iDreamPost
android-app
ios-app

భార్యతో కలిసి ఖరీదైన ఇళ్లు కొన్న టీమిండియా స్టార్! ఎన్ని కోట్లంటే..?

  • Published Jul 18, 2024 | 4:11 PM Updated Updated Jul 18, 2024 | 4:11 PM

Athiya Shetty,KL Rahul: పలువురు ప్రముఖులు ఖరీదైన వస్తువులు, వాహనాలు, ఇళ్లు కొనుగోలు చేస్తుంటారు. తాజాగా టీమిండియా స్టార్ క్రికెటర్ ఒకరు తన భార్యతో కలిసి ఖరీదైన ఫ్లాట్ ను కొనుగోలు చేశాడు.

Athiya Shetty,KL Rahul: పలువురు ప్రముఖులు ఖరీదైన వస్తువులు, వాహనాలు, ఇళ్లు కొనుగోలు చేస్తుంటారు. తాజాగా టీమిండియా స్టార్ క్రికెటర్ ఒకరు తన భార్యతో కలిసి ఖరీదైన ఫ్లాట్ ను కొనుగోలు చేశాడు.

  • Published Jul 18, 2024 | 4:11 PMUpdated Jul 18, 2024 | 4:11 PM
భార్యతో కలిసి ఖరీదైన ఇళ్లు కొన్న టీమిండియా స్టార్! ఎన్ని కోట్లంటే..?

ప్రస్తుతం సినిమా, క్రీడలకు సంబంధించిన న్యూస్ ను చూసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తుంటారు. అలానే  సినీ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు తమకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పెడుతుంటారు. వారు కొనుగోలు చేసిన ప్లాట్ లో, వస్తువులు ఇతర విషయాలు నెట్టింట్లో వైరల్ అవుతుంటాయి. తాజాగా టీమిడింయా స్టార్ ఒకరు..తన భార్యతో కలిసి ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేశాడు. దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదే సమయంలో ఆ ఫ్లాట్ ఖరీదు ఎంతా తెలుసుకోవాలని తెగ సెర్చ్ చేస్తున్నారు. ఇక ఆ స్టార్ క్రికెటర్ ఎవరు, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

కె.ఎల్ రాహుల్…క్రికెట్ గురించి అవగాహన ఉన్న వారికి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. తనదైన ఆటతో అందరిని ఆకట్టుకుంటాడు. అటు బ్యాటర్ గా, ఇటు వికెట్ కీపర్ గా టీమిండియాలో కీలక ప్లేయర్ గా ఉన్నాడు. ఐపీఎల్ సీజన్ 17 తరువాత కేఎల్ రాహుల్ టీమిండియాకు దూరమయ్యాడు.  అదే విధంగా ఈ క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో స్థాయికి తగ్గట్లు రాణించలేకపోవడంతో..టీ20 ప్రపంచకప్‌-2024 జట్టులో చోటు దక్కలేదు. అయితే తాజాగా శ్రీలంతో జరగనున్న ద్వైపాక్షిక సిరీస్ తో కేఎల్ రాహుల్ టీమిండియాలోకి పునరాగమనం చేయడం  దాదాపు ఖాయమైంది. ఇదే సమయంలో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఈ పర్యటనకు దూరమైతే వన్డే జట్టుకు నాయకుడిగా ఈ కన్నడ బ్యాటర్‌ వ్యవహరించనున్నాడు. ఈ మేరకు ప్రముఖ స్పోర్ట్స్‌ వెబ్‌సైట్‌ తన కథనంలో వివరాలను వెల్లడించింది.

ఇది ఇలా ఉంటే.. ఈ టీమిండియా స్టార్‌ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేశాడు. తన భార్య అతియా శెట్టితో కలిసి ముంబైలోని వెస్ట్‌ బాంద్రాలో విలాసంతమైన ఇంటిని సొంతం చేసుకున్నాడు. ఇందుకోసం రాహుల్‌- అతియా జంట రూ. 20 కోట్లు ఖర్చు చేసినట్లు టాక్ వినిపిస్తోంది. బాంబేలోని వెస్ట్‌ బాంద్రాలోని 3350 చదరపు అడుగుల విస్తీర్ణం గల ఈ ఇంటి కోసం రూ. 1.20 కోట్ల స్టాంప్‌ డ్యూటీ కూడా చెల్లించినట్లు సమాచారం. ఇక ఇదే అపార్ట్‌మెంట్‌లో ఇప్పటికే బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ ఆమిర్‌ ఖాన్‌ సైతం ఫ్లాట్‌ కలిగి ఉన్నారు. అలానే షారుఖ్‌ ఖాన్‌, సైఫ్‌ అలీ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌, జాన్వీ కపూర్‌, త్రిప్తి డిమ్రి కూడా ఇక్కడ ఇళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  ఇక అతియా శెట్టి.. బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు సునిల్‌ శెట్టి కుమార్తె అన్న విషయం తెలిసిందే. నటిగానూ ఆమె తన అదృష్టం పరీక్షించుకుంటున్నారు.

భారత క్రికెట్‌ జట్టులో కీలక సభ్యుల్లో ఒకడైన కేఎల్‌ రాహుల్‌.. బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ జాబితాలో గ్రేడ్‌-ఏ జాబితాలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ లిస్ట్ లో ఉండటంతో ఏడాదికి రూ.5 కోట్ల వేతనం అందుకుంటున్నాడు. మ్యాచ్‌ ఫీజులు ఇందుకు అదనంగా ఉంటాయి. అలానే ఐపీఎల్‌లోనూ కేఎల్‌ రాహుల్‌కు భారీ మొత్తమే సంపాదిస్తున్నాడు. లక్నో సూపర్‌ జెయింట్స్‌ కెప్టెన్‌గా సీజన్‌కు రూ. 17 కోట్ల మేర తీసుకుంటున్నాడని టాక్. శ్రీలంకతో జరిగే టూర్ జూలై 27 నుంచి మొదలుకానుంది. తొలుత మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడనుంది భారత్‌. అనంతరం ఇరు జట్ల మధ్య వన్డే సిరీస్‌ జరుగనుంది.

 

View this post on Instagram

 

A post shared by Athiya Shetty (@athiyashetty)

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbabilonbet girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom