iDreamPost
android-app
ios-app

OTT Suggestion: ఫాదర్ తో దెయ్యం ఆ పని.. OTT లో భయంకరమైన అడల్ట్ హర్రర్ మూవీ

  • Published Jul 01, 2024 | 5:45 PM Updated Updated Jul 01, 2024 | 5:45 PM

Best Adult Horror Movie In OTT: దెయ్యాలు , భూతాలు, పిశాచాలు ఇలాంటి వాటి మీద ఎన్ని సినిమాలు వచ్చినా కానీ.. ప్రతి సినిమాలో ఎదో ఒక కొత్త కాన్సెప్ట్ ప్రేక్షకులను మెప్పిస్తునే ఉంటుంది. ఇప్పుడు చెప్పుకునేది కూడా ఇలాంటి ఓ సినిమా గురించే. మరి ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

Best Adult Horror Movie In OTT: దెయ్యాలు , భూతాలు, పిశాచాలు ఇలాంటి వాటి మీద ఎన్ని సినిమాలు వచ్చినా కానీ.. ప్రతి సినిమాలో ఎదో ఒక కొత్త కాన్సెప్ట్ ప్రేక్షకులను మెప్పిస్తునే ఉంటుంది. ఇప్పుడు చెప్పుకునేది కూడా ఇలాంటి ఓ సినిమా గురించే. మరి ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

  • Published Jul 01, 2024 | 5:45 PMUpdated Jul 01, 2024 | 5:45 PM
OTT Suggestion: ఫాదర్ తో  దెయ్యం ఆ పని.. OTT లో భయంకరమైన అడల్ట్ హర్రర్ మూవీ

హర్రర్ సినిమాలకు విపరీతంగా క్రేజ్ పెరుగుతుంది. ఈ జోనర్ లో ఎన్ని సినిమాలను చూసినా కానీ ఇంకా చాలానే సినిమాలు మిగిలే ఉంటున్నాయి. ఉన్న సినిమాలనే ప్రేక్షకులు కొన్ని సార్లు మిస్ చేస్తున్నారంటే.. ఇప్పుడు వారి ఇంట్రెస్ట్ కు తగినట్లు కొత్త సినిమాలను కూడా తెరకెక్కిస్తున్నారు మేకర్స్. దెయ్యాలు , భూతాలు, పిశాచాలు ఇలాంటి వాటి మీద ఎన్ని సినిమాలు వచ్చినా కానీ.. ప్రతి సినిమాలో ఎదో ఒక కొత్త కాన్సెప్ట్ ప్రేక్షకులను మెప్పిస్తునే ఉంటుంది. మరి ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో లెక్కలేనన్ని హర్రర్ సినిమాలు ఉన్నాయ్ కాబట్టి.. వీటిలో ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాను కానీ మీరు మిస్ చేశారేమో ఓ లుక్ వేసేయండి. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఈ సినిమాలో మంగ్లీ అనే అమ్మాయిని ఓ దెయ్యం ఆవహిస్తుంది. దీనితో ఆ దెయ్యాన్ని మంగ్లీ శరీరంలో నుంచి తొలగించడానికి ఓ ఫాదర్ ను పిలిపిస్తారు కుటుంబ సభ్యులు. ఆ ఫాదర్ మంగ్లీ శరీరం నుంచి దెయ్యాన్ని వదిలించే క్రమంలో తన రూమ్ లో ఓ కెమెరాను ఫిక్స్ చేస్తాడు. ఈ క్రమంలోనే ఆ ఫాదర్ మంగ్లీతో ప్రేమలో పడతాడు. ఆ విషయం మంగ్లీ శరీరంలో ఉన్న దెయ్యానికి తెలిసిపోతుంది. కాసేపటికి ఫాదర్ చదివే మంత్రాలకు ఆ దెయ్యం తనని వదిలి వెళ్ళిపోతుంది. వెంటనే మంగ్లీ ఆ ఫాదర్ ను కిస్ చేయడంతో.. ఫాదర్ కూడా ఆమెతో శారీరకంగా కలుస్తాడు. ఈ విషయాలన్నీ కూడా కెమెరాలో రికార్డు అవుతూ ఉంటాయి. కట్ చేస్తే ఇక్కడ స్టోరీని 18 సంవత్సరాల తర్వాత చూపిస్తారు. ఓ జైల్లో గార్డు.. ఖైదీలందరికి భోజనం ఇస్తూ ఉంటాడు. అందులో ఓ ఖైదీకి ఫుడ్ ఇస్తుండగా.. ఆ ఖైదీ గార్డు చేయి కొరికేస్తుంది. మరో వైపు ఆ ఫాదర్ మంగ్లీ విషయంలో చేసిన దానికి ఇంకా ఫీల్ అవుతూనే ఉంటాడు. తనకంటే సీనియర్ ఫాదర్ దగ్గరకీ వెళ్ళి తన తప్పు ఒప్పుకుంటాడు.

ఇక ఓ రోజు రాత్రి… ఆ జైలు నుంచి ఫాదర్ కు కాల్ వస్తుంది. జైలులో ఖైదీల పరిస్థితి ఏమి బాలేదని.. డాక్టర్స్ కంటే కూడా.. అక్కడ ఫాదర్ అవసరమే ఎక్కువగా ఉందని చెప్పడంతో.. ఫాదర్ ఆ జైలుకు వెళ్తాడు. అక్కడ ఓ అమ్మాయి.. అచ్చం మంగ్లీ లానే ప్రవర్తిస్తూ ఉంటుంది. అది చూసి అతను షాక్ అయ్యి.. నేను దెయ్యాలను వదిలించడం మానేసానని.. అక్కడినుంచి తప్పించుకోవాలని చూస్తాడు. సరిగ్గా అదే సమయానికి అక్కడకు మంగ్లీ వస్తుంది. తాను మన అమ్మయేనని ఆ ఫాదర్ కు చెప్తుంది. దీనితో ఆ ఫాదర్ ఆమెను ఎలా అయినా రక్షించాలని అనుకుంటాడు. దానికోసం సీనియర్ ఫాదర్ హెల్ప్ కూడా తీసుకుంటాడు. కానీ ఆ దెయ్యం ఆ ఫాదర్స్ మంత్రాలకు అసలు లొంగదు. ఆ తర్వాత ఏం జరిగింది ! ఆ దెయ్యం అదే రీతిలో మంగ్లీ కూతురు శరీరంలోకి ఎందుకు ప్రవర్తించింది! ఆ తర్వాత కథ ఎలా ముందుకు సాగింది! వారు ఆ దెయ్యాన్ని వదిలించారా లేదా ! ఇవన్నీ తెలియాలంటే.. “ది ఎక్సార్సిజం ఆఫ్ గాడ్” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాను ఎవరైనా మిస్ చేస్తే వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

jojobet girişmarsbahiscasibomJojobet GirişcasibomJojobet GirişCasibomcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobetJojobet GirişHoliganbetHoliganbet Giriş