iDreamPost

Pelli SandaD Report : పెళ్లి సందD రిపోర్ట్

Pelli SandaD Report : పెళ్లి సందD రిపోర్ట్

నిన్న అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో పోటీకి దిగిన శ్రీకాంత్ వారసుడు రోషన్ పెళ్లి సందడి మీద భారీ అంచనాలేమీ లేవు కానీ ఏదో పండగ పూట రాఘవేంద్రరావు గారు ఎంటర్ టైన్ చేస్తారన్న నమ్మకంతో జనం నిన్న థియేటర్లకు వెళ్లారు. ఎప్పుడో పాతికేళ్ల క్రితం వచ్చిన క్లాసిక్ బ్లాక్ బస్టర్ టైటిల్ పెట్టుకుని రావడంతో హైప్ అంతో ఇంతో వచ్చింది. శ్రీలీల హీరోయిన్ గా ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చగా క్యాస్టింగ్ తో పాటు ప్రొడక్షన్ ని కూడా భారీగా సెట్ చేసుకున్నారు. నిర్మలా కాన్వెంట్ మొదటి సినిమా అయినప్పటికీ దీన్నే రోషన్ డెబ్యూగా చెబుతూ వచ్చిన శ్రీకాంత్ ఆశలను ఈ మాడరన్ పెళ్లి సందడి నిలబెట్టిందో ఆవిరి చేసిందో రిపోర్ట్ లో చూద్దాం.

రిటైర్ అయిపోయి పిల్లలకు బాస్కెట్ బాల్ కోచింగ్ ఇస్తున్న వశిష్ట(రాఘవేంద్రరావు)కథను సినిమాగా తీయాలని వస్తాడో మనిషి(రాజేంద్రప్రసాద్). అక్కడ మొదలవుతుంది ఫ్లాష్ బ్యాక్. వశిష్ట ఓ పెళ్లిలో సహస్ర(శ్రీలీల)ని చూసి ఇష్టపడతాడు. జీవితంలో ప్రేమించి పెళ్లి చేసుకోవాలన్న లక్ష్యంతో ఉన్న అతగాడికి ఆ అమ్మాయిలో ఉన్న లక్షణాలు విపరీతంగా నచ్చేస్తాయి. ఇంకేముంది లైన్ వేసి పడగొట్టేసి రెండు మూడు పాటాలేసుకున్న తర్వాత సహస్ర మాయమవుతుంది. అఫ్కోర్స్ మళ్ళీ కనిపిస్తుంది లెండి. ఈ జంట ప్రయాణం పెళ్లికి ఎలా చేరుకుంది, ఎలాంటి అడ్డంకులు వచ్చాయి, వశిష్ఠ ప్రేమగెలుపు ఎలా జరిగిందనేది తెరమీదే చూసి ధరించాలి.

తరం మారింది. ఆలోచనలు మారాయి. అభిరుచుల్లో తేడాలు వచ్చేసాయి. అయినా కూడా 1996లో తీసిన ఫార్ములానే మళ్ళీ రిపీట్ చేస్తామంటే భరించేంత సహృదయం ఇప్పటి ప్రేక్షకులకు లేదు. బలవంతంగా నవ్వించాలని ఇరికించిన ఎపిసోడ్లు, ఎప్పుడో హం ఆప్కె హై కౌన్ టైంలో వచ్చిన స్క్రీన్ ప్లే, అవసరానికి మించిన నిడివి వెరసి ట్రైలర్ చూసి కూడా దీన్ని ఎక్కువ అంచనా వేసినందుకు మన మద మనకే జాలి కలిగేలా ఉంటుంది. నిడివి సైతం టీవీ సీరియల్స్ ని తలపిస్తుంది. కనీసం వాటికి మధ్యలో యాడ్స్ వస్తాయి. ఇక్కడ ఆ అదృష్టం కూడా లేదు. ఇంత రణగొణ ధ్వనిలోనూ కీరవాణి పాటలు కొంత రిలీఫ్. సత్తెకాలంలో వచ్చిన బ్లాక్ బస్టర్ల పేర్లను కాన్సెప్ట్ లను చెడగొట్టకుండా న్యూ జెనెరేషన్ దర్శకులు దూరంగా ఉండటం మంచిది. క్లారిటీ కోసం ఈ సినిమా చూడొచ్చు.

Also Read : Ram Charan : రామ్ చరణ్ మాస్ లైనప్.. మరో ప్యాన్ ఇండియా హీరో ఇన్ మేకింగ్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి