iDreamPost

OTT Suggestion: OTT లో ఫుల్ లెన్త్ యాక్షన్ కామెడీ మూవీ.. ఆ సీన్స్ ఊహించి ఉండరు!

  • Published Jul 01, 2024 | 5:43 PMUpdated Jul 01, 2024 | 5:43 PM

OTT Best Comedy Action Thriller : కొంతకాలం అందరూ హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ని మాత్రమే బాగా చూశారు. ఇక ఇప్పుడు మళ్ళీ అందరు ఆ సినిమాలతో పాటు కామెడీ సినిమాలను కూడా బాగా ఆదరిస్తున్నారు. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా ఇలాంటి ఓ యాక్షన్ కామెడీ చిత్రమే.

OTT Best Comedy Action Thriller : కొంతకాలం అందరూ హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ని మాత్రమే బాగా చూశారు. ఇక ఇప్పుడు మళ్ళీ అందరు ఆ సినిమాలతో పాటు కామెడీ సినిమాలను కూడా బాగా ఆదరిస్తున్నారు. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా ఇలాంటి ఓ యాక్షన్ కామెడీ చిత్రమే.

  • Published Jul 01, 2024 | 5:43 PMUpdated Jul 01, 2024 | 5:43 PM
OTT Suggestion: OTT లో ఫుల్ లెన్త్ యాక్షన్ కామెడీ మూవీ.. ఆ సీన్స్  ఊహించి ఉండరు!

వారం వారం ఓటీలలో చాలానే సినిమాలు రిలీజ్ అవుతూ ఉన్నాయి. కానీ వాటిలో చూడదగిన సినిమాలు మాత్రం కొన్నే ఉంటున్నాయి. ఈ సినిమాలు మిస్ చేయకుండా చూడండి.. ఈ వారం చూడాల్సిన సినిమాలు ఇవే అంటూ.. ప్రతి వారం కొన్ని మూవీ సజ్జెషన్స్ కూడా వస్తూ ఉన్నాయి. ఇక వాటిని మాత్రమే చూసే ప్రేక్షకులు..కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలను మిస్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా ఈ మద్య కాలంలో ఓటీటీ లోకి వచ్చిన సినిమా గురించే. మరి ఈ సినిమాను కానీ మీరు చేశారేమో.. ఓ లుక్ వేసేయండి. కొంతకాలం అందరూ హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ని మాత్రమే బాగా చూశారు. ఇక ఇప్పుడు మళ్ళీ అందరు ఆ సినిమాలతో పాటు కామెడీ సినిమాలను కూడా బాగా ఆదరిస్తున్నారు. మరీ ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేయండి.

ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా ఓ హాలీవుడ్ మూవీ.. ఈ సినిమాలో జాన్ సేనా హీరోగా నటించారు. ఇదొక యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్.. ఇక ఈ మూవీకి.. పియర్ మోరెల్ దర్సకత్వం వహించారు. ఇక ఈ సినిమా హాలీవుడ్ మేకర్స్ రూపొందించినదే అయినా కానీ.. తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా పేరు “ఫ్రీలాన్స్”. ఓ దేశ అధినేత రిటైర్డ్ మిలటరీ ఆఫీసర్ ను ఎందుకు చంపాలనుకున్నాడు.. అనే పాయింట్ పైన ఈ సినిమా కొనసాగుతూ ఉంటుంది. అటు యాక్షన్ సీన్స్ తో పాటు.. కొన్ని కామెడీ సీన్స్ కూడా ఓటీటీ ప్రేక్షకులను బాగానే మెప్పించాయి. కాబట్టి ఇప్పటివరకు ఈ సినిమాను ఎవరైనా మిస్ అయితే మాత్రం వెంటనే చూసేయండి.

ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. మాసన్ పెట్టిట్స్ అనే అతను యూఎస్ స్పెషల్ ఫోర్స్ టీమ్ లో పని చేస్తూ ఉంటాడు. అయితే .. ఓ సీక్రెట్ ఆపరేషన్ లో భాగంగా అతను తీవ్రంగా గాయపడతాడు. దీనితో అతనిని ఆర్మీ నుంచి తప్పిస్తారు. ఇక ఆ తర్వాత అతను లాయర్ వృత్తిని ఎన్నుకుంటాడు. అక్కడ సరైన ఆదాయం లేకపోవడంతో… డబ్బుల కోసం.. ఓ జర్నలిస్ట్ లు ప్రైవేట్ సెక్యూరిటీ ఆఫీసర్ గా పని చేయడానికి అగ్రిమెంట్ కుదుర్చుకుంటాడు. అయితే, పాల్డోనియా అధ్య‌క్షుడు వెనెగాస్‌ను ఇంట‌ర్వ్యూ చేసి బాగా ఫేమస్ అవ్వాలని.. ఆ జర్నలిస్ట్ కల. దీనితో ఆమెతో కలిసి ఇతను కూడా పాల్గొనియా వెళ్తాడు. ఈ క్రమంలో దారిలో వారు ప్రయాణిస్తున్న కారుపై కొంతమంది తిరుగుబాటు దారులు దాడి చేస్తారు. ఈ ప్రమాదం నుంచి.. మాసన్ ఆ జర్నలిస్ట్ ను ఎలా కాపాడాడు ! వీరిపై అటాక్ చేసింది ఎవరు! ఆ తర్వాత ఎం జరిగింది ! డబ్బు సంపాదించాలని అనుకున్న అతని కల నెరవేరిందా లేదా ! ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి