టులో విద్యా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన కొత్త నేషనల్ కరిక్యులమ్ ఫ్రేమ్ వర్క్ (ఎన్‌సీఎఫ్‌) విద్యార్థులకు సంవత్సరానికి రెండుసార్లు బోర్డు పరీక్షలు రాసే అవకాశం ఇవ్వాలని ప్రతిపాదించింది. 2025-26 విద్యాసంవత్సరం నుంచి రెండు ఎడిషన్ల బోర్డు పరీక్షలను నిర్వహించాలనే ఆలోచన ఉందని, అయితే విధివిధానాలు ఇంకా రూపొందించాల్సి ఉందన్నారు.

అయితే సీబీఎస్ఈ 10, 12వ తరగతి విద్యార్థులకు సంబంధించి బోర్డు కీలక సూచనలు చేసింది. వీరు సంవత్సరానికి రెండుసార్లు బోర్డు పరీక్షలకు హాజరు కావడం తప్పనిసరి కాదని గత ఏడాది అక్టోబర్ లో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. ‘‘ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష జేఈఈ మాదిరిగానే విద్యార్థులు ఏడాదికి రెండుసార్లు 10, 12వ తరగతి పరీక్షలకు హాజరయ్యే అవకాశం ఉంటుంది. ఆ రెండు పరీక్షలలో వారు దేనిలో ఉత్తమ స్కోరును సాధిస్తే.. దాన్నే ఎంచుకోవచ్చు. అది పూర్తిగా విద్యార్థి ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది.. రెండుసార్లు పరీక్ష రాయాలనే బలవంతం ఏమి అని వివరించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి