iDreamPost
android-app
ios-app

BSNL అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్ టెల్ కు దిమ్మతిరిగే షాక్!

BSNL Recharge Plans: మొబైల్ వినియోగదారులకు షాకిస్తూ టెలికాం సంస్థలు రీఛార్జ్ ప్లాన్ ధరలను పెంచిన విషయం తెలిసిందే. అయితే బీఎస్ ఎన్ ఎల్ తీసుకొచ్చిన సరికొత్త రీఛార్జ్ ప్లాన్ ఎయిర్ టెల్, జియోలకు షాకిస్తోంది.

BSNL Recharge Plans: మొబైల్ వినియోగదారులకు షాకిస్తూ టెలికాం సంస్థలు రీఛార్జ్ ప్లాన్ ధరలను పెంచిన విషయం తెలిసిందే. అయితే బీఎస్ ఎన్ ఎల్ తీసుకొచ్చిన సరికొత్త రీఛార్జ్ ప్లాన్ ఎయిర్ టెల్, జియోలకు షాకిస్తోంది.

BSNL అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్ టెల్ కు దిమ్మతిరిగే షాక్!

మొబైల్ యూజర్లకు టెలికాం కంపెనీలు షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. దిగ్గజ టెలికాం సంస్థలైన రిలయన్స్ జియో, ఎయిర్ టెల్ ఫోన్ రీఛార్జ్ ధరలను భారీగా పెంచుతూ ప్రకటించాయి. ప్రస్తుత రోజుల్లో మొబైల్ వినియోగం తప్పనిసరి అయిపోయింది. ఫోన్ రీఛార్జ్ చేయకతప్పడం లేదు. ఒక వేళ రీఛార్జ్ చేయకపోతే సర్వీసులు నిలిపివేస్తున్నాయి టెలికాం సంస్థలు. టారిఫ్ ల పెంపుతో మొబైల్ యూజర్లకు మరింత ఆర్థికభారంగా మారింది. రిలయన్స్ జియో మొబైల్ టారిఫ్‌లలో 12-27 శాతం పెంపును ప్రకటించింది. ఎయిర్ టెల్ రీఛార్జ్ ధరలను 10-21 శాతం పెంచింది. జులై 3 నుంచి పెంచిన ధరలు అమల్లోకి రానున్నాయి. అయితే పెరిగిన రీఛార్జ్ ధరలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న యూజర్లకు బీఎస్ఎన్ఎల్ గుడ్ న్యూస్ అందించింది.

దిగ్గజ టెలికాం కంపెనీలు రీఛార్జ్ ప్లాన్ ధరలను పెంచడంతో చాలా మంది బీఎస్ఎన్ఎల్ కు మారేందుకు రెడీ అవుతున్నారు. బీఎస్ ఎన్ ఎల్ లో తక్కువ ధరకే కళ్లు చెదిరే బెనిఫిట్స్ వస్తుండడంతో ఎయిర్ టెల్, జియో యూజర్లు నెట్ వర్క్ మార్చుకునేందుకు ఇంట్రెస్టు చూపిస్తున్నారు. ఈ క్రమంలో బీఎస్ఎన్ఎల్ అదిరిపోయే ప్లాన్ ను తీసుకొచ్చింది. తాజాగా కొత్త రూ. 249 రీఛార్జ్ ప్లాన్ ను ప్రకటించింది. ఈ ప్లాన్ ద్వారా ఎయిర్ టెల్, జియోలకు గట్టి షాక్ తగిలినట్లైంది. జియో తెచ్చిన రూ. 249 ప్లాన్ తో 45 రోజుల పాటు వ్యాలిడిటీని పొందొచ్చు. రోజుకు 2జీబీ డేటా వస్తుంది.

అపరిమిత ఉచిత కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు పొందొచ్చు. ఇదే రూ. 249 ప్లాన్ ఎయిర్ టెల్ నెట్ వర్క్ లో అయితే 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. రోజుకు 1జీబీ మాత్రమే అందిస్తుంది. ఈ ప్లాన్ ద్వారా ఎయిర్ టెల్ తో పోలిస్తే బీఎస్ఎన్ఎల్ లో 17 రోజులు అదనంగా పొందొచ్చు. బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన ఈ సూపర్ ప్లాన్ తో మొబైల్ యూజర్లు ఈ నెట్ వర్క్ కు మారేందుకు సిద్దమవుతున్నారు. బీఎస్ఎన్ఎల్ నుంచి తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్స్ వస్తే మాత్రం ఎయిర్ టెల్, జియోలకు భారీ షాక్ తగలనున్నట్లు నిపుణులు తెలుపుతున్నారు.

ఎయిర్‌టెల్ తో బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్లాన్ ను పోల్చినట్లైతే..

ఎయిర్‌టెల్ రూ.249 ప్లాన్:

  • 28 రోజులు చెల్లుబాటు అవుతుంది.
    రోజుకు 1GB డేటా.

BSNL యొక్క రూ 249 ప్లాన్:

  • 45 రోజులు చెల్లుబాటు అవుతుంది.
    రోజుకు 2GB డేటా.
    ఎయిర్‌టెల్ తో పోలిస్తే బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్లాన్ మరో 17 రోజులు అదనంగా వస్తుంది.