iDreamPost
android-app
ios-app

వీడియో: అమెరికన్‌ ప్రేక్షకులకు థ్యాంక్స్‌ చెప్పిన నాగ్‌ అశ్విన్‌..ఎందుకంటే?

  • Published Jul 01, 2024 | 4:47 PM Updated Updated Jul 01, 2024 | 4:47 PM

Nag Ashwin: ప్రస్తుతం ‘కల్కి 2898 AD’ మూవీ దేశం వ్యాప్తంగా ప్రభజనం సృష్టిస్తోంది. బాక్సాపీస్ వద్ద భారీ కలెక్షన్స్ తో కల్కి దూసుకెళ్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా కల్కి మూవీ డైరెక్టర్ నాగ్ అశ్వీన్ ఓ స్పెషల్ వీడియోను పోస్టు చేశారు.

Nag Ashwin: ప్రస్తుతం ‘కల్కి 2898 AD’ మూవీ దేశం వ్యాప్తంగా ప్రభజనం సృష్టిస్తోంది. బాక్సాపీస్ వద్ద భారీ కలెక్షన్స్ తో కల్కి దూసుకెళ్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా కల్కి మూవీ డైరెక్టర్ నాగ్ అశ్వీన్ ఓ స్పెషల్ వీడియోను పోస్టు చేశారు.

  • Published Jul 01, 2024 | 4:47 PMUpdated Jul 01, 2024 | 4:47 PM
వీడియో: అమెరికన్‌ ప్రేక్షకులకు థ్యాంక్స్‌ చెప్పిన నాగ్‌ అశ్విన్‌..ఎందుకంటే?

ప్రస్తుతం ప్రపంచం వ్యాప్తంగా ఎక్కడ చూసిన కల్కి మేనియానే కనిపిస్తోంది. కల్కి 2898ఏడీ  బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఓ రేంజ్ లో ఆకట్టుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా పలు రికార్డులను సృష్టించింది. హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కిన ఈ సినిమా వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తోంది. ఇక ప్రభాస్, నాగ్ అశ్వీన్ల కెరీర్లలో కల్కి బ్లాక్ బాస్టర్ గా నిలవనుంది. ఇప్పటికే ఈ సినిమా గురించి పలువురు స్పందిస్తుండటగా..తాజాగా కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఓ వీడియో విడుదల చేశారు. అమెరికన్ ఆడియన్స్ కు కృతజ్ఞతలు తెలిపాడు. మరి.. అమెరికన్స్ నాగ్ అశ్విన్ ఎందుకు థ్యాంక్స్ చెప్పారు, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

ప్రస్తుతం ‘కల్కి 2898 AD’ మూవీ దేశం వ్యాప్తంగా ప్రభజనం సృష్టిస్తోంది. బాక్సాపీస్ వద్ద భారీ కలెక్షన్స్ తో కల్కి దూసుకెళ్తోన్న విషయం తెలిసిందే. దీంతో అందరీ కళ్లు దర్శకుడు నాగ్ అశ్విన్ మీదే ఉన్నాయి. వీఎఫ్​ఎక్స్, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, యాక్టింగ్ కంటే కూడా పురాణ పాత్రలను తీసుకొని నాగీ కథ అల్లుకున్న తీరు, వాళ్లను చూపించిన విధానానికి అంతా ఆశ్చర్యపోతున్నారు. కృష్ణుడు, కర్ణుడు, అర్జునుడు క్యారెక్టర్స్​ను ఆయన మలిచిన తీరుకు వహ్వా అంటున్నారు. అలాగే ఈ సినిమాతో తెలుగు సినిమా మరో లెవల్ కు వెళ్లిందనే చెప్పవచ్చు. ఈ సినిమాకు నార్త్ అమెరికాలు భారీగా స్థాయిలో రెస్పాన్స్  వస్తుంది. అమెరికన్ ఆడియన్స్ కల్కి మూవీకి బ్రహ్మరథం పడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా నాగ్ అశ్విన్ ఓ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. అమెరికన్‌ ఆడియన్స్‌కు డైరెక్టర్ నాగ్ అశ్విన్ కృతజ్ఞతలు  తెలిపారు. సినిమాను చాలా పెద్ద స్థాయిలో ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపుతూ ఓ ప్రత్యేక వీడియోని రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తమ నుంచి వచ్చే ప్రతి సినిమాకు అమెరికన్ ప్రేక్షకులు ఎప్పుడు చాలా మద్దతుగా నిలుస్తూ వస్తున్నారని అన్నాడు. మంచి సినిమాకు అమెరికన్ ఆడియన్స్ ఎప్పుడు అండగా ఉంటారని తెలిపాడు. అందరికంటే ముందుగా ‘కల్కి’ని అమెరికన్స్ ఆదరించారని, వారి సొంత చిత్రంగా భావించి మద్దతు ఇస్తున్నారని నాగ్ అశ్విన్ అన్నారు. ఇంకా నాగ్ అశ్వీన్ మాట్లాడుతూ.. మీ ఫ్రెండ్స్,రిలేటివ్స్ ని కూడా కల్కి ప్రపంచానికి తీసుకెళ్లండంటూ అమెరికన్స్ ను రిక్వెస్ట్ చేస్తున్నాడు.  కల్కి లాంటి సినిమాలు చాలా అంటే చాలా అరుదుగా వస్తుంటాయని, వాటిని థియేటర్స్ లో బిగ్‌స్క్రీన్‌పై చూస్తే వచ్చే ఆ సంతోషం లైఫ్ లో ఎప్పటికీ గుర్తుంటుందని చెప్పుకొచ్చాడు. ఇప్పటికే థియేటర్లో చూసినవాళ్లు ఈ అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్‌ చేసుంటారని, థ్యాంక్యూ అమెరికా..త్వరలో మళ్ళీ కలుద్దామంటూ డైరెక్టర్ నాగ్‌ అశ్విన్‌ స్పెషల్ థ్యాంక్స్‌ చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş