iDreamPost
android-app
ios-app

రాత్రి 11 గంటల వరకు సభ.. రెండు బిల్లులకు ఆమోదం

రాత్రి 11 గంటల వరకు సభ.. రెండు బిల్లులకు ఆమోదం

అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ బిల్లుకు ఆంధ్రప్రదేశ్‌ శాసన సభ ఆమోదం తెలిపింది. సోమవారం మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న అంశంపై శాసనసభ ప్రత్యేక సమావేశాలు నిర్వహించింది. ఈ సమావేశాలు రాత్రి 11 గంటల వరకు కొనసాగాయి. సుధీర్ఘ చర్చల అనంతరం ఏపీ అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ.. సీఆర్‌డీఏ రద్దు, దాని స్థానంలో ఏఎంఆర్డిఏ ఏర్పాటు బిల్లులకు శాసన సభ ఆమోదం తెలిపింది.

Read Also: ముఖ్యమంత్రి నిర్ణయంతో సీమలో సంబరాలు

విశాఖపట్నం పరిపాలనా రాజధాని, అమరావతి శాసన రాజధాని, కర్నూలు న్యాయ రాజధానిగా బిల్లు ఆమోదం పొందింది. అనంతరం సీఆర్‌డీఏ ఉపసంహరణ బిల్లును ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఆమోదించింది. ఈ బిల్లులను ఈ రోజు శాసన మండలి ముందుకు రానున్నాయి.