iDreamPost

ఏఐ ఫీచర్స్ ఉన్న ఫోన్ కొనాలా? 2024లో టాప్ ఏఐ స్మార్ట్ ఫోన్స్ ఇవే!

Top AI Smartphones In 2024: ఇప్పుడంతా ఏఐ ట్రెండ్ నడుస్తోంది. స్మార్ట్ ఫోన్ కంపెనీలు కూడా తమ ఫోన్లలో ఏఐ ఫీచర్స్ ని తీసుకొస్తున్నాయి. మరి మీరు ఏఐ స్మార్ట్ ఫోన్స్ కొనే ఆలోచనలో ఉంటే కనుక బెస్ట్ ఏఐ స్మార్ట్ ఫోన్స్ జాబితా మీ కోసం.

Top AI Smartphones In 2024: ఇప్పుడంతా ఏఐ ట్రెండ్ నడుస్తోంది. స్మార్ట్ ఫోన్ కంపెనీలు కూడా తమ ఫోన్లలో ఏఐ ఫీచర్స్ ని తీసుకొస్తున్నాయి. మరి మీరు ఏఐ స్మార్ట్ ఫోన్స్ కొనే ఆలోచనలో ఉంటే కనుక బెస్ట్ ఏఐ స్మార్ట్ ఫోన్స్ జాబితా మీ కోసం.

ఏఐ ఫీచర్స్ ఉన్న ఫోన్ కొనాలా? 2024లో టాప్ ఏఐ స్మార్ట్ ఫోన్స్ ఇవే!

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడు ముఖ్యమైన ఫీచర్ గా మారిపోయింది. స్మార్ట్ ఫోన్ కొనేవారు ఏఐ ఫీచర్స్ ఉన్నాయా లేదా అని చూస్తున్నారు. హై ఎండ్ స్మార్ట్ ఫోన్ కొనేముందు ఏఐ ఫీచర్స్ ఉన్నాయో లేదా అని చూస్తున్నారు. ప్రతి ఒక్క బ్రాండ్ కూడా తమ ఫ్లాగ్ షిప్ ఫోన్లలో ఏఐని ఉంచుతుంది. శామ్ సంగ్ గెలాక్సీ ఏఐని వాడుతుండగా.. యాపిల్ కంపెనీ యాపిల్ ఇంటెలిజెన్స్ ని అందిస్తుంది. అయితే మీరు 2024లో ఏఐ ఫీచర్స్ కలిగిన హై ఎండ్ ఫ్లాగ్ షిప్ ఫోన్ ని కొనాలనుకుంటే గనుక ఈ 5 స్మార్ట్ ఫోన్స్ గురించి తెలుసుకోండి. 

శామ్ సంగ్ గెలాక్సీ ఎస్ 24 అల్ట్రా:

శామ్ సంగ్ ఎస్ 24 సిరీస్ లో గెలాక్సీ ఏఐని పరిచయం చేసింది. అయితే స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్ తో వస్తున్న గెలాక్సీ ఎస్ 24 అల్ట్రా ఫోన్ మాత్రం బెస్ట్ ఏఐ ఫీచర్స్ ని కలిగి ఉన్న ఫోన్ గా ఉంది. సర్కిల్ టూ సెర్చ్, లైవ్ కాల్ ట్రాన్స్ లేషన్, ఇమేజ్ ఎడిటింగ్ టూల్స్, రియల్ టైం ఇంటర్ప్రిటర్ వంటి ఏఐ ఫీచర్స్ ఉన్నాయి. ఈ కారణంగా శామ్ సంగ్ గెలాక్సీ ఎస్ 24 అనేది బెస్ట్ క్యాండీ బార్ స్టైల్ ఆండ్రాయిడ్ ఫోన్ గా ఉంది. ఈ ఫోన్ ధర రూ. 1,29,999గా ఉంది. కొనేందుకు, స్పెసిఫికేషన్స్ తెలుసుకోవడానికి ఈ లింక్ పై క్లిక్ చేయండి.      

శామ్ సంగ్ గెలాక్సీ ఎస్ 24:

తక్కువ ధరలో ఏఐ ఫీచర్స్ కలిగిన శామ్ సంగ్ స్మార్ట్ ఫోన్ కావాలనుకుంటే కనుక గెలాక్సీ ఎస్ 24 ఫోన్ ని ట్రై చేయండి. ఎక్సినోస్ 2400 ఎస్ఓసీ తో వస్తున్న గెలాక్సీ ఎస్ 24 కూడా ఈ సిరీస్ లో ఉన్న మిగతా మోడల్స్ లానే ఏఐ ఫీచర్స్ తో వస్తుంది. ఇది కూడా ఏడేళ్ల పాటు మేజర్ ఓఎస్ అప్డేట్స్ తో వస్తుంది. 8 జీబీ, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 74,999 ఉండగా.. ఆఫర్లో రూ. 60,490కే అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ని కొనేందుకు, అలానే స్పెసిఫికేషన్స్ తెలుసుకోవడానికి ఈ లింక్ పై క్లిక్ చేయండి. 8 జీబీ, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 79,999గా ఉంది. ఈ ఫోన్ ని కొనేందుకు, అలానే స్పెసిఫికేషన్స్ తెలుసుకోవడానికి ఈ లింక్ పై క్లిక్ చేయండి. 

యాపిల్ ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్:

ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ఈ రెండు ఫోన్స్ లో మాత్రమే యాపిల్ ఇంటెలిజెన్స్ వస్తుంది. అయితే ఈ రెండు ఫోన్లకు తేడా ఏంటంటే కేవలం స్క్రీన్ సైజ్ మాత్రమే. ఏఐ ఫీచర్స్ మాత్రం రెండు ఫోన్లలో ఒకేలా ఉంటాయి. అయితే ఈ రెండు ఐఫోన్స్ లో యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ 2025లో వస్తుంది. యాపిల్ ఐఫోన్ 15 ప్రో అసలు ధర రూ. 1,34,900 కాగా ఆఫర్లో రూ. 1,28,200కే లభిస్తుంది. ఇక యాపిల్ ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ అసలు ధర రూ. 1,59,900 కాగా ఆఫర్లో రూ. 1,51,700కే లభిస్తుంది.  యాపిల్ ఐఫోన్ 15 ప్రో ఫోన్ ని కొనుగోలు చేయడానికి, అలానే స్పెసిఫికేషన్స్ తెలుసుకోవడానికి ఈ లింక్ పై క్లిక్ చేయండి. యాపిల్ ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ఫోన్ ని కొనుగోలు చేయడానికి, అలానే స్పెసిఫికేషన్స్ తెలుసుకోవడానికి ఈ లింక్ పై క్లిక్ చేయండి.   

గూగుల్ పిక్సెల్ 8 ప్రో:

స్థానికంగా స్మాల్ లాంగ్వేజ్ మోడల్ జెమినీ నానోని రన్ చేయగల స్మార్ట్ ఫోన్లలో ‘గూగుల్ ఫ్లాగ్ షిప్ పిక్సెల్ 8 ప్రో’ ఫోన్ ఒకటి. జెమినీ నానో అనేది ప్రైవేట్ అండ్ లో-లేటెన్సీ జనరేటివ్ ఏఐ ఎక్స్ పీరియన్స్ తో వస్తుంది. టెన్సర్ జీ3 ప్రాసెసర్ తో వస్తున్న గూగుల్ పిక్సెల్ 8 ప్రో ఫోన్.. కెమెరా పవర్ హౌస్ గా ఉంది. అలానే మోస్ట్ ప్రీమియం ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్ జాబితాలో ఒకటిగా ఉంది. ఆన్ లైన్లో దీని ధర రూ. 99,999గా ఉంది. ఈ ఫోన్ ని కొనుగోలు చేయడానికి, అలానే స్పెసిఫికేషన్స్ తెలుసుకోవడానికి ఈ లింక్ పై క్లిక్ చేయండి.   

వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రో:

ఫోల్డబుల్ ఫోన్లలో ఏఐ ఫీచర్స్ కలిగిన ఫోన్లలో ‘వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రో’ ఒకటి. వివో జనరేటివ్ ఏఐ నుంచి వచ్చిన తొలి స్మార్ట్ ఫోన్ ఇదే. ఏఐ ట్రాన్స్క్రిప్ట్ అసిస్ట్, రియల్ టైమ్ ట్రాన్స్ లేషన్ ఫీచర్స్ ఉన్నాయి. మీరు కనుక మోర్ పవర్ ఫుల్ ఫోల్డబుల్ ఫోన్ ని.. ఏఐ ఫీచర్స్ ఉన్న ఫోన్ ని కొనాలి అని అనుకుంటే కనుక వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రో ఫోన్ బెస్ట్ అని చెప్పవచ్చు. ఆన్ లైన్ లో దీని అసలు ధర రూ. 1,69,999 కాగా డిస్కౌంట్ లో రూ. 1,59,999 పడుతుంది. ఈ ఫోన్ ని కొనుగోలు చేయడానికి, అలానే స్పెసిఫికేషన్స్ తెలుసుకోవడానికి ఈ లింక్ పై క్లిక్ చేయండి. 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి