iDreamPost

భార్య పాదాలు నొక్కుతూ పాన్ ఇండియా స్టార్! ఇది కదా దాంపత్యమంటే!

  • Published Mar 02, 2024 | 2:31 PMUpdated Mar 02, 2024 | 2:35 PM

టాలీవుడ్‌ మోస్ట్ లవ్లీ కపూల్స్ లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన కూడా ఒకరు. ఎంతో ముచ్చటగా అన్యోన్యంగా ఉన్న ఈ జంట నిత్యం సోషల్ మీడియాలో ఏదో రూపంలో ట్రెండ్ అవుతూ ఉంటారు. తాజాగా మరోసారి రామ్ చరణ్ తన సతిమణికి సేవ చేస్తూ దర్శనమిచ్చారు.

టాలీవుడ్‌ మోస్ట్ లవ్లీ కపూల్స్ లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన కూడా ఒకరు. ఎంతో ముచ్చటగా అన్యోన్యంగా ఉన్న ఈ జంట నిత్యం సోషల్ మీడియాలో ఏదో రూపంలో ట్రెండ్ అవుతూ ఉంటారు. తాజాగా మరోసారి రామ్ చరణ్ తన సతిమణికి సేవ చేస్తూ దర్శనమిచ్చారు.

  • Published Mar 02, 2024 | 2:31 PMUpdated Mar 02, 2024 | 2:35 PM
భార్య పాదాలు నొక్కుతూ పాన్ ఇండియా స్టార్! ఇది కదా దాంపత్యమంటే!

టాలీవుడ్‌ మోస్ట్ సెలబ్రిటీ కపుల్స్‌లో మెగా పవర్‌స్టార్ ‘రామ్ చరణ్- ఉపాసన ‘ దంపతులు ఎప్పుడు ముందు వరుసలో ఉంటారు. వీరిద్దరి మధ్య ఉండే లవ్, ఎపెక్షన్, అండర్‌స్టాండింగ్ చూడటానికి ఎంతో ముచ్చటగా ఉంటుంది.అలాగే వీరి దంపత్య జీవితానికి గుర్తుగా కూతురు క్లింకార పుట్టింది. అయితే తమ జీవితంలోకి కూతురు రాకతో ఈ జంట ఆ పాపను ఎంతో అల్లారు ముద్దుగా.. కంటికి రెప్పలా కాపపాడుకుంటున్నారు.కాగా, ఇప్పటికి వరకు క్లింకార ఫోటోలను కూడా ఎక్కడ రివిల్ చేయకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నా విషయం తెలిసిందే. అయితే.. ఎంతో అన్యోన్యంగా ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నా ఈ జంట నిత్యం ఏదో ఒక రకంగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంటారు. తాజాగా రామ్ చరణ్ తన సతిమణి ఉపాసన కాళ్లు పట్టుకుంటు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు.

ఎంతటి మగవాడు కానీ, పెళ్లయ్యాక తన భార్యకు సేవలు చెయ్యాల్సిందే. అది ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా, స్టార్ హీరో అయినా సేవ చేయడంలో సందేహమే లేదు. ఈ క్రమంలోనే ఇంటి పనుల నుంచి వంట పనులని, షాపింగ్ కు వెళ్తే బ్యాగులు మొయ్యడం, అవసరమైతే భార్యకు కాళ్లు నొక్కుతూ సేవ చెయ్యాల్సిందే. ఇప్పుడు ఇదే కోవలో మన గ్లోబుల్ స్టార్ రామ్ చరణ్ కూడా ఉన్నారు.ఈయన గతంలో చాలాసార్లు ఆయన సతిమణి ఉపాసనకు సహాయం చేస్తూ ఇంటి పనులు చేసిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఆయన ఓ వీడియోలో తన భార్య ఉపాసన కాళ్లు నొక్కుతూ కనిపించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అయితే ఈ వీడియోలో వారిద్దరూ విమానంలో ఉన్నట్లు కనిపించారు. కాగా, చరణ్ ఉపాసనలు అనంత్ అంబానీ పెళ్లి కోసం జామ్ నగర్ కు ప్రత్యేక విమానంలో పయనమైనట్లు తెలుస్తోంది. ఇక ఈ జర్నీలో అలసిపోయిన ఉపాసనకు పాదాలను పట్టుకుని నొక్కుతూ కాస్త రిలక్స్ అయ్యేలా చేస్తున్నారు చరణ్. అయితే ఈ వీడియోను చూసిన ఆయన ఫ్యాన్స్ ఎంతో గ్లోబల్ స్టార్ అయిన అయిన కూడ తన భార్యకు భర్తే కదా అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక క్యూట్ కపుల్స్ ను చూసి మురిసిపోయినా నెటిజన్స్ రామ్ చరణ్ ఎంత డౌన్ టు ఎర్త్ గా ఉంటాడు. తన భార్యకు ఎంత విలువ ఇస్తాడో చెప్పడానికి ఇదొక నిదర్శనం అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ వీడియో ఎవరు తీశారు? ఎలా బయటకు వచ్చిందన్నది మాత్రం తెలియడం లేదు.

 

ఇక రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో  ‘గేమ్ ఛేంజర్’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్ గా  నటిస్తోంది. కాగాచ దీనిని SVC బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా.. థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా, ఈ సినిమాలో   శ్రీకాంత్, సునిల్, అంజలి తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అలాగే ఈ సినిమా క్రిస్మస్ కానుకగా థియేటర్లలో విడుదలవుతుందని టాక్ వినిపిస్తోంది. మరి, తన భార్య ఉపాసనకు సేవ చేస్తు కనిపించిన రామ్ చరణ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి