iDreamPost
android-app
ios-app

ప్రజలకు TGS RTC శుభవార్త! త్వరలో అందుబాటులోకి ఆ బస్సులు..

Telangana Electric Buses: తెలంగాణ ఆర్టీసీ తరచూ ప్రజలకు ఏదో ఒక శుభవార్త చెబుతోంది. గతంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన సంగతి తెలిసింది. తాజాగా సామాన్య ప్రజలకు మరో గుడ్ న్యూస్ చెప్పింది.

Telangana Electric Buses: తెలంగాణ ఆర్టీసీ తరచూ ప్రజలకు ఏదో ఒక శుభవార్త చెబుతోంది. గతంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన సంగతి తెలిసింది. తాజాగా సామాన్య ప్రజలకు మరో గుడ్ న్యూస్ చెప్పింది.

ప్రజలకు TGS RTC శుభవార్త! త్వరలో అందుబాటులోకి ఆ బస్సులు..

సామాన్య ప్రజలకు తమ గమన్య స్థానాలు చేరుకోవడంలో ఆర్టీసీది కీలక పాత్ర ఉంటుంది. నిత్యం ఎంతో మంది ఆర్టీసీ బస్సుల ద్వారా తమ గమ్యస్థానాలకు చేరుతుంటారు. ఇక ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ అధికారులు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అలానే తెలంగాణ ఆర్టీసీ కూడా తరచూ ప్రజలకు ఏదో ఒక శుభవార్త చెబుతోంది. గతంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన సంగతి తెలిసింది. అలానే పండగల సమయాల్లో ప్రయాణికులకి బంపర్ ఆఫర్లు ప్రకటిస్తుంది. తాజాగా పల్లె ప్రాంతాల ప్రజలకు టీజీఎస్ ఆర్టీసీ ఓ శుభవార్త చెప్పింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

వాతావరణ పొల్యూష్యన్ తగ్గించేందుకు ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్ లోకి వచ్చిన సంగతి తెలిసింది. ఇప్పటికే ఈవీ వాహనాలను చాలా మంది వినియోగిస్తున్నారు. అలానే పలు రాష్ట్రాలు కూడా ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతున్నాయి. అలానే తెలంగాణ ఆర్టీసీ కూడా ఈవీ బస్సులను వినియోగిస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ఎలక్ట్రిక్ బస్సులను టీజీఎస్ ఆర్టీసీ నడుపుతుంది. ఇదే సమయంలో వీటి విషయంలో ఆర్టీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఎలక్ట్రిక్ బస్సు సర్వీసులను రాష్ట్రవ్యాప్తంగా నడపాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఇటీవలే హైదరాబాద్ విజయవాడ మధ్య ప్రయోగాత్మకంగా గరుడ ప్లస్ మోడల్ లో 10 ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ నడిపింది. ఈ క్రమంలోనే తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఎలక్ట్రిక్ బస్సులను నడపాలని నిర్ణయించింది.

TGS RTC

పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్, సూపర్ లగ్జరీ కేటగిరీల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఆర్టీసీ అధికారులు కీలక విషయాలను వెల్లడించారు. కొత్తగా 450 ఎలక్ట్రిక్  బస్సులు రాష్ట్రానిక రానున్నట్లు తెలిపారు. మరో వారం రోజుల తరువాత దశలవారీగా ఈ బస్సులు రోడ్డెక్కనున్నాయని ఆర్టీసీ తెలిపింది. హైదరాబాద్ నుండి నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, సూర్యాపేట మధ్య ఈ కొత్త ఎలక్ట్రిక్ బస్సు సర్వీసులు నడవనున్నాయని తెలుస్తోంది. నేషనల ఎలక్ట్రిక్ బస్ కార్యక్రమం కింద 450 బస్సులు మంజూరైనట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. మొత్తంగా పల్లె ప్రాంతాల్లో కూడా ఈ ఎలక్ట్రిక్ బస్సులు పరుగులు తీయనున్నాయి.

తెలంగాణ ఆర్టీసీ  ప్రయాణికుల సౌకర్యానికి పెద్ద పీట వేస్తుంది. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటుంది. అలానే ఆర్టీసీకీ సంబంధించిన తీసుకునే నిర్ణయాలను  ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తున్నారు. అలానే రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలకుగా తగిన సూచనలు చేస్తున్నారు. అలానే ఆర్టీసీలో ఉత్తమ సేవలు చేసిన వారికి సత్కారాలు చేస్తున్నారు. అలానే పండగల వేళ టికెట్ల ధరల్లో రాయితీ కల్పిస్తున్నారు. అలానే ఎలక్ట్రిక్ బస్సులను పల్లె ప్రాంతాలకు కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నారు. మరి.. టీజీఎస్ ఆర్టీసీ తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.