iDreamPost

హీరోకి వింత రోగం.. తన చెయ్యి తన మాట వినకుండా.. OTTలో బెస్ట్ కామెడీ థ్రిల్లర్!

OTT Suggestions- Best Comedy Action Drama: మీకు డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీలు చూడాలి అని ఉంటే మాత్రం.. తప్పకుండా ఈ మూవీ చూసేయండి. ఇది మామూలుగా ఉండదు. ఈ తరహా మీరు తెలుగులో చూసే ఉంటారు. కానీ, అంతకు పదిరెట్లు ఎగ్జైట్ అవుతారు.

OTT Suggestions- Best Comedy Action Drama: మీకు డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీలు చూడాలి అని ఉంటే మాత్రం.. తప్పకుండా ఈ మూవీ చూసేయండి. ఇది మామూలుగా ఉండదు. ఈ తరహా మీరు తెలుగులో చూసే ఉంటారు. కానీ, అంతకు పదిరెట్లు ఎగ్జైట్ అవుతారు.

హీరోకి వింత రోగం.. తన చెయ్యి తన మాట వినకుండా.. OTTలో బెస్ట్ కామెడీ థ్రిల్లర్!

ఇండియన్ సినిమాలో ఇప్పటి వరకు చాలానే వింత వింత కథలతో సినిమాలు వచ్చాయి. అలాంటి కోవకు చెందిందే ఈ మూవీ కూడా. ఈ సినిమా చూస్తున్నంతసేపు పడి పడి నవ్వుకుంటారు. ఇది వింత కథ ఎందుకు అవుతుంది అంటే? ఇందులో హీరోకి ఒక వింత రోగం ఉంటుంది. అదేంటంటే.. ఆయన ఎడమ చేయి ఆయన ప్రమేయం లేకుండానే పని చేస్తూ ఉంటుంది. అంటే ఆ చెయ్యి దానికి అదే నిర్ణయాలు తీసుకుంటుంది. దానికి అదే ఆలోచిస్తుంది. దానికి నచ్చింది చేస్తుంది. అలాంటి చేయితో ఈ హీరో ఎన్ని కష్టాలు పడ్డాడు అనేదే అసలు కథ. ఇలాంటి కథని మీరు తెలుగులో కూడా చూశారు. కానీ, ఇది అంతకు మించే ఉంటుంది.

మీకు ఈ కథ వినగానే కచ్చితంగా వెంటనే నాగచైతన్య చేసిన సవ్యసాచి సినిమా గుర్తొస్తుంది. ఆ మూవీలో ఈ మూవీలో ఒకే ఒక పోలిక ఉంది. అదేంటంటే.. హీరో చేయి దానంతట అదే ప్రవర్తిస్తూ ఉండటం. అందులో అయితే హీరో మంచి క్యారెక్టర్ కలిగి ఉన్నవాడే. ఈ మూవీలో మాత్రం హీరోని దొంగగా చూపించారు. అతని ఎడమ చేయి.. దాని కుడి చేతికి కూడా తెలియకుండా సునాయాసంగా పర్సులు కొట్టేస్తూ ఉంటుంది. అలా తనకు ఉన్న అరుదైన వ్యాధి సాయంతో అతను గొప్ప స్థాయికి వెళ్లాలి అనుకుంటాడు. కానీ, అతని ఎడమ చేయి మాత్రం మరోలా ఆలోచిస్తుంది. ఇంకేముంది మన హీరో పరిస్థితి రోట్లో పడ్డ కొబ్బరిలా అవుతుంది. పిండి పిండి పిప్పి పిప్పి చేసేస్తారు.

Peechakku

అలాంటి పరిస్థితి రావడానికి ఏంటి కారణం? ఎందుకు అతనికి అసలు ఆ ఏలియన్ హ్యాండ్ సిండ్రోమ్ అనే వ్యాధి వచ్చింది. అసలు అతని ఎడమ చేయికి ఏదైనా లక్ష్యం ఉందా? అలాంటి వ్యాధి రావడం అతనికి వరమా? శాపమా? అనే విషయాలు తెలియాలి అంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే. అయితే ఈ మూవీలో హిలేరియస్ కామెడీ ఉంటుంది. మీరు నవ్వి నవ్వి చక్కరొచ్చి కింద పడిపోతారు కూడా. ఎందుకంటే ఆ ఎడమ చేయి వల్ల అంత కామెడీ జనరేట్ అవుతుంది. హీరోని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టేస్తుంది. ఇంక ఈ సినిమా పేరు పీచాంకై. ఇది తమిళ్ మూవీ. ఇది ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో స్ట్రీమ్ అవుతోంది. భాష రాదు అని లైట్ తీసుకోకండి.. సీన్స్ తోనే పక పక నవ్వేస్తారు. సవ్యసాచిలో అంతా సీరియస్ నోట్ లోనే కథ వెళ్తూ ఉంటుంది. కానీ, ఈ మూవీలో అంతా కామెడీ యాంగిల్ లోనే కథ ఉంటుంది. మీకు ఈ మూవీ కచ్చితంగా నచ్చేస్తుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి