iDreamPost

Pat Cummins: మిగతా జట్లకు SRH కెప్టెన్ కమిన్స్ మాస్ వార్నింగ్! ఇది కదా కావాల్సింది!

మార్చ్ 23న ఎస్.ఆర్.హెచ్ జట్టు కేకేఆర్ తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఇలాంటి సమయంలో ఆరెంజ్ ఆర్మీ కెప్టెన్ మిగతా అన్నీ జట్లకు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు.

మార్చ్ 23న ఎస్.ఆర్.హెచ్ జట్టు కేకేఆర్ తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఇలాంటి సమయంలో ఆరెంజ్ ఆర్మీ కెప్టెన్ మిగతా అన్నీ జట్లకు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు.

Pat Cummins: మిగతా జట్లకు SRH కెప్టెన్ కమిన్స్ మాస్ వార్నింగ్! ఇది కదా కావాల్సింది!

2024 IPL సందడి మొదలైంది. అన్ని జట్లు తమ బలాలని సమీకరించుకుని యుద్దానికి సిద్ధమవుతున్నాయి. ముంబై అన్నీ విభాగాల్లో బలంగా ఉంది. చెన్నై జట్టు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇక ఎప్పుడూ కప్ కొట్టకపోయినా ఆర్సీబిని తక్కువ అంచనా వేయలేము. అక్కడ కోహ్లీ కాచుకుని ఉన్నాడు. ఇక గుజరాత్, కేకేఆర్ జట్లు ప్రమాదకరమైనవే. మరి.. ఇంతటి సంగ్రామంలో మన ఎస్.ఆర్.హెచ్ పరిస్థితి ఏమిటి? గత మూడు సీజన్స్ లో దారుణమైన ప్రదర్శనతో సన్ రైజర్స్ రేంజ్ కాస్త తగ్గింది. ఇది ఒప్పకోవాల్సిన సత్యం. కానీ.., హైదరాబాద్ జట్టుకి తెలుగువారి మద్దతు మాత్రం అస్సలు తగ్గలేదు. ఇప్పుడు కూడా ఆరెంజ్ ఆర్మీకి బలమైన మద్దతు ఉంది. అయితే.., ఈసారి జట్టు అప్రోచ్ ఎలా ఉండబోతున్నది అనేది అభిమానులను కలవరపెడుతోంది. ఈ ఆందోళనకి సమాధానమా అనే రీతిలో.. ఎస్.ఆర్.హెచ్ కొత్త సారథి పాట్ కమిన్స్ బలమైన స్టేట్మెంట్ తో మీడియా ముందుకి వచ్చాడు.

సన్ రైజర్స్ మార్చి 23న కేకేఆర్ తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలోనే కమిన్స్ చేసిన కామెంట్స్ ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని నింపుతోంది. “జట్టుగా మేమంతా శుభారంభం కోసం ఎదురు చూస్తున్నాం. కానీ.., టీ20 ఫార్మాట్‌ అంత సులభం కాదని మాకు తెలుసు. కేకేఆర్ కు మంచి జట్టు ఉంది. ఇదే సమయంలో అంతా ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. మా జట్టు కూడా చాలా బలంగా ఉంది. మేము ఎవ్వరికీ తక్కువ కాదు. ఈ సీజన్ లో దూకుడుగా ఆడాలని అనుకుంటున్నాము. భువీ, మార్క్రమ్‌ లాంటి సీనియర్స్ అండ ఉంది. అభిషేక్‌, ఉమ్రాన్‌ మాలిక్‌ వంటి కుర్రాళ్ళు కూడా మంచి కసి మీద ఉన్నారు. మేము ఆరంభం నుండే బాగా ఆడాలని అనుకుంటున్నాం. ఇలాంటి కొత్త సభ్యులతో కలిసి ఈ ఐపీఎల్‌ ఆడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’’ అని కమిన్స్ పేర్కొన్నాడు. ఇదే సమయంలో కొత్త సీజన్‌ కోసం అభిమానులు సిద్ధంగా ఉండాలంటూ ఆరెంజ్‌ ఆర్మీకి కమిన్స్‌ పిలుపునిచ్చాడు.

డేవిడ్ వార్నర్ జట్టు నుండి వెళ్ళిపోయాక సన్ రైజర్స్ కోలుకుంది లేదు. పోయిన సీజన్ లో అయితే పట్టికలో ఎక్కడో చివర మిగిలిపోయింది. దీంతో.. కావ్య మారెన్ జట్టులో చాలా మార్పులు చేసింది. బ్రియన్‌ లారా స్థానంలో న్యూజిలాండ్‌ దిగ్గజ స్పిన్నర్‌ డానియెల్‌ వెటోరిని హెడ్‌కోచ్‌గా తీసుకొచ్చింది. ఐడెన్‌ మార్క్రమ్‌ ని కెప్టెన్ గా తప్పించి.. డబ్ల్యూటీసీ 2021-23, వన్డే వరల్డ్‌కప్‌-2023 విజేత, ఆసీస్‌ సారథి కమిన్స్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. ఈ క్రమంలో కమిన్స్ కోసం ఏకంగా రూ. 20. 50 కోట్లు ఖర్చు చేసింది. దీంతో.. కావ్య ఈసారి కప్ కోసం ఎంత కసిగా వర్క్ చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇదే సమయంలో జట్టు కెప్టెన్ కమిన్స్ కూడా ప్రత్యర్థి జట్లకు తాము తక్కువ కాదనే సందేశాన్ని పంపడంతో ఎస్.ఆర్.హెచ్ ఫ్యాన్స్ లో కొత్త ఉత్తేజం వచ్చి చేరినట్టు అయ్యింది. మరి.. యజమానిగా కావ్య, కెప్టెన్ గా కమిన్స్ తమ బెస్ట్ వర్క్ ఇస్తే.. ఈసారి ఆరెంజ్ ఆర్మీ కాలర్ ఎగరేయడం ఖాయం. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి