iDreamPost
android-app
ios-app

ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన స్మృతి మంధాన! లవ్ సింబల్ పోస్టు చేస్తూ..

  • Published Jul 08, 2024 | 3:11 PM Updated Updated Jul 08, 2024 | 3:11 PM

Smriti Mandhana: ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ టీమ్ సూపర్ స్టార్ స్మృతి మంధాన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనదైన  ఆటతో మెన్ క్రికెటర్ల రేంజ్ లో ఫ్యాన్  ఫాలోయింగ్ సంపాదించింది. ఈమె తాజాగా తన ఫ్యాన్స్ కి ఓ గుడ్ న్యూస్ చెప్పింది.

Smriti Mandhana: ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ టీమ్ సూపర్ స్టార్ స్మృతి మంధాన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనదైన  ఆటతో మెన్ క్రికెటర్ల రేంజ్ లో ఫ్యాన్  ఫాలోయింగ్ సంపాదించింది. ఈమె తాజాగా తన ఫ్యాన్స్ కి ఓ గుడ్ న్యూస్ చెప్పింది.

  • Published Jul 08, 2024 | 3:11 PMUpdated Jul 08, 2024 | 3:11 PM
ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన స్మృతి మంధాన! లవ్ సింబల్ పోస్టు చేస్తూ..

సెలబ్రిటీలకు సంబంధించిన వార్తలను తెలుసుకునేందుకు ఎంతో మంది ఆసక్తి చూపిస్తుంటారు. ముఖ్యంగా సినిమా, క్రికెటర్లకు సంబంధించిన న్యూస్ ఎక్కువగా వైరల్ అవుతోంది. ఇదే సమయంలో సెలబ్రిటీలు కూడా తమ వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటారు. ముఖ్యంగా తమకు కాబోయే భాగస్వామి, ప్రెగ్నెన్సీ వంటి విషయాలను చెబుతుంటారు. తాజాగా భారత మహిళా క్రికెట్ స్మృతి మంధాన కూడా తన అభిమానులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. లవ్ సింబల్ పోస్టు చేసి.. తన విషయాన్ని చెప్పకనే చెప్పింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ టీమ్ సూపర్ స్టార్ స్మృతి మంధాన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనదైన  ఆటతో మెన్ క్రికెటర్ల రేంజ్ లో ఫ్యాన్  ఫాలోయింగ్ సంపాదించింది. భారత టీ20 జట్టు కెప్టెన్‌ స్మృతి మంధాన కొనసాగుతోంది. ఈమె 1996 జూలై 18న మహారాష్ట్రలోని ముంబైలో జన్మించింది. తొమ్మిదేళ్ల వయసులో బ్యాట్ పట్టిన ఈ లెఫ్టాండర్‌.. 2014లో టెస్టులతో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇండియన్ ఉమెన్ టీమ్ లో కీలక సభ్యురాలిగా ఎదిగింది. అంతేకాక మంధాన టీ20, వన్డే, టెస్టు మూడు ఫార్మాట్లలో సత్తా చాటుతూ…ఎన్నో రికార్డులు తన పేరిట లిఖించుకుంది. అంతేకాక ఇటీవలే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన క్రికెటర్ గా ఆమె రికార్డు సృష్టించింది.

Smriti Mandana

ఆ వేలంలో మంధాన రూ.3.4 కోట్ల ధర పలికింది. తాజా డబ్యూపీఎల్‌ సీజన్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టును విజేతగా నిలిపి కెప్టెన్‌గా ఫ్యాన్స్ చేత నీరాజనాలు అందుకుంది. ఇది ఇలా ఉంటే.. ఈ స్టార్ బ్యాటర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అందించింది. తన మనసులో చోటు దక్కించుకున్న ప్రత్యేకమైన వ్యక్తి ఇతడేనంటూ లవ్ సింబల్ తో పరోక్షంగా సంకేతాలు ఇచ్చింది. మ్యూజిక్, ఫిల్మ్‌ మేకర్‌ పలాష్‌ ముచ్చల్‌ తో తన అనుబంధాన్ని అఫిషియల్ గా ప్రకటించింది. పలాష్ తో కలిసి కేట్ కట్ చేసిన స్మృతి..… ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టింది. అంతేకాక ఆ ఫోటోలకు‘‘ఐదు’’ అంటూ హార్ట్‌ ఎమోజీ జత చేశాడు. తమ ప్రేమ బంధానికి ఐదు వసంతాలు నిండాయన్న అర్థంలో క్యాప్షన్‌ పోస్టు చేసింది.

ఇక పలాష్ ముచ్చల్ విషయానికి వస్తే.. అతడు మ్యూజిక్ కంపోజర్ గా ఉన్నాడు. 28 ఏళ్ల ఈ పలాష్ తో స్మృతి మంధాన ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ సింగర్ పాలక్ ముచ్చల్ సోదరుడే పలాష్ ముచ్చల్. బాలీవుడ్ సూపర్‌ స్టార్లు సల్మాన్‌ ఖాన్‌, హృతిక్‌ రోషన్‌ మూవీస్ లో పాలక్‌ పాడగా, మ్యూజిక్‌ కంపోజర్‌గా పలాష్‌ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. టీ- సిరీస్‌, జీ మ్యూజిక్‌ కంపెనీ, పాల్‌ మ్యూజిక్‌ వంటి కంపెనీలతో కలిసి 40కి పైగా మ్యూజిక్‌ వీడియోలు చేశాడు. మొత్తంగా తాజాగా పోస్టుతో స్మృతి మంధాన తనకు ఇష్టమైన వ్యక్తి గురించి పరోక్షంగా చెప్పింది. మరి. ఈ స్టార్ ప్లేయర్ పోస్టుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Palaash Muchhal (@palash_muchhal)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişgrandpashabetcasinolevantcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibom