iDreamPost

విజయ్‌కి నో చెప్పిన శ్రీలీల! అట్లుంటది మన విజ్జీ పాపతోని!

గత ఏడాది దసరాకు లియో మూవీతో వచ్చి సందడి చేశాడు ఇళయ దళపతి విజయ్. ఇప్పుడు గోట్ అనే మూవీ తెరకెక్కుతోంది. ఇందులో ఓ ప్రత్యేకమైన సాంగ్ కోసం శ్రీలీలను సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. అయితే. .

గత ఏడాది దసరాకు లియో మూవీతో వచ్చి సందడి చేశాడు ఇళయ దళపతి విజయ్. ఇప్పుడు గోట్ అనే మూవీ తెరకెక్కుతోంది. ఇందులో ఓ ప్రత్యేకమైన సాంగ్ కోసం శ్రీలీలను సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. అయితే. .

విజయ్‌కి నో చెప్పిన శ్రీలీల! అట్లుంటది మన విజ్జీ పాపతోని!

కోలీవుడ్ టాప్ హీరో.. ఇళయ దళపతి విజయ్‌కి తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉన్న సంగతి విదితమే. ఆయన సినిమాలు ఇక్కడ కూడా డబ్బింగ్ అయ్యి మంచి కలెక్షన్లను రాబట్టుకుంటున్నాయి. రజనీకాంత్, కమల్, సూర్య తర్వాత టాలీవుడ్ బాక్సాఫీసును షేక్ చేసే సినిమాలను అందిస్తున్నాడు. గత ఏడాది లియో మూవీతో సందడి చేశాడు. లోకేశ్ కనకరాజ్ ఎలివేషన్లకు థియేటర్లు దద్దరిల్లిపోయాయి. ఇందులో త్రిష హీరోయిన్‌గా నటించగా.. మడోన్నా సెబాస్టియన్ చెల్లెలిగా యాక్ట్ చేసింది. ఇక వరుస సినిమాలను లైనప్ చేస్తాడు అనుకున్నారు.. కానీ సినిమాల నుండి వైదొలగి రాజకీయాల్లోకి రాబోతున్నట్లు ప్రకటించారు. తమిళ వెట్రీ కళగం పార్టీ పేరుగా ప్రకటించారు.

దీంతో విజయ్..రెండు, మూడు సినిమాలతో యాక్టింగ్ కెరీర్‌కు గుడ్ బై చెబుతున్నారని భావిస్తున్నారు. కాగా, ఆయన నటిస్తున్న అప్ కమింగ్ మూవీ గోట్ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం). కోలీవుడ్ వర్సటైట్ డైరెక్టర్ వెంకట్ ప్రభు ఈ చిత్రానికి దర్శకుడు. ఇందులో మహేష్ మరదలు పిల్ల మీనాక్షి చౌదరి హీరోయిన్. లైలా, స్నేహ, ప్రశాంత్, ప్రభుదేవా, అజ్మల్ అమీర్, మోహన్, జయరాం, వైభవ్, యోగి బాబు తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కల్పతి ఎస్ అఖోరం, గణేష్, సురేష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. అవతార్, అవెంజర్స్ వంటి హాలీవుడ్ చిత్రాలకు విజువల్ ఎఫెక్ట్స్ అందించిన సాంకేతిక నిపుణులు ఈ మూవీకి కూడా వర్క్ చేస్తున్నారు.

సెప్టెంబర్ 5న విడుదల కాబోతున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా స్వరాలు సమకూరుస్తున్నాడు. ఇదిలా ఉంటే.. ఇందులో ఓ స్పెషల్ సాంగ్ ఉందట. దీని కోసం టాలీవుడ్ డ్యాన్స్ క్వీన్ శ్రీలీలను సంప్రదించినట్లు వార్తలు వినిపించాయి. కాగా, ఆమె ఆ ఐటెమ్ సాంగ్ రిజక్ట్ చేసిందని టాక్ నడుస్తోంది. దీంతో ఆమె ప్లేసులోకి రీప్లేస్ అయ్యింది ప్రముఖ నటి త్రిష. లియోలో వీరి జోడిని మరోసారి చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోయారు. దీంతో ఆమెను విజయ్ సరసన పెప్ సాంగ్‌లో నటించేందుకు త్రిష యాక్సెప్ట్ చేసిందని తెలుస్తోంది. ప్రస్తుతం త్రిష తెలుగుతో పాటు తమిళం,మలయాళంలో పలు ప్రాజెక్టులు చేస్తున్న సంగతి విదితమే. విదా ముర్చితో పాటు రామ్, ఐడెంటిటీ, థగ్ లైఫ్, విశ్వంభరలో నటిస్తుంది. వరుసగా మూడు ఇండస్ట్రీల్లో వర్క్ చేస్తూనే ఇప్పుడు విజయ్‌తో స్పెషల్ సాంగ్‌కు ఓకే చెప్పింది. ప్రస్తుతం శ్రీలీల చేతిలో ఉస్తాద్ భగత్ సింగ్ తప్ప.. మరే ప్రాజెక్టులు లేవు. అయినప్పటికీ స్టార్ హీరో సరసన పాట చేయనని చెప్పింది. అట్లుంటది మన విజ్జీ పాపతోని అంటున్నారు శ్రీలీల ఫ్యాన్స్.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి