iDreamPost

గ్రామీ అవార్డుకు నామినేటైన మోడీ పాట.. ఈ సాంగ్​ స్పెషాలిటీ ఇదే..!

  • Author singhj Updated - 11:43 AM, Sat - 11 November 23

ప్రధాని నరేంద్ర మోడీ పాట ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డుకు నామినేట్ అయింది. ఈ సాంగ్​కు మరే ఇతర పాటలకూ లేని ఒక స్పెషాలిటీ ఉంది.

ప్రధాని నరేంద్ర మోడీ పాట ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డుకు నామినేట్ అయింది. ఈ సాంగ్​కు మరే ఇతర పాటలకూ లేని ఒక స్పెషాలిటీ ఉంది.

  • Author singhj Updated - 11:43 AM, Sat - 11 November 23
గ్రామీ అవార్డుకు నామినేటైన మోడీ పాట.. ఈ సాంగ్​ స్పెషాలిటీ ఇదే..!

తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్​కు టైమ్ దగ్గర పడుతుండటంతో ప్రధాన పొలిటికల్ పార్టీలన్నీ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. బీఆర్ఎస్​తో పాటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రచారంలో మునిగిపోయాయి. ఈ నేపథ్యంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణలో ఎలక్షన్ క్యాంపెయిన్ నిర్వహించేందుకు శనివారం పర్యటించనున్నారు. పరేడ్ గ్రౌండ్స్​లో జరిగే భారతీయ జనతా పార్టీ బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. విజిట్​లో భాగంగా మోడీ సాయంత్రం 4.45 గంటలకు బేగంపేట ఎయిర్​పోర్టుకు చేరుకోనున్నారు. అనంతరం 5.40 గంటలకు పరేడ్ గ్రౌండ్స్​లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సభలో ప్రధాని కీలక ప్రకటన చేస్తారని బీజేపీ నేతలు భావిస్తున్నారు. సభ తర్వాత తిరిగి సాయంత్రం 6 గంటలకు బేగంపేట ఎయిర్​పోర్టు నుంచి ఢిల్లీకి పయనమవుతారు.

ఇక, వరల్డ్ వైడ్​గా 2023 ఏడాదిని ఇంటర్నేషనల్ మిల్లెట్స్ ఇయర్​గా జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మిల్లెట్స్ ఇంపార్టెన్స్, బెనిఫిట్స్​ను వివరిస్తూ రూపొందించిన ‘అబండెన్స్ ఇన్ మిల్లెట్స్’ సాంగ్​ను ప్రధాని నరేంద్ర మోడీ గత జూన్​లో రిలీజ్ చేశారు. మ్యూజిక్ ఇండస్ట్రీలో ప్రతిష్టాత్మకంగా భావించే గ్రామీ అవార్డును ఈ పాట దక్కించుకుంది. గ్రామీ పురస్కారాల్లో బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ పెర్ఫార్మెన్స్ కేటగిరీలో నామినేట్ అయింది. ఈ సాంగ్​ను ప్రముఖ ఇండో-అమెరికన్ సింగర్ ఫాల్గుణి షా (ఫాలూ) ఆమె భర్త గౌరవ్ షా సంయుక్తంగా రూపొందించారు. అయితే ఈ సాంగ్ లిరిక్స్​లో ప్రధాని మోడీ సహకారం అందించడం విశేషం. అంతేకాదు, తృణధాన్యాల గురించి పలు సందర్భాల్లో ఆయన చేసిన స్పీచ్​లను యథాతథంగా ఈ పాటకు జోడించారు.

‘అబండెన్స్ ఇన్ మిల్లెట్స్’ సాంగ్ హిందీ, ఇంగ్లిష్ భాషల్లో రిలీజైంది. ఈ సాంగ్​ను రూపొందించిన సింగర్ ఫాల్గుణి షా 2022లో గ్రామీ అవార్డు గెలుచుకోవడం గమనార్హం. ఈ సందర్భంగానే ఆమె ప్రధాని మోడీని కలిశారు. మనుషుల జీవితాల్లో మార్పు తీసుకొచ్చే బలమైన శక్తి మ్యూజిక్​కు ఉందని, అప్పుడే వరల్డ్​వైడ్​గా ఉన్న ఆకలి నిర్మూలన కోసం ఒక సాంగ్ రాయాలని ఫాల్గుణి షా దంపతులకు మోడీ సూచించారట. ఈ సాంగ్​లో ఆయన్ను కూడా భాగమవ్వాలని కోరగా పాజిటివ్​గా రియాక్ట్ అవడంతో పాట రూపుదిద్దుకుంది. మంచి చేయాలనే తపన, ప్రజల కోసం నిస్వార్థంగా పని చేసిన ఫలితంగానే ఈ పాట అవార్డుకు నామినేట్ అయిందిని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. ఆకలి నిర్మూలన కోసం ఇలాంటి సాంగ్​ గతంలో రాలేదని అదే స్పెషాలిటీ అని చెబుతున్నారు. మరి.. మోడీ సాంగ్​ గ్రామీ అవార్డుకు నామినేట్ అవ్వడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: బాణాసంచా కాల్చడంపై ఆంక్షలు.. ఆ సమయంలోనే కాల్చాలి: HYD పోలీసులు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి