iDreamPost

బ్యాచిలర్ పార్టీ పేరుతో అమ్మాయిలు చేసిన రచ్చ.. OTT లో ఈ మూవీ పీక్స్ !

  • Published Jun 18, 2024 | 4:22 PMUpdated Jun 18, 2024 | 4:22 PM

OTT Best Youthfull Entertainer : ఓటీటీ కొన్ని సినిమాలు చూడడానికి భలే ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి సినిమాను ఇన్ని రోజులు ఎలా మిస్ చేశాం అనే ఫీలింగ్ ఖచ్చితంగా కలుగుతుంది. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా ఇలానే ఉంటుంది.

OTT Best Youthfull Entertainer : ఓటీటీ కొన్ని సినిమాలు చూడడానికి భలే ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి సినిమాను ఇన్ని రోజులు ఎలా మిస్ చేశాం అనే ఫీలింగ్ ఖచ్చితంగా కలుగుతుంది. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా ఇలానే ఉంటుంది.

  • Published Jun 18, 2024 | 4:22 PMUpdated Jun 18, 2024 | 4:22 PM
బ్యాచిలర్ పార్టీ  పేరుతో అమ్మాయిలు చేసిన రచ్చ.. OTT లో ఈ మూవీ పీక్స్ !

హర్రర్, ఇన్వెస్టిగేషన్ సినిమాలంటే కొంతమంది మాత్రమే చూస్తారు. కానీ కామెడీ , రొ*మాంటిక్ చిత్రాలైతే యూత్ అంతా చూస్తారు. పర్టిక్యులర్ గా యూత్ ను మాత్రమే టార్గెట్ చేసేలా .. ఓటీటీ లో కొన్ని సినిమాలు ఉన్నాయి. ఇలాంటి సినిమాలు అన్ని కూడా చూడడానికి భలే ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తూ ఉంటాయి. ఈ సినిమాలు చూస్తే.. ఇలాంటి సినిమాలు ఇన్ని రోజులు ఎలా మిస్ చేశాం అనే ఫీలింగ్ ఖచ్చితంగా కలుగుతుంది. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా ఈ కోవకు చెందిందే. మరి ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.

ఇప్పటి వరకు పెళ్ళికి ముందు అబ్బాయిలు బ్యాచిలర్ పార్టీ చేసుకుంటే ఎలా ఉంటుందో చూసే ఉంటారు. అదే అమ్మాయిలు బ్యాచిలర్ పార్టీ చేసుకుంటే ఎలా ఉంటుంది అనేదే ఈ సినిమా కాన్సెప్ట్.. ఈ సినిమా పేరు “పెళ్లి కూతురు పార్టీ”. ఈ సినిమాను లేడి డైరెక్టర్ మల్లాది అపర్ణ డైరెక్ట్ చేశారు. ఇక ఈ సినిమాలో యాక్టర్ ప్రిన్స్, అర్జున్ కళ్యాణ్, అనీషా ధామా, సీత, జయత్రీ, సాయికీర్తన్, ఫణి, అన్నపూర్ణమ్మ ముఖ్య పాత్రలలో కనిపించారు. ఈ సినిమా కాన్సెప్ట్ ఏ డిఫరెంట్ గా ఉంటుంది అనుకుంటే.. ఈ సినిమా కథ కూడా ఇంకాస్త డిఫ్ఫరెంట్ గా ఉంటుంది. ఈ సినిమా కథేంటంటే నందిని అనే అమ్మాయి.. క్రిష్ అనే అతనిని అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటుంది. కానీ సరిగ్గా పెళ్లి చూపుల సమయంలో నందిని చెల్లి రాణి క్రిష్ ను కిస్ చేస్తుంది. దీనితో అది తప్పని తెలుసుకుని.. ఎలా అయితే ఆ పెళ్లి క్యాన్సిల్ చేసి.. అక్కకు ఇంకొక పెళ్ళికొడుకుని వెతికి పెళ్లి చేయాలనీ అనుకుంటుంది.

Pellikuturu party

ఈ క్రమంలో వాళ్లంతా బ్యాచిలర్ పార్టీ ని చేసుకోవాలని ప్లాన్ చేస్తారు. దానికోసం అందరూ కలిసి ట్రిప్ కు వెళ్దాం అనుకుని.. వాళ్ళ పేరెంట్స్ ని అడుగుతారు. ఇక ఇంట్లో వాళ్ళు ట్రిప్ అంటే తిరుపతి వెళ్లి రమ్మని.. అది కూడా వాళ్ళ బామ్మను వెంటపెట్టుకుని వెళ్ళమని చెప్తారు. కానీ రాణి ప్లాన్ అంత రివర్స్ చేసి.. అందరిని హైదరాబాద్ తీసుకెళ్తుంది. అక్కడ తన అక్కకు ఓ మంచి కుర్రాడిని వెతకాలి డిసైడ్ అవుతుంది. తిరుపతికి వెళ్లాల్సిన వాళ్ళు హైదరాబాద్ కు వచ్చే క్రమంలో వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి ! ఇంతకీ రాణి తన అక్కకు అబ్బాయిని వెతికిందా లేదా ! తన అక్కను పెళ్లి చేసుకోవాలని అనుకున్న వ్యక్తిని రాణి ప్రేమలో పడుతుందా ! ఈ అమ్మాయిలంతా కలిసి చేసిన అల్లర్లు ఏంటి ! చివరికి కథ ఎలా ముగిసింది ! ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం ఆహ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి