iDreamPost
android-app
ios-app

బాలయ్యపై రామ్ పోతినేని పొగడ్తలు.. ఇది ప్రతి ఒక్కరి డ్రీమ్ అవ్వాలంటూ..!

  • Author singhj Published - 12:11 PM, Sun - 27 August 23
  • Author singhj Published - 12:11 PM, Sun - 27 August 23
బాలయ్యపై రామ్ పోతినేని పొగడ్తలు.. ఇది ప్రతి ఒక్కరి డ్రీమ్ అవ్వాలంటూ..!

టాలీవుడ్ యంగ్ హీరోల్లో రామ్ పోతినేని కాస్త వైవిధ్యమనే చెప్పాలి. సినిమా, సినిమాకు వైవిధ్యం చూపుతూ ఇటు యూత్​తో పాటు అటు మాస్ ఆడియెన్స్​లోనూ ఆయన తన ఫాలోయింగ్​ను పెంచుకుంటున్నారు. రామ్ నుంచి ఒక సినిమా వస్తోందంటే తప్పకుండా ఏదో ఒక కొత్తదనం, వైవిధ్యం ఉంటుందని ప్రేక్షకులు ఆశిస్తారు. అయితే ఈమధ్య మాత్రం ఆయన ఎక్కువగా మాస్ మసాలా కథలకే మొగ్గుచూపుతున్నారు. ఇప్పుడు ‘స్కంద’ రూపంలో మరో యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్​టైనర్​తో ఆడియెన్స్​ను పలకరించేందుకు ఈ ఎనర్జిటిక్ స్టార్ రెడీ అవుతున్నారు. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్నారు.

‘అఖండ’ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత బోయపాటి రూపొందిస్తున్న చిత్రం కావడం, రామ్​ను ఫుల్ మాస్ అవతార్​లో చూపించడంతో ‘స్కంద’పై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ మూవీ ప్రీ రిలీజ్​ ఫంక్షన్​ శనివారం రాత్రి హైదరాబాద్​లో జరిగింది. ఈ ఈవెంట్​కు నటసింహం నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ ప్రోగ్రామ్​లో బాలయ్య ఎప్పటిలాగే తెలుగులో శ్లోకాలు, హిందీలో పలు డైలాగులు, కవితలు చెబుతూ అందర్నీ అలరించారు. ఇక, రామ్ తన స్పీచ్​లో బాలయ్యను ఆకాశానికి ఎత్తేశారు. బాలకృష్ణ మూడు తరాలను ఆకట్టుకున్న నటుడని చెబుతూ.. ‘జైలర్’ తమిళ వెర్షన్ పాటను పాడి అలరించారు రామ్.

‘ఇక్కడ ఒక తరాన్ని అలరించడానికే చచ్చిపోతున్నాం. కానీ బాలయ్య మూడు తరాలను అలరిస్తూ వస్తున్నారు. ఒక నటుడికి ఇంతకంటే పెద్ద విజయం ఇంకేదీ ఉండదు. అవార్డులు, రివార్డుల కంటే ఇదే ప్రతి ఒక్క నటుడి డ్రీమ్ అవ్వాలి’ అని రామ్ చెప్పుకొచ్చారు. మాస్, క్లాస్​తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్, అమ్మాయిలు కూడా బాలయ్య అభిమానులు అయిపోతున్నారని.. ఇక, మా పరిస్థితి ఏంటని రామ్ ప్రశ్నించారు. దీనికి హిందీలో ఓ కవిత చెప్పి, రామ్​ను సరదాగా కొట్టడానికి వచ్చారు బాలయ్య. రామ్ స్పీచ్​తో పాటు బాలయ్య ఇచ్చిన రియాక్షన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom