iDreamPost

OTT Best Suspense Thriller : OTT లో బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్.. కన్న కూతురిని చంపాలనుకునే పేరెంట్స్!

  • Published Jun 10, 2024 | 1:42 PMUpdated Jun 10, 2024 | 1:42 PM

OTT Movie Suggestion: కొన్ని సినిమాలు చూడడానికి కన్ఫ్యూజన్ గా అనిపించినా కూడా.. ఒక్క సీన్ కూడా మిస్ కాకుండా చూస్తే మాత్రం ఆ సినిమాలు అద్భుతంగా ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా అలాంటిదే. మరి ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

OTT Movie Suggestion: కొన్ని సినిమాలు చూడడానికి కన్ఫ్యూజన్ గా అనిపించినా కూడా.. ఒక్క సీన్ కూడా మిస్ కాకుండా చూస్తే మాత్రం ఆ సినిమాలు అద్భుతంగా ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా అలాంటిదే. మరి ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

  • Published Jun 10, 2024 | 1:42 PMUpdated Jun 10, 2024 | 1:42 PM
OTT Best Suspense Thriller : OTT లో బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్.. కన్న కూతురిని చంపాలనుకునే పేరెంట్స్!

ఇప్పటివరకు ఎన్నో సినిమాలు చూసి ఉంటారు. ఒక్కో సినిమా ఒక్కో విధంగా ఉంటుంది. కొన్ని సినిమాలు సేమ్ ప్లాట్ అయినా సరే.. దర్శకుడు కథను ముందుకు తీసుకుని వెళ్లే విధానం మాత్రం చూసేవారికి ఇంట్రెస్ట్ తెప్పిస్తుంది. ఇక కొన్ని సినిమాలు చూడడానికి కన్ఫ్యూజన్ గా అనిపించినా కూడా.. ఒక్క సీన్ కూడా మిస్ కాకుండా చూస్తే మాత్రం ఆ సినిమాలు అద్భుతంగా ఉంటాయి. ఇప్పుడు ఓటీటీ లో ఇంట్రెస్టింగ్ సినిమాలు ఏం ఉన్నాయా అని సెర్చ్ చేసే ప్రేక్షకులకు ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా ఓ మంచి సజ్జెషన్ అని చెప్పి తీరాలి. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

ఈ సినిమాలో ఓ తండ్రి , కూతురు కలిసి ఓ అడవిలో వేటకు వెళ్తారు. ఆ అడివిలో జింకలను చూస్తూ ఎంజాయ్ చేస్తున్న తన కూతురి తలకు గన్ తో గురి పెడతాడు ఆ తండ్రి. కట్ చేస్తే స్టోరీ ఇరవై ఏళ్ళ తర్వాత చూపిస్తారు. థెల్మా అనే అమ్మాయి తన ఊరికి దూరంగా ఒక హాస్టల్‌లో ఉంటూ కాలేజ్‌లో చదువుతుంటుంది. ఆమె ఎక్కువగా ఎవరితోనూ కలవదు. ఓ రోజు సడెన్ గా ఆమె క్లాస్ లో ఫైట్స్ వచ్చి పడిపోతుంది. కనీసం ఆమె దగ్గరకు ఎవరు రారు. కాలేజ్ మ్యానేజ్మెంట్ ఏ ఆమెను హాస్పిటల్ లో జాయిన్ చేస్తుంది. ఆ నెక్స్ట్ డే తన క్లాస్మేట్ అంజ థెల్మాను చూడడానికి వస్తుంది. అప్పటివరకు ఆమెతో ఎవరు మాట్లాడకపోవడంతో… ఒక్కసారిగా అంజ వచ్చి పలకరించడంతో థెల్మా ఆమెపై ఇష్టం పెంచుకుంటుంది.

Thelma

మెల్లగా వాళ్లిద్దరూ ఫ్రెండ్స్ అవుతారు.. ఈ ప్రాసెస్ లో వాళ్లిద్దరూ ఓ ఇంటిమేట్ కూడా అవుతారు. ఓ రోజు తన ఫ్రెండ్స్ పార్టీకి థెల్మాను తీసుకెళ్తుంది అంజ. అక్కడ తనకు చెప్పకుండా.. గంజాయిని ఇస్తుంది అంజ. దీనితో థెల్మా స్పృహ తప్పిపోతుంది. అప్పటినుంచి నోట్లోకి పాము వెళ్తున్నట్టు అలా వింతగా ఊహించుకుంటుంది. వెంటనే డాక్టరు దగ్గరకు వెళ్తుంది. అక్కడ.. థెల్మాకు తెలియకుండా తన తల్లిదండ్రులు తనకు చిన్నప్పటి నుంచి ఏదో టాబ్లెట్ ఇస్తున్నారని తెలుస్తుంది. దీని గురించి తెలుసుకోవడం కోసం ఆ డాక్టర్ మరిన్ని టెస్టులు చేస్తుంది.

ఆ నెక్స్ట్ డే డాక్టరు ఇంకోడాక్టర్‌ను కలవగా థెల్మాకు సూపర్ పవర్స్ ఉన్నాయని, ఇలాంటి వారిని మంత్రగత్తెలు అంటారనే విషయం బయటపడుతుంది. అలాగే తమకు దగ్గర్లో ఉన్న హాస్పిటల్‌లో ఆమె బామ్మ అడ్మిట్ అయ్యి ఉందని ఆ డాక్టర్ అంటారు. కానీ తనకు ఒక బామ్మ ఉందనే విషయం కూడా థెల్మాకు తెలియదు. థెల్మా వెళ్లి తన బామ్మను కలుసుకునేలోపే ఆమె చనిపోతుంది. దీనితో అప్పటినుంచి తన వల్ల తన చుట్టూ ఉండేవారికి ప్రమాదాలు జరుగుతున్నాయని థెల్మా తెలుసుకుంటుంది.. తన ఇంటికి వెళ్లిపోతుంది. కానీ అక్కడ తల్లిదండ్రులే ఆమెను చంపడానికి ప్లాన్ చేస్తారు. అసలు థెల్మా చిన్నతనంలో అసలు ఏం జరిగింది? తన సొంత తల్లిదండ్రులే తనను ఎందుకు చంపాలనుకుంటున్నారు? ఈ స్టోరీ ఏంటి ! తర్వాత ఏం జరిగింది ! ఇవన్నీ తెలియాలంటే “థెల్మా” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి