iDreamPost
android-app
ios-app

వకీల్ సాబ్ వచ్చేశాడు : అఫీషియల్

  • Published Mar 02, 2020 | 1:41 PM Updated Updated Mar 02, 2020 | 1:41 PM
వకీల్ సాబ్ వచ్చేశాడు : అఫీషియల్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండేళ్ళ విరామం తర్వాత చేస్తున్న సినిమాగా రూపొందుతున్న పిఎస్ పికె 26 తాలుకు ఫస్ట్ లుక్ తో పాటు పోస్టర్ కూడా వచ్చేసింది . నిన్నటి నుంచే అభిమానులు ఎప్పుడెప్పుడు తమ హీరోని చూస్తామాని కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియాలో సైతం ఇవాళ ట్రెండింగ్ ఘనంగా ఉండాలని ముందే పిలుపునిచ్చేశారు కూడా. గతంలో ఎన్నడూ లేని విధంగా దిల్ రాజు ఆఫీస్ దగ్గర మధ్యాన్నం 3.30 నిమిషాల నుంచే సంబరాలు మొదలుపెట్టాలని హంగామా చేశారు. మొత్తానికి భారీ కోలాహలం మధ్య పవన్ కళ్యాణ్ లాయర్ సాబ్ గా వచ్చేశాడు.

ఈ టైటిల్ చాలా రోజుల క్రితమే లాయర్ సాబ్ గా లీకయ్యింది. అయితే యూనిట్ అధికారికంగా ప్రకటించింది కాకపోవడంతో మీడియా సైతం దీన్ని ధృవీకరించలేకపోయింది. ఇప్పుడు వాటన్నింటికి చెక్ పెడుతూ టైటిల్ లో చిన్న మార్పుతో పవర్ స్టార్ కంబ్యాక్ సెలబ్రేషన్స్ మొదలైపోయాయి. గెటప్ పరంగా పవన్ మంచి రగ్డ్ లుక్ తో పర్ఫెక్ట్ అనిపించేలా ఉన్నాడు. అభిమానులు కోరుకున్న స్థాయిలో వాళ్ళను సంతృప్తిపరిచే విధంగా ఉంది. ఊహలకు భిన్నంగా విభిన్న వస్తువుల మధ్య ఓ వెహికల్ లాంటి దాని మధ్యలో కాలి మీద కాలు వేసుకుని ఉన్న పవన్ లుక్ ఫాన్స్ కి కిరాక్ అనిపించేలా ఉంది. వకీల్ సాబ్ ని దిల్ రాజు ఒరిజినల్ హక్కుదారైన బోనీ కపూర్ తో కలిసి నిర్మిస్తున్నాడు.

హిందిలో పింక్ గా తమిళ్ లో నీర్కొండ పార్వై గా రూపొందిన ఈ సీరియస్ కోర్ట్ డ్రామా అటు అమితాబ్ కు ఇటు అజిత్ కు మంచి పేరు తీసుకొచ్చింది. కెరీర్ లో మొదటిసారి లాయర్ పాత్ర పోషిస్తున్న పవన్ కు ఇది అంతకు మించిన ఫలితం ఇస్తుందని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్న వకీల్ సాబ్ మొదటి ఆడియో సింగల్ మరికొద్ది రోజుల్లో రిలీజ్ చేయబోతున్నారు. సిద్ శ్రీరామ్ గాత్రంలో వస్తోన్న ఈ పాట మీద అప్పుడే అంచనాలు మొదలైపోయాయి. మేలో రాబోతున్న వకీల్ సాబ్ హడావిడి రెండు నెలల ముందే ప్రారంభమైపోయింది.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabet