Idream media
Idream media
జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీనటుడు పవన్ కల్యాణ్ రాజధాని అమరావతిపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాయలంలో అమరావతి గ్రామాల రైతులతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేపు ఢిల్లీ వెళుతున్నానని, అద్భుతాలు జరుగుతాయన్నారు. అమరావతి ఎక్కడకీపోదని, తాను మాట ఇస్తున్నానని హామీ ఇచ్చారు. బీజేపీ పెద్దలకు ఇక్కడ పరిస్థితి వివరిస్తానని పవన్ చెప్పారు.
విశాఖకు తరలించినా.. మళ్లీ రాజధాని ఇక్కడకే వస్తుందన్నారు. రెండున్నరేళ్లలో ఈ ప్రభుత్వం పడిపోతుందని, కొత్త ప్రభుత్వం వచ్చాక అమరావతిని శాశ్వత రాజధానిగా చేస్తామని పవన్ చెప్పారు. ఈ ప్రభుత్వం ఉండకుండా ఏమి చేయాలో ఆ ప్రయత్నాలు చేస్తామన్నారు.
తెలుగుదేశం పార్టీలాగా తాను డ్రామాలు చేయనని, ఏమి చేయగలనో అదే చేస్తానన్నారు. ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత కూడా జగన్ మారతాడని తాను అనుకోనని, అయితే ఈ ప్రభుత్వం మాత్రం ఉండబోదన్నారు. మూడు కాకపోతే 30 చోట్ల రాజధానులు పెట్టుకోనీయండని, ఎన్ని చేసినా తిరిగి 30 రాజధానులను ఒక్కటి చేస్తానని హామీ ఇచ్చారు.
‘రాజధాని కోసం తెలుగుదేశం 33 వేల ఎకరాలంటే వ్యతిరేకించినవాడిని, ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై కేసులు పెట్టమన్నాను. కానీ అమరావతిని తరలిస్తానంటే నేను ఒప్పుకోను’ అని పవన్ స్పష్టం చేశారు.