iDreamPost
android-app
ios-app

టాలీవుడ్ క్రేజీ కాంబినేషన్ – RRR తర్వాత

  • Published Apr 18, 2020 | 6:44 AM Updated Updated Apr 18, 2020 | 6:44 AM
  • Published Apr 18, 2020 | 6:44 AMUpdated Apr 18, 2020 | 6:44 AM
టాలీవుడ్ క్రేజీ కాంబినేషన్ – RRR తర్వాత

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎప్పటి నుంచో కలగంటున్న ఘడియలు త్వరలోనే రాబోతున్నాయి. టాలీవుడ్ స్టీవెన్ స్పిల్బర్గ్ జక్కన్న అలియాస్ రాజమౌళి దర్శకత్వంలో నటించబోయే క్షణాలకు రంగం సిద్ధమవుతోంది. ఎవరో చెబితే ఇది పుకారు అవుతుంది కానీ స్వయానా దర్శకుడే చెబితే అంతకన్నా కన్ఫర్మేషన్ ఇంకేం కావాలి. ఇవాళ ఓ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన వీడియో ముఖాముఖీలో రాజమౌళి తనే దీని గురించిన సమాచారం చెప్పేశారు.

మహేష్ బాబుతో దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై డాక్టర్ కెఎల్ నారాయణ నిర్మించబోయే చిత్రానికి కమిట్ అయినట్టు చెప్పేశారు.ఇంతకు మించి డీటెయిల్స్ అయితే ఇవ్వలేదు. ఇది పాన్ ఇండియా లెవెల్ లో ఉంటుందని మళ్ళీ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాకపోతే బాహుబలి, ఆర్ఆర్ఆర్ తరహాలో ఫాంటసీ జానర్ లో ఉంటుందా లేక విక్రమార్కుడు తరహాలో కమర్షియల్ ఫార్మట్ లో చేస్తారా అనేది మాత్రం చెప్పలేదు. సో బ్యాక్ గ్రౌండ్ విజయేంద్ర ప్రసాద్ గారు దీనికి సంబంధించిన కథా రచనలో బిజీగా ఉన్నట్టు అర్థమైపోయింది. కీరవాణి సంగీతం అందిస్తారని కొత్తగా చెప్పనక్కర్లేదు.

మిగిలిన టెక్నికల్ టీమ్ వివరాలు మాత్రం ఇప్పట్లో బయటికి వచ్చే అవకాశాలు లేవు.ఈ లాక్ డౌన్ టైం లో టాలీవుడ్ లవర్స్ ఇదే బిగ్గెస్ట్ న్యూస్ అని చెప్పాలి . ఇప్పటికి 27 సినిమాల ప్రయాణాన్ని చేసిన మహేష్ బాబుతో రాజమౌళి ఎప్పుడెప్పుడు చేస్తాడా అని అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. ప్రిన్స్ సైతం పలు సందర్భాల్లో దీని గురించి ప్రస్తావించాడు కూడా. సో ఇప్పుడు పరశురాంతో ప్రాజెక్ట్ పూర్తవ్వగానే రాజమౌళి చేయడం కన్ఫర్మ్. ఇక హీరొయిన్, కథ ఏ జానర్ లో ఉంటుందన్న సస్పెన్స్ కాసేపు పక్కనపెడితే మహేష్ దీని కోసం ఎన్ని సంవత్సరాలు త్యాగం చేయాలో మరి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobet