iDreamPost

KKR vs PBKS: ఒక్క మ్యాచ్‌తో బద్దలైన రికార్డులు ఎన్నో! నమ్మలేనివి చాలా ఉన్నాయ్‌!

  • Published Apr 27, 2024 | 9:04 AMUpdated Apr 27, 2024 | 9:04 AM

KKR vs PBKS, IPL 2024: ఐపీఎల్‌లోనే కాదు.. ఏకంగా ప్రపంచ టీ20 క్రికెట్‌ చరిత్రలోనే నిలిచిపోయే మ్యాచ్‌ శుక్రవారం ఈడెన్‌ గార్డెన్స్‌లో జరిగింది. కేకేఆర్‌ వర్సెస్‌ పంజాబ్‌ మ్యాచ్‌తో ఎన్ని రికార్డులు బద్దలు అయ్యాయో ఇప్పుడు తెలుసుకుందాం..

KKR vs PBKS, IPL 2024: ఐపీఎల్‌లోనే కాదు.. ఏకంగా ప్రపంచ టీ20 క్రికెట్‌ చరిత్రలోనే నిలిచిపోయే మ్యాచ్‌ శుక్రవారం ఈడెన్‌ గార్డెన్స్‌లో జరిగింది. కేకేఆర్‌ వర్సెస్‌ పంజాబ్‌ మ్యాచ్‌తో ఎన్ని రికార్డులు బద్దలు అయ్యాయో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Apr 27, 2024 | 9:04 AMUpdated Apr 27, 2024 | 9:04 AM
KKR vs PBKS: ఒక్క మ్యాచ్‌తో బద్దలైన రికార్డులు ఎన్నో! నమ్మలేనివి చాలా ఉన్నాయ్‌!

ఐపీఎల్‌ 2024లో భాగంగా కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ ఘన విజయం సాధించింది. ఐపీఎల్‌లోనే కాదు.. ప్రపంచ క్రికెట్‌ చరిత్రలోనే అత్యంత భారీ టార్గెట్‌ను ఛేజ్‌ చేసిన టీమ్‌గా పంజాబ్‌ చరిత్ర సృష్టించింది. శుక్రవారం కోల్‌కత్తాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో ఈ అద్భుతం చోటు చేసుకుంది. అయితే.. ఈ మ్యాచ్‌తోనే అనేక రికార్డులు బ్రేక్‌ అయ్యాయి. అందులో కొన్ని ప్రపంచ రికార్డులు కాగా, మరి కొన్ని ఐపీఎల్‌ చరిత్రలోనే బెస్ట్‌ రికార్డ్స్‌గా ఉన్నాయి. కొన్ని రికార్డులైతే.. అసలు క్రికెట్‌ అభిమానులు కూడా నమ్మలేని విధంగా ఉన్నాయి. మరి ఆ రికార్డలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

టీ20 క్రికెట్‌ చరిత్రలో అత్యధిక టార్గెట్‌ను ఛేజ్‌ చేసిన టీమ్‌గా సౌతాఫ్రికా పేరిట ఉన్న రికార్డను పంజాబ్‌ కింగ్స్‌ బ్రేక్‌చేసింది. 2023లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా 259 పరుగుల టార్గెట్‌ను ఛేజ్‌ చేసింది. కేకేఆర్‌ వర్సెస్‌ పంజాబ్‌ మ్యాచ్‌ కంటే ముందు.. ఇదే వరల్డ్‌ రికార్డ్‌. దాన్ని పంజాబ్‌ బద్దులుకొట్టి కొత్త చరిత్ర లిఖించింది.

  • ప్రపంచ వ్యాప్తంగా టాప్‌ 5 టార్గెట్స్‌ ఛేజ్‌ చేసిన టీమ్స్‌ ఇవే..
  • 262 – పంజాబ్ కింగ్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్, కోల్‌కతా, IPL 2024
  • 259 – దక్షిణాఫ్రికా vs వెస్టిండీస్, సెంచూరియన్, 2023
  • 253 – మిడిల్‌సెక్స్ vs సర్రే, ది ఓవల్, T20 బ్లాస్ట్ 2023
  • 244 – ఆస్ట్రేలియా vs న్యూజిలాండ్, ఆక్లాండ్, 2018
  • 243 – బల్గేరియా vs సెర్బియా, సోఫియా, 2022
  • ఐపీఎల్‌లో అత్యధిక టార్గెట్స్‌ ఛేజ్‌ చేసిన టాప్‌4 టీమ్స్‌..
  • 262 – పంజాబ్ కింగ్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్, 2024
  • 224 – రాజస్థాన్ రాయల్స్ vs పంజాబ్ కింగ్స్, 2020
  • 224 – రాజస్థాన్ రాయల్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్, 2024
  • 219 – ముంబై ఇండియన్స్ vs చెన్నై సూపర్ కింగ్స్, 2021

ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన టీమ్‌గా పంజాబ్‌ కింగ్స్‌ మరో అరుదైన రికార్డును తమ ఖాతాలో వేసుకుంది. 262 రన్స్‌ ఛేజ్‌లో పంజాబ్‌ బ్యాటర్లు ఏకంగా 24 సిక్సర్లు కొట్టారు. అంటే వారి టార్గెట్‌లో 144 పరుగులు కేవలం సిక్సర్ల ద్వారానే వచ్చాయి. ఈ 24 సిక్సుల్లో ప్రభ్‌సిమ్రాన్ సింగ్ 5, జానీ బెయిర్‌స్టో 9, రిలీ రుసోవ్ 2, శశాంక్ సింగ్ 8 సిక్సులు బాదాడు. అయితే.. ఐపీఎల్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సులు బాదిన టీమ్‌గా పంజాబ్‌ నిలిచింది. మరి పంజాబ్‌ కంటే ముందు ఆ రికార్డు ఏ టీమ్‌ పేరిట ఉందో ఇప్పుడు చూద్దాం..

  • 24 – పంజాబ్‌ vs కేకేఆర్‌, 2024
  • 22 – ఎస్‌ఆర్‌హెచ్‌ vs ఆర్సీబీ, 2024
  • 22 – ఎస్‌ఆర్‌హెచ్‌ vs ఢిల్లీ, 2024
  • 21 – ఆర్సీబీ vs పూణె వారియర్స్‌ ఇండియా, 2013

అలాగే పంజాబ్‌ వర్సెస్‌ కేకేఆర్‌ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్సులు కలిపి 523 పరుగులు నమోదు అయ్యాయి. ఐపీఎల్‌ చరిత్రలో ఒకే మ్యాచ్‌లో నమోదు అయిన మూడో అతిపెద్ద స్కోర్‌ ఇదే.

  • 549 – ఆర్సీబీ vs ఎస్‌ఆర్‌హెచ్‌, 2024
  • 523 – ఎస్‌ఆర్‌హెచ్‌ vs ఎంఐ, 2024
  • 523 – కేకేఆర్‌ vs పంజాబ్‌, 2024
  • 469 – సీఎస్‌కే vs ఆర్‌ఆర్‌, 2010
  • 465 – ఢిల్లీ క్యాపిటల్స్‌  vs ఎస్‌ఆర్‌హెచ్‌, 2024

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి