iDreamPost

Shashank Singh: హార్దికే కాదు.. శశాంక్​ను చూసి భయపడుతున్న మరో టీమిండియా స్టార్!

  • Published Apr 27, 2024 | 10:24 AMUpdated Apr 27, 2024 | 10:24 AM

ఐపీఎల్ న్యూ సెన్సేషన్ శశాంక్ సింగ్​ వరుసగా విధ్వంసక ఇన్నింగ్స్​లతో చెలరేగుతున్నాడు. నిన్న కేకేఆర్ మీద కూడా తుఫాన్ ఇన్నింగ్స్​తో మ్యాచ్​ను తిప్పేశాడు. అలాంటోడ్ని చూసి పలువురు టీమిండియా స్టార్లు భయపడుతున్నారు.

ఐపీఎల్ న్యూ సెన్సేషన్ శశాంక్ సింగ్​ వరుసగా విధ్వంసక ఇన్నింగ్స్​లతో చెలరేగుతున్నాడు. నిన్న కేకేఆర్ మీద కూడా తుఫాన్ ఇన్నింగ్స్​తో మ్యాచ్​ను తిప్పేశాడు. అలాంటోడ్ని చూసి పలువురు టీమిండియా స్టార్లు భయపడుతున్నారు.

  • Published Apr 27, 2024 | 10:24 AMUpdated Apr 27, 2024 | 10:24 AM
Shashank Singh: హార్దికే కాదు.. శశాంక్​ను చూసి భయపడుతున్న మరో టీమిండియా స్టార్!

శశాంక్ సింగ్.. ఐపీఎల్-2024లో బాగా వినిపిస్తున్న పేరు. వరుసగా విధ్వంసక ఇన్నింగ్స్​లతో నయా సెన్సేషన్​గా మారాడీ బ్యాటర్. ఈ సీజన్​లో ఇప్పటిదాకా ఆడిన 9 మ్యాచుల్లో కలిపి 182.6 స్ట్రయిక్ రేట్​తో 263 పరుగులు చేశాడు శశాంక్. అతడి యావరేజ్ 65.7గా ఉంది. ఈ ఐపీఎల్​లో 2 ఫిఫ్టీలు బాదాడీ ఈ డాషింగ్ బ్యాటర్. అతడి బ్యాట్ నుంచి 19 ఫోర్లతో పాటు 18 భారీ సిక్సులు వచ్చాయి. ఆఖరి ఐదారు ఓవర్లు ఉన్నప్పుడు క్రీజులోకి అడుగుపెడుతున్న శశాంక్.. మ్యాచ్ సిచ్యువేషన్​కు తగ్గట్లు ఆడుతున్నాడు. ఎన్ని బంతుల్లో ఎన్ని పరుగులు చేయాలి, ఏ బౌలర్​ను టార్గెట్ చేసుకోవాలనేది ప్లాన్ చేసుకొని పక్కా కాలిక్యులేషన్​తో ఆడుతున్నాడు. నిన్న కేకేఆర్ మీద 28 బంతుల్లోనే 68 పరుగులు చేసి టీమ్​కు సంచలన విజయాన్ని అందించాడు.

ఐపీఎల్​లో శశాంక్ స్కోర్లు ఇలా ఉన్నాయి.. 8 బంతుల్లో 21 నాటౌట్, 29 బంతుల్లో 61 నాటౌట్, 25 బంతుల్లో 46 నాటౌట్, 28 బంతుల్లో 68 నాటౌట్. బాదుడుకు న్యూ డెఫినిషన్ చెబుతున్న ఈ బ్యాటర్​ను చూసి ఇద్దరు టీమిండియా స్టార్లు భయపడుతున్నారు. వాళ్లే ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యా, పించ్ హిట్టర్ రింకూ సింగ్. ఐపీఎల్ ముగిసిన వెంటనే పొట్టి ఫార్మాట్​లో ప్రపంచ కప్ జరగనున్న సంగతి తెలిసిందే. యూఎస్-అమెరికా సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న వరల్డ్ కప్-2024 జూన్ 2వ తేదీ నుంచి మొదలవనుంది. మెగా టోర్నీలో ఆడే భారత జట్టును అతి త్వరలో ప్రకటించనున్నారు. మరో మూడ్నాలుగు రోజుల్లో టీమిండియా స్క్వాడ్​పై అనౌన్స్​మెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ తరుణంలో శశాంక్​ను చూసి హార్దిక్, రింకూ భయపడుతున్నారు. ఎక్కడ తమ ప్లేస్​కు అతడు అడ్డం వస్తాడోనని టెన్షన్ పడుతున్నారు.

Another Team India star who is afraid of Shashank!

ఈ ఐపీఎల్ సీజన్​లో హార్దిక్ అటు బ్యాట్​తో పాటు ఇటు బంతితోనూ ఫెయిలై తన మీద పెట్టుకున్న అంచనాలను రీచ్ కాలేకపోయాడు. ముంబై వరుస ఓటములతో కెప్టెన్​గా అతడు మరింత ఒత్తిడికి లోనవుతున్నాడు. మరోవైపు కేకేఆర్ గెలుస్తున్నా రింకూకు సరైన ఛాన్సులు రావడం లేదు. అతడి బ్యాట్ నుంచి ఇప్పటిదాకా ఒక్క బిగ్ ఇన్నింగ్స్ కూడా రాలేదు. అయితే పంజాబ్ పించ్ హిట్టర్ శశాంక్ మాత్రం విధ్వంసక ఇన్నింగ్స్​లతో అందరి దృష్టిని తనవైపునకు తిప్పకుంటున్నాడు. దీంతో వరల్డ్ కప్ టీమ్​లోకి అతడ్ని తీసుకుంటారని వినిపిస్తోంది. భారత జట్టులో ఫినిషర్ రోల్ కోసం ఆల్రెడీ శివమ్ దూబె ఫిక్స్ అయ్యాడని అంటున్నారు. అతడికి బ్యాకప్​గా రింకూను తీసుకుంటారని అంతా ఊహించారు. కానీ సడన్​గా శశాంక్ రేసులోకి వచ్చాడని సమాచారం. ఈ పంజాబ్ బ్యాటర్ మాస్ హిట్టింగ్, మ్యాచ్​లు ఫినిష్ చేస్తున్న విధానానికి సెలెక్టర్లు ఫుల్​గా ఇంప్రెస్ అయ్యారని టాక్ నడుస్తోంది. దీంతో రింకూ, హార్దిక్ టెన్షన్ పడుతున్నారు. మరి.. దూబెకు బ్యాకప్​గా ఎవర్ని తీసుకుంటే కరెక్ట్​ అని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి