iDreamPost
android-app
ios-app

Bhaag Saale Movie Review: ‘భాగ్ సాలే’ సినిమా రివ్యూ!

  • Published Jul 07, 2023 | 3:05 PM Updated Updated Jul 07, 2023 | 3:05 PM
Bhaag Saale Movie Review: ‘భాగ్ సాలే’ సినిమా రివ్యూ!

‘మత్తు వదలరా’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు ప్రముఖ సంగీత దర్శకుడు కిరవాణి కొడుకు శ్రీ సింహా. తొలి సినిమాతోనే అందరిని తన నటనతో ఆకట్టుకున్నాడు. అయితే ఆ తర్వాత చేసిన సినిమాలు అంతగా పేరు తెచ్చిపెట్టలేదు. ఇక తాజాగా అతడు నటించిన చిత్రం ‘భాగ్ సాలే’ డైరెక్టర్ ప్రణీత్ తెరకెక్కించిన ఈ చిత్రం టీజర్ తోనే ఇండస్ట్రీని మెుత్తం తనవైపుకు తిప్పుకుంది. హీరో సిద్దు వాయిస్ తో విడుదల చేసిన టీజర్ కు అదిరిపోయే స్పందన వచ్చింది. తర్వాత వచ్చిన ట్రైలర్ కూడా సినిమాపై అంచనాలను పెంచింది. తాజాగా జూలై 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో? శ్రీ సింహా కు హిట్ ఇచ్చిందా? లేదా? రివ్యూలో చూద్దాం.

కథ

అర్జున్ (శ్రీ సింహా) ఓ షెఫ్. తాను రిచ్ పర్సన్ అని అబద్దం చెప్పి మాయ(నేహా సోలంకి)ని లవ్ లో పడేస్తాడు. మాయ తండ్రిని విలన్ శ్యాముల్ (జాన్ విజయ్) కిడ్నాప్ చేసి, ఓ డైమండ్ రింగ్(షాలి సుకా గజా-ఆ రింగ్ పేరు) ఎక్కడుందని అడుగుతాడు. ఆ రింగ్ తీసుకొచ్చి నాకు ప్రపోజ్ చేస్తే.. పెళ్లికి ఒకే చెబుతానని నళిని(నందిని రాయ్) షరతు పెడుతుంది. రూ.25 కోట్ల విలువ చేసే ఆ రింగ్ కథ ఏంటి? ఆ రింగ్ కోసం అర్జున్ అబద్దాలు ఎందుకు చెప్పాడు? అబద్దాలు తెలిసిన తర్వాత మాయ ఏం చేసింది? విలన్ గ్యాంగ్ ఆ రింగ్ కోసం ఎందుకు వెతుకుతోంది? చివరికి ఆ ఉంగరం ఎవరికి దొరికిందనేదే మిగిలిన కథ.

విశ్లేషణ

భాగ్ సాలే ఓ క్రైమ్ కామెడీ చిత్రం. ఇక ఇలాంటి కథలు టాలీవుడ్ లో చాలానే వచ్చాయి. ఓ విగ్రహం కోసం లేదా మరేదైనా వస్తువుకోసం హీరో గ్యాంగ్ లు, విలన్ గ్యాంగ్ లు వెతుకులాడటం లాంటి ప్యాట్రన్ మూవీలు ఎన్నో చూశాం. ఈ సినిమా కూడా ఆ కోవకు చెందినదే. అయితే డైరెక్టర్ ఈ మూవీని తెరకెక్కించిన విధానాన్ని మెచ్చుకోవాలి. అక్కడక్కడ డైరెక్టర్ తడబడ్డట్లు కనిపిస్తుంది. ఇక భాగ్ సాలే కథేంటో సిద్దు జొన్నల గడ్డ తన వాయిస్ ఓవర్ తోనే చెప్పేశాడు. తాను రిచ్ పర్సన్ అని అర్జున్ మాయ దగ్గర ఆడే అబద్దాలు, పడే కష్టాలు ప్రేక్షకులకు నవ్వు తెప్పిస్తాయి. అయితే అక్కడక్కడ కొన్ని సినిమాటిక్ సన్నివేశాలు ప్రేక్షకులను బోరింగ్ కు గురిచేస్తాయి. విలన్ గ్యాంగ్ రింగ్ కోసం వెతకటం, హీరో గ్యాంగ్ తప్పించుకోవడం కోసం చేసే ఛేజింగ్ సీన్లు ప్రేక్షకులకు నవ్వు తెప్పిస్తాయి. ఇలా ఫస్టాఫ్ మెుత్తం సరదాగా సాగిపోతుండగా.. సడెన్ ట్విస్ట్ తో ఇంటర్వల్ బ్యాంగ్ పడుతుంది. సెకండాఫ్ వచ్చే సరికి కథ కొద్దిగా నెమ్మదించినట్లు అనిపిస్తుంది. కామెడీ మీద పెట్టిన గ్రిప్ దర్శకుడు థ్రిల్లింగ్ స్క్రీన్ ప్లే మీద చూపెట్టడంలో ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. యాంకర్ వర్షిణి, సత్యల కామెడీ ప్రేక్షకులను కొంతవరకు నవ్విస్తుంది. అయితే సినిమాలో ఎక్కువగా సన్నివేశాలు ట్రాక్స్ లా ఉండటంతో.. చివరకు వచ్చే సరికి గజిబిజిగా అనిపిస్తుంది. విలన్ గ్యాంగ్స్ చేసే కామెడీనే ఈ సినిమాకు హైలెట్ అని చెప్పాలి. డైరెక్టర్ కామెడీ సీన్లు అద్భుతంగా రాసుకున్నాడు.

నటీ, నటులు పనితీరు

శ్రీ సింహా కోడూరి మరోసారి తన నటనతో ఆకట్టుకున్నాడు. షెఫ్ గా, రిచ్ పర్సన్ గా సహజ నటనను కనబరిచాడు. ఎమోషన్స్ కూడా చాలా అద్భుతంగా పండించాడు. ఇక హీరోయిన్ లు రెగ్యులర్ పాత్రను పోషించినట్లుగానే తమపని తాము చేసుకుపోయారు. గ్లామర్ పరంగా ఓకే గానీ యాక్టీంగ్ కు అంతగా స్కోప్ లేదనే చెప్పాలి. తమిళ నటుడు జాన్ విజయ్ తో కలిసి వైవా హర్ష చేసిన ఫన్ కడుపుబ్బా నవ్విస్తుంది. రాజీవ్ కనకాల తన పాత్రలకు విరుద్దంగా ఈ సినిమాలో కామెడీ పండించారు. కాలభైరవ సంగీతం ఈ సినిమాకు హైలెట్ అని చెప్పాలి. బ్యాంగ్రౌండ్ స్కోర్ తో ఆకట్టుకున్నాడు కాల భైరవ. కెమెరా పనితనం బాగుంది. కత్తెరకు ఇంకాస్త పదునుపెడితే బాగుండేది. నిర్మాణ విలువలు ఎక్కడా తగ్గలేదు. నిర్మాతలకు కథపై నమ్మకంతో ఖర్చుకు వెనకాడలేదని తెలుస్తోంది. ఇక తొలిసారి దర్శకత్వం వహించినా గానీ డైరెక్టర్ ప్రణీత్ కామెడీతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. చివరగా ఈ భాగ్ సాలే.. కామెడీతో పరిగెత్తించాడు.