iDreamPost

తాండూరు కుక్క దాడి ఘటనపై రష్మీ గౌతమ్.. తల్లిదండ్రులదే తప్పు అంటూ!

గత ఏడాది అంబర్ పేటకు చెందిన ప్రదీప్ అనే నాలుగేళ్ల బాలుడు వీధి కుక్కల దాడిలో మరణించిన సంగతి మర్చిపోక ముందు.. ఇప్పుడు ఐదు నెలల బాలుడు మృతి చెందాడు. ఈ ఘటనపై కుక్కలంటే విపరీతమైన ప్రేమ ఉండే.. యాంకర్ రష్మీ గౌతమ్ స్పందించింది

గత ఏడాది అంబర్ పేటకు చెందిన ప్రదీప్ అనే నాలుగేళ్ల బాలుడు వీధి కుక్కల దాడిలో మరణించిన సంగతి మర్చిపోక ముందు.. ఇప్పుడు ఐదు నెలల బాలుడు మృతి చెందాడు. ఈ ఘటనపై కుక్కలంటే విపరీతమైన ప్రేమ ఉండే.. యాంకర్ రష్మీ గౌతమ్ స్పందించింది

తాండూరు కుక్క దాడి ఘటనపై రష్మీ గౌతమ్.. తల్లిదండ్రులదే తప్పు అంటూ!

గత ఏడాది ఫిబ్రవరిలో అంబర్ పేటకు చెందిన ప్రదీప్ అనే నాలుగేళ్ల బాలుడు వీధి కుక్కల దాడిలో మరణించిన సంగతి విదితమే. ఈ ఘటనలు తర్వాత ఇలాంటి దాడులు పునరావృతం అవుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు పలు చర్యలు చేపడుతున్నప్పటికీ.. వీటి దాడులు ఆగలేదు. తాజాగా వికారాబాద్‌ జిల్లాలోని తాండూరు బసవేశ్వర నగర్‌లో మరో ఘటన చోటుచేసుకుంది. దత్త, లావణ్య దంపతుల ఐదు నెలల కుమారుడు కుక్కల దాడిలో మరణించింది. ఈ ఇద్దరు తాండూరులోని నాపరాతి పాలిష్ యూనిట్‌లో పనిచేస్తున్నారు. మంగళవారం ఉదయం ఇంట్లో బాలుడికి స్నానం చేయించి నిద్రపుచ్చింది.. తలుపులు వేయకుండా తన పనిలో పడిపోయింది లావణ్య.

అంతలోకి ఇంట్లోకి దూరిన కుక్క బాలుడ్ని నోట కరిచింది. దీంతో ఏడుపులు వినిపించాయి. తల్లి పరిగెత్తుకుంటూ వచ్చింది. అప్పటికే తీవ్రంగా కరవడంతో బాలుడు చనిపోయాడు. అంతే కాకుండా ఆ కుక్కను కొట్టి చంపేశారు దంపతులు. కాగా, బాలుడి తల్లి లావణ్య మాట్లాడుతూ.. యజమాని కుక్క వల్లే తమ కొడుకు చనిపోయాడని చెప్పింది. కానీ ఆ ఫ్యాక్టరీ యజమాని భార్య మాట్లాడుతూ.. అది మా కుక్క కాదని వీధి కుక్క అని చెప్పింది. అంతే కాదు లావణ్య నిర్లక్ష్యంగా ఉండడంతో బాబుని వీధి కుక్క చంపేసిందని తెలిపింది. ఇది ఇలా ఉంటే.. ఓ నెటిజన్ ఈ వార్తపై స్పందిస్తూ..‘ ఇప్పుడు ఆ కుక్కను చంపినందుకు చిన్నారి తల్లిదండ్రుల మీద కేసు పెట్టాలని రష్మి అంటుంది’ అంటూ ట్వీట్ చేశాడు.

ఇక అతడి ట్వీట్ పై జంతువులంటే ప్రేమ కనబరిచే యాంకర్ రష్మీ గౌతమ్ స్పందిస్తూ.. సుదీర్ఘమైన పోస్టు పెట్టింది. ‘ అవును, తల్లిదండ్రులు ఆ చిన్నారిని ఎందుకు పట్టించుకోకుండా వదిలేశారు. కుక్క దాడి చేస్తున్న సమయంలో తల్లిదండ్రులు నిద్రపోతున్నారా.. ? బాబు ఏడుపు వారికి వినిపించలేదా.. ? జంతువులపై ఈ చెత్త ప్రచారాన్ని ఆపండి. తెలివి తక్కువగా వ్యవహరించే పేరెంట్స్‌కు సంబంధించిన వెయ్యి వీడియోలను షేర్ చేయగలను. పిల్లల జీవితాలను రిస్క్‌లో పెట్టింది ఎవరు ? అదే జంతువుల విషయానికి వస్తే మాత్రం లాజిక్స్ అన్ని మర్చిపోతారు.

ఈ ప్రపంచాన్ని ఇబ్బందులకు గురి చేసి మీరు మాత్రం ప్రశాంతతను తిరిగి పొందాలనుకుంటే అది సాధ్యమయ్యే పనికాదు’ అని తెలిపింది. ఈ ట్వీట్ పై మరో నెటిజన్ స్పందిస్తూ.. ‘మీకు బుర్రలేదని అర్థమైంది.. ఇలా ఉంటున్నందుకు తప్పుగా అర్థం చేసుకోవద్దు ‘ అంటూ కామెంట్ చేయగా.. రష్మిక స్పందించింది. ‘నాకు బుర్రలేదు.. కానీ మీకు ఉంది కదా.. కనడమే కాదు. ఇలాంటి ఘటనలు జరగకుండా వాళ్లను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీదే. దయచేసి పెంపుడు జంతువులు ఉన్నవాళ్లు పిల్లల్ని అలా వదిలేయొద్దు’ అంటూ రియాక్ట్ అయ్యింది. ప్రస్తుతం దీనిపై ట్విట్టర్ వార్ జరుగుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి