Arjun Suravaram
Sachin Tendulkar: క్రికెట్ గాడ్ సచిన్ తెందూల్కర్ టెన్నిస్ ను ఎంతలా ఆరాధిస్తాడో అందరికి తెలిసింది. క్రికెట్ లో బిజీగా ఉన్న సమయంలో సైతం విరామ సమయంలో టెన్నిస్ మ్యాచ్ లు చూడడానికి ఇష్టపడతారు. తాజాగా ఓ టెన్నిస్ దిగ్గజ సీక్రెట్ ను సచిన్ రివిల్ చేశారు.
Sachin Tendulkar: క్రికెట్ గాడ్ సచిన్ తెందూల్కర్ టెన్నిస్ ను ఎంతలా ఆరాధిస్తాడో అందరికి తెలిసింది. క్రికెట్ లో బిజీగా ఉన్న సమయంలో సైతం విరామ సమయంలో టెన్నిస్ మ్యాచ్ లు చూడడానికి ఇష్టపడతారు. తాజాగా ఓ టెన్నిస్ దిగ్గజ సీక్రెట్ ను సచిన్ రివిల్ చేశారు.
Arjun Suravaram
ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రత్యేకమైన కోరిక అనేది ఉంటుంది. అది నేరవేరితే బాగుండు అని కలలు కంటుంటారు. ఇలా కేవలం సామాన్యులకే కాకుండా సెలబ్రిటీలకు కూడా ఉంటుంది. అందుకే కొన్ని సందర్భల్లో సినీ,కిక్రెట్ రంగానికి చెందిన ప్రముఖులు తమలోనే కోరికలను, ఆశలను వ్యక్తం చేస్తుంటారు. అలానే క్రికెట్ దేవుడు సచిన్ తెందూల్కర్ సైతం తనకు ఉన్న ఓ కోరికను వ్యక్తం చేశారు. ఓ దిగ్గజ టెన్నిస్ ప్లేయర్ తో కలిసి బ్యాటింగ్ చేయాలని ఉందని తన మనస్సులోని మాటను వ్యక్తం చేశారు. మరి..ఆ టెన్నిస్ ప్లేయర్ ఎవరు, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…
సచిన్ తెందూల్కర్..ఈ పేరు తెలియని వ్యక్తి ఉండరు అంటే అతిశయోక్తి కాదు. క్రికెట్ అనే రాజ్యానికి సచిన్ ఓ రాజు. కొన్నేళ్ల పాటు ఈ క్రికెట్ సామ్రాజ్యాన్ని సచిన్ ఏలాడు. అందుకే ఆయనను క్రికెట్ గాడ్ గా అందరూ పిలుస్తుంటారు. అలానే ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ఆయన స్ఫూర్తితో క్రికెట్ లోకి అడుగు పెట్టి..నేడు టాప్ ప్లేయర్లు రాణిస్తున్న వారు ఎందరో ఉన్నారు. 2011 వన్డే వరల్డ్ కప్ గెలిచిన తరువాత సచిన్ క్రికెట్ కు గుడ్ బై చెప్పారు. ఇది ఇలా ఉంటే.. సచిన్ కు క్రికెట్ తో పాటు టెన్నిస్ అంటే చాలా ఇష్టం. ఆయన టెన్నిస్ ను ఎంతలా ఆరాధిస్తాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్రికెట్ లో బిజీగా ఉన్నా కూడా ఏ మాత్రం కాస్తా విరామం దొరికినా టెన్నిస్ మ్యాచ్ లు చూసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు.
అందుకే ఏటా తనకు ఇష్టమైన వింబుల్డన్ మ్యాచ్ లను స్వయంగా వెళ్లికి వీక్షిస్తుంటారు. ఏటా మాదిరిగానే ఈ సారి కూడా వింబుల్డన్ 2024 కు హాజరయ్యాడు. ఈ మ్యాచ్ చూసిన తర్వాత వింబుల్డన్ యొక్క సోషల్ మీడియా టీమ్‌తో జరిగిన సంభాషణలో సచిన్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. క్రికెట్ లో ఏ టెన్నిస్ ప్లేయర్ తో మీరు బ్యాటింగ్ చేయాలని అక్కడి మీడియా అక్కడగా.. రోజర్ ఫెదరర్ తో కలిసి బ్యాటింగ్ చేసేందుకు తాను ఇష్టపడతానని మాస్టర్ బ్లాస్టర్ అన్నారు. ఫెదరర్ కు టెన్నిస్ తోనే కాక క్రికెట్ తో కూడా సంబంధాలు ఉన్నాయని, అతను క్రికెట్ ఫాలో అవుతాడని సచిన్ తెలిపారు.
ఇక ఫెదరర్, సచిన్ విషయానికి వస్తే.. వీరిద్దరు వారి వారి ఆటల్లో ఒక ట్రెండ్ ను సెట్ చేశారు. వారి వారి రంగాల్లో ఎన్నో ఘనతలు సాధించారు. ఇద్దరి వ్యక్తిత్వం ఒకేలా ఉండటే కాకుండా.. వారిద్దరు మంచి ఫ్రెండ్స్ కూడా. శనివారం వింబుల్డన్ మ్యాచ్ ముగిసిన తర్వాత టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ తో కలిసి మాస్టర్ బ్లాస్టర్ కాసేపు ముచ్చటించారు. ఇదే సమయంలో టెన్నిస్ డబుల్స్ లో ఒక భాగస్వామిని క్రికెట్ నుంచి ఎంచుకోమని మీడియా సచిన్ ను అడిగింది. ఆ ప్రశ్నకు సమాధానంగా షేన్ వార్న్, యువరాజ్ సింగ్ పేర్లను సచిన ప్రస్తావించారు. మొత్తంగా సచిన్ తెందూల్కర్ అనేక విషయాలను షేర్ చేసుకున్నారు.