iDreamPost
android-app
ios-app

ఖైదీ మూవీలో ఢిల్లీ కూతురు గుర్తుందా? అప్పుడే హీరోయిన్ రేంజ్ లో..!

Child Artist Baby Monika Siva From Kaithi Movie: ఇండస్ట్రీలో చాలా మంది చైల్డ్ ఆర్టిస్టులు ఉన్నారు. కొందరైతే స్టార్ ఇమేజ్ తో దూసుకుపోతున్నారు. ఈ చిన్నారి కూడా ఆ జాబితాలోకే వస్తుంది. అయితే ఖైదీ సినిమా తర్వాత ఆ అమ్మడు ఎలా ఉందో చూశారా?

Child Artist Baby Monika Siva From Kaithi Movie: ఇండస్ట్రీలో చాలా మంది చైల్డ్ ఆర్టిస్టులు ఉన్నారు. కొందరైతే స్టార్ ఇమేజ్ తో దూసుకుపోతున్నారు. ఈ చిన్నారి కూడా ఆ జాబితాలోకే వస్తుంది. అయితే ఖైదీ సినిమా తర్వాత ఆ అమ్మడు ఎలా ఉందో చూశారా?

ఖైదీ మూవీలో ఢిల్లీ కూతురు గుర్తుందా? అప్పుడే హీరోయిన్ రేంజ్ లో..!

ఇండియన్ సినిమాల్లో కొన్ని చిత్రాలకు ఒక గొప్ప స్థానం ఉంటుంది. అవి ఎప్పుడు రిలీజ్ అయ్యాయి? ఎంత స్కేల్ లో రిలీజ్ అయ్యాయి అనే విషయాలు పక్కన పెడితే.. ఆ మూవీ ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అనేదే లెక్క. ఈ ఖైదీ సినిమా కూడా అదే కోవకు చెందుతుంది. పైగా సెన్సేషనల్ డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్ యూనివర్స్ లో ఈ ఖైదీ మూవీకి, కార్తీ చేసిన ఢిల్లీ అనే పాత్రకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. లోకీ యూనివర్స్ మొత్తం ఈ ఢిల్లీ పాత్ర చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అలాంటి ఖైదీ సినిమాలో ఢిల్లీ కూతురిగా అముదా పాత్రలో నటించిన బేబీ మోనికా గుర్తుందా? నిజానికి ఖైదీ సినిమా మొత్తం ఆ పాత్ర చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అలాంటి పాత్ర చేసిన అముదా ఇప్పుడు ఎలా ఉందో చూస్తే మతిపోతుంది.

ఖైదీ సినిమా చూసిన వాళ్లందరికీ ఢిల్లీ పాత్ర ఎంత పవర్ ఫుల్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక హత్య కేసులో ఢిల్లీ జైలుకు వెళ్తాడు. అతని భార్య చనిపోతుంది. తనకు ఉన్న ఒకే ఒక్క కుమార్తె సంరక్షణా నిలయంలో ఉంటూ చదువుకుంటూ ఉంటుంది. తన తండ్రి ఎప్పుడు తిరిగి వస్తాడా అని ఎదురుచూస్తూ ఉంటుంది. అలాగే తన కుమార్తెను మొట్ట మొదటిసారి చూసేందుకు వెళ్తున్న ఢిల్లీకి దారిలో లేనిపోని తలనొప్పి వచ్చి తగులుకుంటుంది. ఆ తర్వాత ఢిల్లీ ఆ అమ్మాయిని కలుసుకుని దూరంగా వెళ్కోలిపోతాడు. అక్కడితోనే ఆ కథను ముంగిచేశారు. కానీ, పార్ట్ 2 కోసం అంతా వెయిట్ చేస్తున్నారు. ఢిల్లీ ఫ్లాష్ బ్యాక్ ఏంటి? అతను జైలుకు ఎందుకు వెళ్లాడు? ఇలా చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి.

ఈ ఖైదీ సినిమా మొత్తం రివేంజ్ స్టోరీ అని చాలా మంది అనుకుంటారు. కానీ, కంప్లీట్ ఫాదర్- డాటర్ రిలేషన్ గురించే కథ మొత్తం నడుస్తూ ఉంటుంది. ఇంత ఇంపార్టెంట్ కథలో.. ఒక ఇంపార్టెంట్ పాత్ర పోషించిన బేబీ మోనికా ఇప్పుడు ఎలా ఉంది అని చాలా మందికి అనిపించే ఉంటుంది. పైగా ఈ ఖైదీ సినిమా ఇప్పుడు రీరిలీజ్ కాబోతోంది. ఇలాంటి తరుణంలో ఒకసారి బేబీ మోనికా ఎలా ఉందో తెలుసుకుంటే బాగానే ఉంటుంది. అముదా పాత్ర చేసిన బేబీ మోనికా చాలా పాపులర్.

బేబీ మౌనికా చాలానే సినిమాల్లో నటించింది. పైగా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ.. చాలా మంది అభిమానులను సొంతం చేసుకుంది. అలాగే చైల్డ్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు కూడా సంపాదించుకుంది. ఖైదీ మాత్రమే కాకుండా.. ఎరుంబు, ది ప్రీస్ట్, ఖాదర్ భాషా వంటి మంచి మంచి సినిమాల్లో నటించి మెప్పించింది. ది ప్రీస్ట్ మూవీకి మాలీవుడ్ ఫ్లిక్స్ నుంచి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్టు అవార్డును కూడా సొంతం చేసుకుంది. ఇంకా కొన్ని రోజులు పోతే బేబీ మౌనికా శివని.. హీరోయిన్ మౌనికా అనే పరిస్థితి వచ్చేస్తుంది. ఇప్పటి నుంచి హీరోయిన్ లక్షణాలు బాగా కనిపిస్తున్నాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి