iDreamPost

కల్కి 2898 ఏడీలో చిన్నారి రాయ.. ఎంత పెద్దది అయిపోయిందో

Kalki 2898 AD Child Artist.. ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన చిత్రం కల్కి 2898 ఏడీ. ఈ మూవీలో నటించిన పాప రాయ గుర్తుందా.. ట్రైలర్లలో కూడా తన డైలాగులతో ఆకట్టుకుంది. చూడటానికి బాయ్ లుక్కులో కనిపించిన ఈ పాప అప్పుడే హీరోయిన్ మెటీరియల్ ను తలపిస్తోంది.

Kalki 2898 AD Child Artist.. ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన చిత్రం కల్కి 2898 ఏడీ. ఈ మూవీలో నటించిన పాప రాయ గుర్తుందా.. ట్రైలర్లలో కూడా తన డైలాగులతో ఆకట్టుకుంది. చూడటానికి బాయ్ లుక్కులో కనిపించిన ఈ పాప అప్పుడే హీరోయిన్ మెటీరియల్ ను తలపిస్తోంది.

కల్కి 2898 ఏడీలో చిన్నారి రాయ.. ఎంత పెద్దది అయిపోయిందో

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి 2898 ఏడీ బాక్సాఫీపు దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. డార్లింగ్ ప్రభాస్ స్టామినా ఏంటో మరోసారి చూపించిన చిత్రంగా మారింది. నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 555 కోట్లకు పైగా కలెక్షన్ల వర్షం కురిపించింది. నాలుగేళ్ల శ్రమకు తగ్గ ప్రతిఫలం దక్కినట్లయ్యింది. బాలీవుడ్ నుండి మాలీవుడ్ వరకు ఎంతో మంది స్టార్లు, టెక్నీషియన్లు ఇందులో భాగస్వామ్యం అయ్యారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి దిగ్గజ స్టార్లే కాకుండా దీపికా పడుకొనే, దిశా పటానీ వంటి బాలీవుడ్ ముద్దుగుమ్మలకు తోడు.. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, ఫరియా అబ్దుల్లా, అన్నాబెన్, శోభన, ఆర్జీవి, రాజమౌళి, అనుదీప్ వంటి స్టార్ క్యామియోల్లో నటించారు.

ఇక ఈ సినిమాలో కీలక రోల్ చేసిందో.. రాయ పాత్రలో మెప్పించింది. ఆ పాప ట్రైలర్‌లో కూడా కనిపించింది. అశ్వత్థామ దగ్గర కనిపిస్తుంది. ‘నీలాంటోడు ఎంత మందిని రక్షించొచ్చో తెలుసా’, ‘ మీ యుద్ధం మళ్లీ మొదలైనట్లు ఉంది’తో డైలాగులతో ఆకట్టుకుంది. కానీ సినిమాలో మంచి రోల్ ప్లే చేసింది. ట్రైలర్ చూసి చాలా మంది బాయ్ అనుకుంటారు కానీ.. ఆమె పాప. ఆమె పేరు కేయా నాయర్. చైల్డ్ ఆర్టిస్టుగా ఆమెకు ఇది తొలి సినిమాలా కనిపిస్తుంది. అయితే ఈ పాప బయట ఎలా ఉందో తెలుసా..? చూడటానికి చిన్న పిల్లలా ఉంది కానీ అప్పుడే మతిపోగొడుతుంది. ఏంటీ ఈ పిల్ల అప్పుడే ఇంత పెద్దదయ్యిందా అనుకోవడం ఖాయం. ఈ సినిమా నాలుగేళ్లుగా తెరకెక్కిన సంగతి విదితమే. దీంతో కల్కిలో పాపగా ఆకట్టుకున్న కేయా.. ఇప్పుడు హీరోయిన్ మెటీరియల్ అయిపోయింది.

2020 ఫిబ్రవరిలో ఈ సినిమాను ప్రకటించాడు నాగ్ అశ్విన్. ప్రభాస్ 21 పేరుతో ప్రకటించగా.. వర్కింగ్ టైటిల్ ప్రాజెక్ట్ కేగా మార్చారు. కోవిడ్ కారణంగా సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఆ తర్వాత మెల్లిగా సినిమా షూటింగ్ మొదలైంది. ఈ క్రమంలో అమితాబ్, కేయా మధ్య సన్నివేశాలను తెరకెక్కించినట్లు తెలుస్తుంది. ఈ నాలుగేళ్ల గ్యాపులో పాప.. చూస్తుండగానే పెద్దదిగా మారిపోయింది. మొత్తానికి సినిమా హిట్ కొట్టడంతో చిత్ర యూనిట్ తో పాటు ఆమె కూడా సంతోషాన్ని వ్యక్తం చేసింది. తన స్నేహితులతో కలిసి కల్కి మూవీ చూసిన కేయా.. ఆనందంలో మునిగి తేలిపోతుంది. అలాగే బుజ్జితో కలిసి ఫోటోలు దిగి… సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. తన ఫ్రెండ్స్ తో కలిసి బుజ్జి ముందు ఫోటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి