iDreamPost

AP విద్యావ్యవస్థకి అంతర్జాతీయ గుర్తింపు!

YS Jagan: సరైన సదుపాయాలు కల్పిస్తే తాము ఎంతో అద్భుతంగా రాణించగలమని రాష్ట్రంలోని సర్కార్ బడుల విద్యార్థులు రుజువు చేస్తున్నారు. జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ ఇప్పుడు వీరు తమ ప్రతిభను చాటుతున్నారు.

YS Jagan: సరైన సదుపాయాలు కల్పిస్తే తాము ఎంతో అద్భుతంగా రాణించగలమని రాష్ట్రంలోని సర్కార్ బడుల విద్యార్థులు రుజువు చేస్తున్నారు. జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ ఇప్పుడు వీరు తమ ప్రతిభను చాటుతున్నారు.

AP విద్యావ్యవస్థకి అంతర్జాతీయ గుర్తింపు!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విద్యావ్యవస్థలో తనదైన మార్క్ ను చూపించారు. వైసీపీ అధికారంలోకి రాకముందు, వచ్చిన తరువాత విద్యారంగంలో ఎంతటి మార్పు వచ్చిందో.. అనేక గుర్తింపులు, సత్కారాలే నిదర్శనం. నాణ్యమైన చదువే పిల్లలకు మనం ఇచ్చే నిజమైన ఆస్తి అని బలంగా నమ్మి.. ఆ దిశగానే  అడుగులు వేశారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఏపీ విద్యావ్యవస్థలో తీసుకొచ్చిన అనేక సంస్కరణల కారణంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఏపీ విద్యార్థులు  తమ సత్తా చాటుతున్నారు.

సరైన సదుపాయాలు కల్పిస్తే తామెంతో రాణించగలమని రాష్ట్రంలోని సర్కార్ బడుల విద్యార్థులు నిరూపిస్తున్నారు. నాడు-నేడు కింద ప్రభుత్వ పాఠశాలలను అద్భుతంగా తీర్చిదిద్ది, విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక సౌకర్యాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. దీంతో అక్కడి సైన్స్ ల్యాబ్స్, అనుభవం కలిగిన టీచర్ల ప్రోత్సాహంతో కేంద్ర ప్రభుత్వం సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం నిర్వహించే ‘ఇన్ స్పైర్’ పోటీల్లో ప్రభుత్వ విద్యార్థులు తమ సత్తా చాటుతున్నారు. 2019-2022 విద్యా సంవత్సరం వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ఏడుగురు విద్యార్థులు తమ ప్రతిభతో ‘జపాన్ సకురా’ అనే  పోటీలకు సెలెక్ట్ అయ్యారు.  అయితే  ఈ ఏడుగురిలో ఇప్పటికే ముగ్గురు విద్యార్థులు జపాన్ లో  పర్యటించారు. మిగిలిన నలుగురు వచ్చే మేలో జపాన్ కు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.

ఇక సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు, వచ్చిన తరువాత పరిస్థితులు పరిశీలించినట్లు అయితే తేడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. 2019కి ముందు జాతీయ స్థాయిలో ఇన్ స్ఫైర్  పోటీల్లో ఏపీ 10వ స్థానంలో ఉంటే..  నేడు ఏకంగా 3వ స్థానానికి చేరుకుంది.  అలానే గతంలో రెండు మూడేళ్లకు ఒక్కరు ఈ పోటీలకు ఎంపికవ్వడమే గగనంగా ఉండే పరిస్థితి నుంచి నేడు ఏటా ముగ్గురు నుంచి నలుగురు విద్యార్థులు  ఎంపికవుతున్నారు. ఇదే ఏపీ ప్రభుత్వ బడుల్లో విద్యా ప్రమాణాలు, సదుపాయాల పెరుగుదలకు, టీచర్ల శిక్షణ కారణమని విద్యావేత్తలు అభినందిస్తున్నారు.

ఏపీ ప్రభుత్వ బడుల్లో చదువుకున్న విద్యార్థుల్లో 10 మంది 2023 సెప్టెంబరులో అమెరికా, యూఎన్ఓలో ప్రసంగించిన విషయం అందరికి తెలిసిందే.  ఇప్పుడు అదే స్థాయిలో ఇన్ స్పైర్ విద్యార్థులు జపాన్ కు వెళ్లి ఏపీ విద్యా ప్రగతిని చాటుతున్నారు. ఇలా ఏపీ విద్యా వ్యవస్థకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి గడిస్తోంది. నాడు-నేడు, అమ్మఒడి, జగనన్న గోరు ముద్దు,  జగనన్న కానుక వంటి అనేక పథకాలను సీఎం జగన్ ప్రవేశపెట్టారు. ప్రైవేటు పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను రూపుదిద్దారు. ఇలాంటి ఎన్నో సంస్కరణలను విద్యావ్యవస్థలో తీసుకు రావడంతో  ఏపీ బడులకు  ప్రపంచ స్థాయిలో గుర్తింపు లభిస్తోంది. మరి.. ఇలా సర్కార్ పాఠశాలల విద్యార్థులు ఇతర దేశాలకు వెళ్లే అవకాశం పొందుతుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి