iDreamPost

మార్కెట్లోకి ‘సలార్’ టీ-షర్ట్స్.. అందుబాటు ధరలోనే! ఇలా పొందండి..

  • Author Soma Sekhar Updated - 03:22 PM, Sun - 26 November 23

మార్కెట్లోకి సలార్ టీ-షర్ట్స్ వచ్చాయి. పైగా అవి అందుబాటు ధరలో ఉండటం గమనార్హం. మరి ఆ టీ-షర్ట్స్ ధర ఎంత? వాటిని ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మార్కెట్లోకి సలార్ టీ-షర్ట్స్ వచ్చాయి. పైగా అవి అందుబాటు ధరలో ఉండటం గమనార్హం. మరి ఆ టీ-షర్ట్స్ ధర ఎంత? వాటిని ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం.

  • Author Soma Sekhar Updated - 03:22 PM, Sun - 26 November 23
మార్కెట్లోకి ‘సలార్’ టీ-షర్ట్స్.. అందుబాటు ధరలోనే! ఇలా పొందండి..

సలార్.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటుగా ఎంతో మంది సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం. స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ మూవీని హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించాడు. దీంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. సలార్ ను స్టార్ ప్రొడక్షన్ కంపెనీ అయిన హోంబలే ఫిల్మ్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ఇక ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ డిసెంబర్ 22న క్రిస్మస్ పండగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే వరల్డ్ వైడ్ గా సలార్ రిలీజ్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. మరోవైపు డార్లింగ్ ఫ్యాన్స్ సలార్ హ్యాష్ టాగ్ ను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. దీంతో సలార్ ప్రమోషన్లు షురూ అయినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే మార్కెట్లోకి సలార్ టీ-షర్ట్స్ వచ్చాయి. పైగా అవి అందుబాటు ధరలో ఉండటం గమనార్హం. మరి ఆ టీ-షర్ట్స్ ధర ఎంత? వాటిని ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం.

సలార్.. ప్రభాస్ నటించిన ఈ భారీ యాక్షన్ చిత్రం వరల్డ్ వైడ్ గా డిసెంబర్ 22న అభిమానుల ముందుకు రాబోతోంది. దీంతో ప్రమోషన్స్ షురూ అయ్యాయి. అందులో భాగంగా త్వరలోనే ఓ భారీ ఈ వెంట్ ను ఏర్పాటు చేయనున్నారు హోంబలే నిర్మాణ సంస్థ వారు. అదీకాక దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ఈవెంట్స్ కు ప్లాన్ చేస్తున్నారు కూడా. వీటితో పాటుగా అన్ని భాషల మీడియాతో ప్రభాస్ డైరెక్ట్ గా ఇంట్రాక్ట్ అవ్వనున్నాడు. ఇదంతా కాసేపు పక్కన పెడితే.. ప్రస్తుతం మార్కెట్లో సలార్ టీ-షర్ట్స్ సందడి చేస్తున్నాయి. వీటిని ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా డార్లింగ్ అభిమానుల కోసం ఆన్ లైన్ లో విక్రయిస్తున్నారు. వీటిని హోంబలే వెర్సెస్ వెబ్ సైట్ లో కొనుగోలు చేయవచ్చు. హుడీ, హార్మ్ స్లీవ్స్, టీషర్ట్స్ అందుబాటులో ఉన్నాయి.

వీటి ధరల విషయానికి వస్తే.. రూ. 499 నుంచి స్టార్ట్ అయ్యి రూ. 1499 వరకూ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక సలార్ తో పాటుగా బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నటించిన ‘డుంకీ’ సినిమా కూడా అదే రోజు రిలీజ్ అవుతుండటంతో.. బాక్సాఫీస్ హీరోగా ఎవరు నిలుస్తారో అని అభిమానులు ఇప్పటి నుంచే ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే సలార్ ప్రమోషన్స్ ను సరికొత్తగా ప్లాన్ చేయాలని భావిస్తున్నారు హోంబలే నిర్మాణ సంస్థ వారు. మరింకెందుకు ఆలస్యం మీ అభిమాన హీరో టీ-షర్ట్స్ ను ఇప్పుడే బుక్ చేసుకొండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి