iDreamPost
android-app
ios-app

స్టార్ పేసర్​ను వదులుకుంటున్న SRH.. కమిన్స్ ఓకే అన్నాకే!

  • Published Jul 23, 2024 | 5:04 PMUpdated Jul 23, 2024 | 5:04 PM

IPL 2025: ఐపీఎల్-2025 మెగా ఆక్షన్​కు ఇంకా టైమ్ ఉంది. కానీ చాలా జట్లలో అప్పుడే అనూహ్య మార్పులు మొదలయ్యాయి. ఆటగాళ్లతో పాటు కోచ్​ల విషయంలోనూ ఛేంజెస్ జరుగుతున్నాయి.

IPL 2025: ఐపీఎల్-2025 మెగా ఆక్షన్​కు ఇంకా టైమ్ ఉంది. కానీ చాలా జట్లలో అప్పుడే అనూహ్య మార్పులు మొదలయ్యాయి. ఆటగాళ్లతో పాటు కోచ్​ల విషయంలోనూ ఛేంజెస్ జరుగుతున్నాయి.

  • Published Jul 23, 2024 | 5:04 PMUpdated Jul 23, 2024 | 5:04 PM
స్టార్ పేసర్​ను వదులుకుంటున్న SRH.. కమిన్స్ ఓకే అన్నాకే!

ఐపీఎల్-2025 మెగా ఆక్షన్​కు ఇంకా చాలా టైమ్ ఉంది. కానీ చాలా జట్లలో అప్పుడే అనూహ్య మార్పులు మొదలయ్యాయి. ఆటగాళ్లతో పాటు కోచ్​ల విషయంలోనూ ఛేంజెస్ జరుగుతున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తమ కోచ్ పదవి నుంచి ఆస్ట్రేలియా లెజెండ్ రికీ పాంటింగ్​ను తొలగించింది. ఆరు సీజన్లుగా టీమ్​ను నడిపిస్తున్న పాంటింగ్​ను సాగనంపింది. ఆ టీమ్ కెప్టెన్ రిషబ్ పంత్​ను కూడా వదులుకోవడం ఖాయమని సమాచారం. ముంబై ఇండియన్స్​ నుంచి రోహిత్ శర్మతో పాటు మరో స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ బయటకు వెళ్లడం పక్కా అనే రూమర్స్ వస్తున్నాయి. ఇదే తరుణంలో లీగ్​లో మరో పాపులర్ ఫ్రాంచైజీ అయిన సన్​రైజర్స్ హైదరాబాద్​కు సంబంధించిన ఓ అంశం చక్కర్లు కొడుతోంది.

స్టార్ పేసర్ ఉమ్రాన్ మాలిక్​ను సన్​రైజర్స్ వదులుకోవడం ఖాయమని వినిపిస్తోంది. మెగా ఆక్షన్​కు ముందు ఈ యంగ్ స్పీడ్​స్టర్​ను రిలీజ్ చేసేందుకు ఎస్​ఆర్​హెచ్ రెడీ అవుతోందని తెలుస్తోంది. అతడి స్థానంలో ఆక్షన్​లో మరో క్వాలిటీ పేసర్​ను తీసుకోవాలని ఆరెంజ్ ఆర్మీ భావిస్తోందట. గత నాలుగేళ్లుగా ఉమ్రాన్ సన్​రైజర్స్​కు ఆడుతూ వస్తున్నాడు. ఐపీఎల్-2021 ఆక్షన్​లో అతడ్ని రూ.4 కోట్లు చెల్లించి దక్కించుకుంది సన్​రైజర్స్. అప్పటి నుంచి అతడు టీమ్​తో ట్రావెల్ అవుతున్నాడు. ఇప్పటిదాకా క్యాష్ రిచ్ లీగ్​లో 29 వికెట్లు పడగొట్టాడు ఉమ్రాన్. ఐపీఎల్​లో ఓ మ్యాచ్​లో ఏకంగా 155 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసి టాక్ ఆఫ్ ది టౌన్​గా మారాడు.

మెరుపు వేగంతో బౌలింగ్ చేసే ఉమ్రాన్ స్పీడ్​ను నమ్ముకునే ఆడుతున్నాడు. పెద్దగా వేరియేషన్స్ లేకపోవడం, బంతి మీద గ్రిప్ లేకపోవడం, లైన్ అండ్ లెంగ్త్​తో ఇబ్బందులు పడటం, వికెట్లు తీయడంలో వెనుకంజ వేయడం, అదే టైమ్​లో జట్టులో మరింత మంది నాణ్యమైన పేసర్లు ఉండటంతో ఈ సీజన్​లో అతడ్ని ఒకే మ్యాచ్​కు పరిమితం చేసింది సన్​రైజర్స్. దీంతో ఉమ్రాన్​పై ఎస్​ఆర్​హెచ్​ నమ్మకం కోల్పోయిందని, మెగా ఆక్షన్​కు ముందు అతడ్ని రిలీజ్ చేయడం పక్కా అనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఇప్పుడు ఈ రూమర్లు మరింత ఎక్కువయ్యాయి. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా అతడ్ని బ్యాకప్ చేయడం లేదని.. ఉమ్రాన్​కు బదులు మరో యంగ్​స్టర్​ను తీసుకునేందుకు మొగ్గు చూపుతున్నాడని క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది. మరి.. ఉమ్రాన్​ను ఎస్​ఆర్​హెచ్​ వదులుకోవడం కరెక్ట్ అని మీరు భావిస్తే కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి