Keerthi
వర్షకాలం కావడంతో ఈ మధ్య పలు నగరాల్లో భారీ వర్షాలు కురిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పలు చెరువులు, నదులు, కాలువలు నిండిపోవడం అందులోని చెత్త చెదారం అన్ని రోడ్లపై వరదలా పారుతున్నాయి. అయితే తాజాగా నగరంలోని ఓ ప్రాంతంలో ఈ నీటి ప్రవాహం కారణంగా ఓ భారీ మొసలి రోడ్డుపై చక్కర్లు కొడుతుంది. కాగా, ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
వర్షకాలం కావడంతో ఈ మధ్య పలు నగరాల్లో భారీ వర్షాలు కురిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పలు చెరువులు, నదులు, కాలువలు నిండిపోవడం అందులోని చెత్త చెదారం అన్ని రోడ్లపై వరదలా పారుతున్నాయి. అయితే తాజాగా నగరంలోని ఓ ప్రాంతంలో ఈ నీటి ప్రవాహం కారణంగా ఓ భారీ మొసలి రోడ్డుపై చక్కర్లు కొడుతుంది. కాగా, ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
Keerthi
ప్రస్తుతం వర్షకాలం కావడంతో.. పలు నగరాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిస్తున్నాయి. ఈ క్రమంలోనే పలు చెరువులు, నదులు, కాలువలు నిండిపోవడం అందులోని చెత్త చెదారం అన్ని రోడ్లపై వరదలా పారుతున్నాయి. ముఖ్యంగా ప్రముఖ నగరాల్లో అయితే వర్షం పడితే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రోడ్డు మీద ప్రయాణం చేయాలంటేనే కష్టంగా ఉంటుంది. ఎందుకంటే.. ఎక్కడ పడితే అక్కడ గోతులు, డ్రైనేజి నీళ్లతో వరద నిండిపోయుంటుందనే విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. సాధారణంగా భారీ మొసళ్లును మనం జూలలో, నదుల్లో, చెరువుల్లో చూస్తుంటాం. కానీ, తాజాగా ఓ నగరంలో మాత్రం వర్ష కారణంతో నీటి ప్రవాహంలో రోడ్డు మీదకు వచ్చి చక్కర్లు కొడుతుంది.కాగా, ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకి ఎక్కడంటే..
ఇటీవలే మహారాష్ట్రలోని భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. దీంతో నగరంలో రోడ్డు పై వరద నీరు పోటెత్తుతుంది. అయితే ఈ వరదం నీటి ప్రవాహం కారణంగా తాజాగా రత్నగిరి జిల్లాలోని ఓ భారీ మోసలి రోడ్డు మీదకు కొట్టుకు వచ్చింది. దీంతో రోడ్డుపై అర్ధరాత్రి ప్రయాణిస్తున్న వాహనదారులు ఈ దృశ్యన్ని చూసి షాక్ అయ్యారు. కాగా, ఈ ఘటన కొంకణ్ లోని చిఫ్లూన్ లో చోటు చేసుకుంది. అంతేకాకుండా.. ఆ భారీ మొసలికి సంబంధించిన వీడియో నెట్టంట వైరల్ గా మారింది. ఇక ఆ వీడియోలో ఆ భారీ మొసలి రోడ్డుపై నెమ్మదిగా నడుచుకుంటూ రావడంతతో.. వాహనదారులు, స్థానిక ప్రజలు భయందోళనకు గురయ్యారు. మరి కొందరు వాహనాదారులు అయితే మొసలిని వెంబడిస్తూ వీడియో కూడా తీశారు. అయితే కొద్దిసేపటికి ఆ మొసలి రోడ్డు పై నుంచి వెళ్ిపోయింది. ఇకపోతే సమీపంలో ఓ పెద్ద చెరువు ఉందని దాన్ని నుంచి బయటకు వచ్చుంటుదని అందరూ అభిప్రాయపడుతున్నారు.
అయితే ఈ భారీ మొసలి సంచరిస్తుండటంతో స్థానికుల ప్రజలు భయాందోళన గురయ్యారు. అలాగే అధికారులు వెంటనే స్పందించి మొసలిని నదిలోకి పంపించేలా చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి, రోడ్డు వర్షం నీటి ప్రవాహం కారణంగా అర్థరాత్రి రోడ్డు పై భారీ మొసలి సంచరించిన ఈ ఘటన పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Maharashtra’s Ratnagiri gets an unexpected visitor – an 8-foot crocodile takes a nighttime stroll through the flooded streets
.
.
.
.#Chiplun #Maharashtra #Ratnagiri #Crocodile #India #IndianMonsoon pic.twitter.com/03a0jqZ4bO— WION (@WIONews) July 1, 2024