iDreamPost

చిన్నపిల్లల అక్రమ రవాణా.. 95 మంది చిన్నారులకు విముక్తి

ఉత్తరప్రదేశ్ లో పిల్లల అక్రమరవాణా వెలుగు చూసింది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 95 మంది పిల్లలను అక్రమ రవాణా నుంచి అధికారులు విముక్తి కలిగించారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

ఉత్తరప్రదేశ్ లో పిల్లల అక్రమరవాణా వెలుగు చూసింది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 95 మంది పిల్లలను అక్రమ రవాణా నుంచి అధికారులు విముక్తి కలిగించారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

చిన్నపిల్లల అక్రమ రవాణా.. 95 మంది చిన్నారులకు విముక్తి

బడిలో గడవాల్సిన బాల్యం అక్రమ రవాణాకు గురవుతోంది. కొంతమంది కేటుగాళ్లు చిన్నారులను అక్రమ రవాణా చేస్తున్నారు. డబ్బుల కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. చిన్నారుల పాలిట యమకింకరులుగా మారుతున్నారు. పిల్లల అక్రమ రవాణాపై అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ దేశంలో ఏదో ఒక ప్రాంతంలో పిల్లలు అక్రమ రవాణాకు గురవుతున్నారు. తాజాగా ఓ రాష్ట్రంలో భారీ సంఖ్యలో పిల్లలను అక్రమంగా తరలించేందుకు సిద్ధమైంది ఓ ముఠా. ఈ విషయం ప్రభుత్వ అధికారులకు తెలియడంతో ఈ ఘోరాన్ని అడ్డుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న చిన్నారులను రెస్క్యూ ఆపరేషన్ చేసి 95 మంది చిన్నారులకు విముక్తి కలిగించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది.

ఉత్తరప్రదేశ్ లో పిల్లల అక్రమ రవాణా తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. శుక్రవారం నాడు అక్రమంగా తరలిస్తున్న 95 మంది చిన్నారులను ఉత్తరప్రదేశ్ చైల్డ్ కమిషన్ రక్షించింది. బీహార్ నుంచి ఉత్తరప్రదేశ్‌కు తరలిస్తుండగా చాకచక్యంగా చిన్నారులను కాపాడారు. పిల్లల అక్రమ రవాణా చేయడంపై అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులను అక్రమ రవాణా చేస్తున్నట్లుగా సమాచారం రాగానే సీడబ్ల్యూసీ సభ్యులు చిన్నారులను రక్షించారని అయోధ్య చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్‌పర్సన్ సర్వేష్ అవస్థి తెలిపారు.

బీహార్ నుంచి మైనర్ పిల్లలను అక్రమంగా సహరాన్‌పూర్‌కు రవాణా చేస్తున్నారని అధికారులు తెలిపారు. రక్షించబడిన చిన్నారులంతా 4-12 ఏళ్లలోపు వారేనని తెలిపారు. పిల్లలను ఎక్కడికి తరలిస్తున్నారు? ఎందుకు తీసుకెళ్తున్నారు అన్న విషయాలు తెలియాల్సి ఉంది. అక్రమ రవాణా నుంచి విముక్తి కలిగించిన పిల్లలకు ఆహారం, వైద్యం అందించినట్లు అధికారులు వెల్లడించారు. పిల్లల అక్రమ రవాణా వెనకాల ఉన్నదెవరు? ఇంకా ఏయే రాష్ట్రాల్లో పిల్లల అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు అన్న దానిపై అధికారులు కూపీలాగుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి