iDreamPost

Samantha: కర్నూలు విద్యార్థినిపై సమంత ప్రశంసలు.. ’తనే ఆదర్శం‘

  • Published Apr 15, 2024 | 10:14 AMUpdated Apr 15, 2024 | 11:15 AM

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఏపీ విద్యార్థినిపై ప్రశంసలు కురిపించారు. ఇవాళ్టి ఆదర్శం అంటూ తన ఇన్ స్టా స్టోరీస్ లో పోస్ట్ చేసింది. ఆ వివరాలు..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఏపీ విద్యార్థినిపై ప్రశంసలు కురిపించారు. ఇవాళ్టి ఆదర్శం అంటూ తన ఇన్ స్టా స్టోరీస్ లో పోస్ట్ చేసింది. ఆ వివరాలు..

  • Published Apr 15, 2024 | 10:14 AMUpdated Apr 15, 2024 | 11:15 AM
Samantha: కర్నూలు విద్యార్థినిపై సమంత ప్రశంసలు.. ’తనే ఆదర్శం‘

సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఏళ్ల తరబడి సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా రాణిస్తోంది. సినిమాలతో పాటు సమంత వ్యక్తిగత జీవితంపై కూడా బోలేడు వార్తలు వస్తుంటాయి. మరీ ముఖ్యంగా నాగచైతన్యతో పెళ్లి, విడాకులు, ఈ మధ్య కాలంలో తన అనారోగ్యం ఇలా నిత్యం ఏదో ఒక వార్తతో లైమ్ లైట్ లో ఉంటుంది. ఎక్కువగా తన ఫొటో షూట్, సినిమాలు, తన హెల్త్ అప్డేట్స్ గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసే సామ్.. తాజాగా ఓ సాధారణ యువతి గురించి ప్రస్తావించింది. తనను ప్రశంసించడమే కాక.. అందర్శికి ఆదర్శం అంటూ పొగడ్తలు కురిపించింది. ఓ సాధారణ తెలుగు విద్యార్థిని గురించి సమంత పోస్ట్ చేయడం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఆ వివరాలు..

తాజాగా సమంత ఏపీ, కర్నూలుకు చెందిన ఇంటర్‌ విద్యార్థిని నిర్మలపై ప్రశంసలు కురిపించింది. ఇవాళ్టి ఆదర్శం తనే అంటూ ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. అంతే కాకుండా నిర్మలకు సంబంధించి ఓ ప్రముఖ పత్రికలో వచ్చిన వార్త క్లిప్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఓ సాధారణ విద్యార్థినిపై సమంత లాంటి స్టార్ హీరోయిన్ ప్రశంసలు కురిపించడం ఆసక్తికరంగా మారింది. ఆమె మంచి మనసును అభిమానులు మెచ్చుకుంటున్నారు.

ఇంతకు సమంత ప్రశంసించిన నిర్మల ఎవరంటే.. ఇటీవల రిలీజైన ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్ ఫస్టియర్‌ ఫలితాల్లో ఆలూరు కేజీబీవీలో చదివి.. బైపీసీలో 440 కి 421 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచిన బాలిక. దీనిలో పెద్ద విశేషం ఏముంది అంటే సదరు విద్యార్థిని.. బాల్య వివాహం నుంచి తప్పించుకుని మరీ చదువులో తానేంటో నిరూపించుకుంది. అంతేకాదు ఐపీఎస్‌ ఆఫీసర్‌ కావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇంటర్ లోనే కాక పదో తరగతిలో కూడా నిర్మల 537 మార్కులు సాధించింది.

నిరుపేదలైన నిర్మల తల్లిదండ్రులకు నలుగురు కుమార్తెలు సంతానం. వీరిలో ముగ్గురికి పెళ్లి చేశారు. ఆర్థిక ఇబ్బందులను సాకుగా చూపి నిర్మలకి కూడా చిన్నతనంలోనే వివాహం చేయాలని భావించారు. కానీ చదువు మీద మక్కువతో నిర్మల పెళ్లిని ఎదిరించింది. తల్లిదండ్రులతో పోరాడి మరి బాల్య వివాహం నుంచి తప్పించుకుంది. ఆ తర్వాత అధికారుల సాయంతో.. తన చదువు కొనసాగిస్తూ.. ఇప్పుడు ఇంటర్ ఫస్టియర్ బైపీసీలో టాపర్ గా నిలిచింది.

ఇక సమంత సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె సిటాడెల్ వెబ్ సిరీస్‌ ఇండియన్‌ వర్షన్‌లో కనిపించనుంది. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ సరసన నటిస్తోంది. గతేడాది శాకుంతలం, ఖుషి సినిమాలతో అలరించింది. మయోసైటిస్ వ్యాధి నుంచి కోలుకుని ఇప్పుడిప్పుడే రీ ఎంట్రీతో అదరగొడుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి