iDreamPost

డబుల్ ఇస్మార్ట్ కోసం రంగంలోకి ‘కేజీఎఫ్ 2’ విలన్!

  • Author ajaykrishna Published - 02:46 PM, Sat - 29 July 23
  • Author ajaykrishna Published - 02:46 PM, Sat - 29 July 23
డబుల్ ఇస్మార్ట్ కోసం రంగంలోకి ‘కేజీఎఫ్ 2’ విలన్!

ఒక సినిమా మంచి హిట్ అయ్యిందంటే చాలు.. దానికి సీక్వెల్స్ రావడం కామన్ అయిపోయింది. ఈ మధ్యకాలంలో ఇలాంటి ట్రెండ్ ఎక్కువగా చూస్తున్నాం. ఇప్పుడు కొత్త కథలతో రిస్క్ చేయకుండా.. ఇదే ట్రెండ్ ని ఫాలో అయిపోతున్నాడు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఉస్తాద్ హీరో రామ్ తో తీసిన ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయం సాధించిందో తెలిసిందే. పక్కా హైదరాబాది మాస్ క్యారెక్టర్ లో రామ్ ఇరగదీసాడు. పూరి రాసిన డైలాగ్స్.. హీరోహీరోయిన్స్ మధ్య కెమిస్ట్రీ.. మణిశర్మ సాంగ్స్ అన్ని థియేటర్స్ లో విజిల్స్ వేయించాయి. మొత్తానికి 2019లో ఇస్మార్ట్ శంకర్.. పూరి, రామ్ లకు అద్భుతమైన ఫలితాన్ని అందించింది.

ఇప్పుడు ఇదే సినిమాకు కొనసాగింపుగా వీరి కాంబినేషన్ లో ‘డబుల్ ఇస్మార్ట్’ తెరపైకి వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల పూజా కార్యక్రమంతో టైటిల్ కూడా అనౌన్స్ చేశారు పూరి టీమ్. అయితే.. ఆల్రెడీ గతేడాది లైగర్ ఇచ్చిన పాన్ ఇండియా షాక్ నుండి తేరుకోలేక పోయాడని ఓవైపు కథనాలు వెలువడుతుండగా.. పూరి డబుల్ ఇస్మార్ట్ అనౌన్స్ చేయడం అందరిని సర్ప్రైజ్ చేసింది. ఈసారి ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొట్టాలనే కసి అటు రామ్, ఇటు పూరి ఇద్దరిలోనూ కనిపిస్తుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా గురించి ఒక్కో అప్డేట్ వదులుతున్నారు మేకర్స్. తాజాగా డబుల్ ఇస్మార్ట్ టైటిల్ కి తగ్గట్టుగా.. ఫ్యాన్స్ కి డబుల్ కిక్ ఇచ్చే న్యూస్ చెప్పారు.

ఈసారి డబుల్ ఇస్మార్ట్ కోసం.. ఏకంగా బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ని రంగంలోకి దింపేశారు. ఇప్పటికే కేజీఎఫ్ 2లో విలన్ గా మెప్పించిన సంజయ్.. ఇప్పుడు లియోలో నటిస్తున్నారు. ఇంతలోనే ఇప్పుడు డైరెక్ట్ తెలుగు సినిమాలో విలన్ అంటే.. మామూలు విషయం కాదు. ఇక డబుల్ ఇస్మార్ట్ లో సంజయ్ దత్.. బిగ్ బుల్ అనే క్యారెక్టర్ లో కనిపించనున్నాడు. ఆయనకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. చూస్తుంటే.. బిగ్ బుల్ కోసం పూరి పవర్ ఫుల్ క్యారెక్టర్ డిజైన్ చేసినట్లు అనిపిస్తుంది. ఇక సంజయ్ రాకతో డబుల్ ఇస్మార్ట్ పై ఫ్యాన్స్ లో అంచనాలు డబుల్ అయిపోయాయని చెప్పాలి. ఇదిలా ఉండగా.. ఈ సినిమాను మహాశివరాత్రి సందర్బంగా 2024 మార్చి 14న రిలీజ్ చేయాలనీ యోచిస్తున్నారట. అయితే.. ఇంకా ఇందులో హీరోయిన్ ఎవరనేది కన్ఫర్మ్ కాలేదు. సో.. డబుల్ ఇస్మార్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

 

View this post on Instagram

 

A post shared by Charmmekaur (@charmmekaur)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి