iDreamPost

OTT Movie Suggestion: కళ్ళు లేని హీరోయిన్ పై దారుణం! కళ్ళు లేని హీరో పగ! ఇది కదా సినిమా అంటే!

  • Published Jun 01, 2024 | 6:48 PMUpdated Jun 01, 2024 | 6:48 PM

ప్రస్తుతం కొత్త సినిమాలు ఎన్ని వస్తున్నా కానీ ఇంకా ఎమన్నా మంచి కంటెంట్ ఓటీటీ లో ఉందేమో అని ప్రేక్షకులు సెర్చ్ చేస్తూ ఉన్నారు. వారి కోసమే ఈ మూవీ సజ్జెషన్. మరి ఈ మూవీ మీ వాచ్ లిస్ట్ లో ఉందో లేదో చూసేయండి.

ప్రస్తుతం కొత్త సినిమాలు ఎన్ని వస్తున్నా కానీ ఇంకా ఎమన్నా మంచి కంటెంట్ ఓటీటీ లో ఉందేమో అని ప్రేక్షకులు సెర్చ్ చేస్తూ ఉన్నారు. వారి కోసమే ఈ మూవీ సజ్జెషన్. మరి ఈ మూవీ మీ వాచ్ లిస్ట్ లో ఉందో లేదో చూసేయండి.

  • Published Jun 01, 2024 | 6:48 PMUpdated Jun 01, 2024 | 6:48 PM
OTT Movie Suggestion: కళ్ళు లేని హీరోయిన్ పై దారుణం! కళ్ళు లేని హీరో పగ! ఇది కదా సినిమా అంటే!

హర్రర్, సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాలను పక్కన పెట్టేస్తే.. ప్రేమ కథలకు కూడా సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటారు. ఇక దర్శకులు ప్రేమ కథలను చూపించే తీరు.. ఒక్కో సినిమాలో ఒక్కో రకంగా ఉంటుంది. కొన్ని సినిమాలలో అందరిని ఎదిరించి ఆ ప్రేమ గెలిస్తే.. కొన్ని సినిమాలలో మాత్రం ప్రేమను ఓడించి విధి గెలుస్తుంది. అన్ని సినిమాలో కాన్సెప్ట్ ఒకటే అయినా కానీ రకరాల కథలు ఉంటాయి కాబట్టి ప్రేక్షకులు ఈ జోనర్ లో ఎన్ని సినిమాలు వచ్చినా కానీ.. రెప్పార్పకుండా చూస్తూ ఉంటారు. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా అలాంటిదే. ఇది ఒక రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ జోనర్ కు చెందిన సినిమా. మరి ఈ సినిమా ఏంటో ఇప్పుడు ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

ఈ సినిమాలో హీరో ఓ డబ్బింగ్ ఆర్టిస్ట్.. అతను ఓ అంధుడు అయినా కూడా ఎప్పుడు యాక్టివ్ గానే ఉంటాడు. హీరోయిన్ పియానో వాయించే ఓ కళాకారిణి. ఆమె కూడా అంధురాలే. కాఫీ షాప్ లో ఏర్పడిన ఓ చిన్న పరిచయం .. వారిద్దరి మధ్య ప్రేమకు దారితీస్తుంది. దీనితో చూపు లేని ఆ ఇద్దరు జీవితాంతం కలిసి బ్రతకాలని నిర్ణయం తీసుకుంటారు. వారిద్దరూ పెళ్లి చేసుకుని సంతోషంగా వారి జీవితాన్ని కొనసాగిస్తున్న సమయంలో.. విధి వారిని చిన్న చూపు చూస్తుంది. వాసిం, అమిత్ అనే ఇద్దరు అంధురాలైన హీరొయిన్ పై అత్యాచారానికి పాల్పడతారు. దీనితో ఒక్కసారిగా వారి జీవితంలో చీకటి అలుముకుంటుంది. తన భార్యను అత్యాచారం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని హీరో పోలీసులను ఆశ్రయిస్తాడు.

Kaabil

కానీ ఆ పోలీస్ ఆఫీసర్ అమిత్ తమ్ముడే కావడంతో.. ఈ కేసును సీరియస్ గా తీసుకోకపోగా … ఇన్వెస్టిగేషన్ , ఇంట్రాగేషన్ పేరుతో ఈ హీరోయిన్ ను ఇంకాస్త వేధింపులకు గురి చేస్తారు. దీనితో ఆమె తన భర్తకు చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. దీనితో హీరో చట్టాన్ని తన చేతిలోకి తీసుకుని దోషులను కఠినంగా శిక్షించాలను అనుకుంటాడు. అంధుడైన అతడు చట్టాన్ని ఎలా ఎదుర్కున్నాడు? దోషులను శిక్షించాడా లేదా ? తన భార్య ఎక్కడికి వెళ్లిందో తెలుసుకున్నాడా లేదా? చివరికి ఈ కథ ఎలా ముగిసింది ? ఇవన్నీ తెలియాలంటే “కాబిల్” అనే ఈ సినిమాను చూడాల్సిందే.

ఈ సినిమాలో చూపులేని వారీగా నటించి ప్రేక్షకులను మెప్పించిన హీరో హీరోయిన్స్ ఎవరో కాదు. హృతిక్ రోషన్ , యామి గౌతమ్ .ఈ సినిమా ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది. పైగా తెలుగులో కూడా ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. రెగ్యులర్ సినిమాలు చూసి బోర్ కొట్టి .. ఓ మంచి రెఫ్రెషింగ్ సినిమా చూడాలంటే మాత్రం ఈ సినిమా బెస్ట్ ఛాయస్ . ఇప్పటివరకు ఈ సినిమాను ఇప్పటివరకు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి