iDreamPost
android-app
ios-app

మారు వేషంలో ఉన్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవరో గుర్తుపట్టారా?

  • Published Jul 12, 2024 | 5:00 AM Updated Updated Jul 12, 2024 | 5:00 AM

ఈ ఫోటోలో మారు వేషంలో ఉన్న ఈ టాలీవుడ్ యంగ్ హీరోను గుర్తుపట్టండి. ఇప్పుడు రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ రెండు సినిమాలు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఇంతకు ఆ నటుడు ఎవరంటే..?

ఈ ఫోటోలో మారు వేషంలో ఉన్న ఈ టాలీవుడ్ యంగ్ హీరోను గుర్తుపట్టండి. ఇప్పుడు రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ రెండు సినిమాలు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఇంతకు ఆ నటుడు ఎవరంటే..?

  • Published Jul 12, 2024 | 5:00 AMUpdated Jul 12, 2024 | 5:00 AM
మారు వేషంలో ఉన్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవరో గుర్తుపట్టారా?

యాక్టింగ్ అంటే ప్రాణం పెట్టేస్తుంటారు కొంత మంది హీరోలు. పాత్రకు తగ్గట్టు మారిపోతుంటారు. బాడీ పుట్ ఆన్ కావడం,తగ్గడం వంటి భారీ వర్కౌట్స్ చేస్తూ.. రిస్కులు చేస్తుంటారు. ఇక కథ డిమాండ్ చేస్తే వయస్సుకు మించిన రోల్స్ చేస్తారు. ఇక మేకప్ గురించి చెప్పనక్కర్లేదు. భారీ మేకప్, కాస్ట్యూమ్స్ మోస్తుంటారు. ఇటీవల అశ్వత్థామ,యాస్కిన్ పాత్రల్లో నటించిన సీనియర్ స్టార్స్ అమితాబ్, కమల్ హాసన్ మేకప్‌తో అలరించిన సంగతి విదితమే. మరోసారి సినిమాపై తనకున్న ఫ్యాషన్ ఏంటో నిరూపించారు ఈ దిగ్గజ నటులు. ఇదిగో ఈ ఫోటోలో ముసలి గెటప్‌లో ఉన్న నటుడ్ని గుర్తుపట్టారా..? టాలీవుడ్ యంగ్ హీరో అని తెలుసా..? ఇంతకు ఆ నటుడు ఎవరంటే..?

టాలీవుడ్ మోస్ట్ వర్సటైల్ నటుడు నితిన్. నమ్మలేకపోతున్నారు కదా. నిజమేనండి ఆ వృద్ధుడు మన నితినే. రాబిన్ హుడ్ షూటింగ్ సందర్భంగా ఓ వీడియో వైరల్ అయ్యింది. ఇందులో నితిన్ ఇలా కనిపించాడు. ఆ పక్కనే డ్యాన్స్ క్వీన్ శ్రీలీల కూడా సందడి చేసింది. ఒక్కసారిగా ఈ గెటప్‌లో కనిపించి షాక్ ఇచ్చాడు ఈ యంగ్ స్టార్. ‘రాబిన్ హుడ్ ఆఫ్టర్ 25 ఇయర్స్.. రాబిన్ హుడ్ హీరోయిన్ అంటూ శ్రీలీల’ వైపు చూపించి ఫన్ క్రియేట్ చేశారు వీడియో తీసిన వ్యక్తి. ఇప్పుడు ఏజ్డ్‌గానే ఉన్నావ్..అప్పుడు ఏజ్డ్‌గానే ఉన్నావ్ అంటూ జోక్ పేల్చగానే ఫన్నీగా స్పందించింది శ్రీలీల. ఫేస్ యాప్, ఏఐ టెక్నాలజీ వంటి సాంకేతికను వినియోగించి ఈ వీడియోను క్రియేట్ చేసినట్లు తెలుస్తుంది. లేక సినిమాలో సన్నివేశమా అని తెలియాల్సి ఉంది.

రాబిన్ హుడ్ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీమూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. నవీన్ ఎర్నేనీ, వై రవిశంకర్ నిర్మాతలు. వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీలీల హీరోయిన్. ఇది వినోదంతో కూడిన యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కబోతుంది. ప్రస్తుతం నితిన్ ఈ మూవీతో పాటు తమ్ముడు చిత్రాన్ని చేస్తున్నాడు. చాలా రోజుల తర్వాత లయ ఇందులో కీలక పాత్రలో కనిపించబోతుంది. ఇటు శ్రీలీల చేతిలో నాలుగు సినిమాలున్నాయి. పవన్ కళ్యాణ్ సరసన ఉస్తాద్ భగత్ సింగ్, ఓ హిందీ మూవీతో పాటు.. రవితేజ 75వ మూవీలో హీరోయిన్‌గా ఫిక్స్ అయ్యింది.

Jojobet GirişHoliganbet GirişHoliganbet GirişHoliganbet GirişHoliganbet GirişHoliganbet GirişHoliganbetjojobetgrandpashabetkralbetcasibomiptvjojobetcasibomcasibomGrandpashabetgrandpashabetselcuksports girişEscortes BelgiqueCasibomCasibomgrandpashabetJOJOBET GİRİŞLERİCasibom